ఈ ఎన్నికల్లో కాపుల నిర్ణయం కీలకం..?

March 31, 2019 | News Of 9

(న్యూస్ ఆఫ్ 9)

ఏపీలో గణనీయంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు ఈసారి మాకే వస్తాయి అని వైసీపీ, టీడీపీలు భావిస్తున్నాయి. ఈ రెండు పార్టీల ఆలోచన సరైందేనా? వారు దేని ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారన్నది పరిశీలించి చూడాలి.

తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, వైసీపీ రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోందన్నది నగ్నసత్యం. అందులో ఇసుమంత అనుమానం ఎవరికీ లేదు. 70 ఏళ్లుగా తెలుగుదేశం, అంతకు ముందున్న కాంగ్రెసు (నేటి వైఎస్సాఆర్ కాంగ్రెసు)గానీ రెండు కుటుంబాలకు చెందిన రాజకీయాలుగా చలామణీలో ఉండి… మిగిలిన 90 శాతం సామాజిక వర్గాల ప్రజల్ని రాజకీయాధికారానికి దూరంగా ఉంచాయి. కాపులు, బీసీలూ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఎప్పుడూ బిస్కెట్లు పారేసి రాజ్యాధికారాన్ని మాత్రం ఆ రెండు కుటుంబాలు లేదా ఈ రెండు సామాజిక వర్గాలు తమ చేతుల్లో తొక్కిపట్టి ఉంచారు. ఈ కారణంగానే 2009లో ప్రజారాజ్యం పార్టీ సామాజిక న్యాయ నినాదంతో 90 శాతం ప్రజల రాజకీయ ఆకాంక్షలకు ప్రతిరూపంగా అవతరించింది. అయితే, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు ప్రజారాజ్యాన్ని దొంగదెబ్బ తీసిన విషయం తెలిసిందే. కిందికులాలకు అధికారాన్ని పంచడాన్ని అవి నేటికీ ఇష్టపడటం లేదు. అందుకే పోరాటం అనివార్యమైంది. పోరాటం చెయ్యకపోతే జాలితో ఎవరూ ఏమీ ఇవ్వరు.

మరి కాపులు, బీసీలూ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు రాజ్యాధికారానికి ఇంకా దూరంగా ఉండాల్సిందేనా? వీరి ఆకాంక్షలు గాలిలో కలిసిపోవాల్సిందేనా? 2009 నుంచి మరో దశాబ్దం గడిచినా ప్రధాన పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, వైసీపీలు చేస్తున్న సామాజిక అన్యాయం కొనసాగుతూనే ఉంది. ఈ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేయగా, వైసీపీ రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది. 4.5 శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి 175 అసెంబ్లీ స్థానాలకు గాను 7 సీట్లు మాత్రమే ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ అలా ఇచ్చిందా? 7 శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి వైసీపీలో 12 సీట్లు మాత్రమే రావాలి. కానీ అలా సీట్లు ఇచ్చిందా? లేదు. అంటే సామాజికంగా అన్యాయం జరుగుతోందనేగా దీని అర్థం. డబ్బులున్న వర్గాలకే సీట్లు కేటాయించడం వల్ల నిమ్న బడుగు వర్గాలు రాజకీయ అధికారానికి అనేక దశాబ్దాలుగా దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని మార్చాలన్న ఉద్దేశంతో రాజు, పేదా తేడా లేకుండా అందరికీ అవకాశం కల్పించాలి… రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే అన్న విశాల దృక్ఫథంతో జనసేన అందరినీ అక్కున చేర్చుకుంది. దళితులకు ఏకంగా 21 అసెంబ్లీ సీట్లు కేటాయించడం మామూలు విషయం కాదు. దళిత సమస్యల గురించి మాట్లాడటానికి కనీసం 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీలో వారి హక్కుల గురించి గొప్పగా పోరాటం చేయవచ్చు. ఇదీ సామాజిక మార్పు అంటే. ‘‘సామాజిక న్యాయం అంటే అదొక మిథ్య’’ అని కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల్లో చదువుకున్న వారు వాదిస్తున్నారుగానీ… అదేమిటో తెలియక మాత్రం కాదు. జనసేన ప్రభుత్వం వస్తే… సామాజిన న్యాయం అంటే ఏమిటో కంటికి కనిపిస్తుంది. అప్పుడైనా తేలికగా అర్థం అవుతుంది. నువ్వు మాల, లేదా మాదిగో అయితే తప్ప… దానికి సంబంధించిన వివక్ష ఇతరులకు అర్థం కాదు అని ఓ దళిత మేథావి చెప్పిన మాట నిజం.

ఒక కులంపై మరో కులం పెత్తనం దొబ్బదు అంటూ ‘‘కులాల కలయిక’’ను తొలి సిద్ధాంతంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. రాజకీయాల నుంచి సహజ వనరుల నుంచి అన్నింటా అందరికీ భాగస్వామ్యం ఉండాలన్న విశాల దృక్ఫథమే ఇది. దీనిని అర్థం చేసుకుని, సమ సమాజ హితాన్ని కాంక్షిస్తున్న… రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన విద్యాధికులు జనసేనకు మద్దతు ప్రకటించాయి. నిమ్న, బడుగు వర్గాలకు చెందిన అన్ని సామాజిక వర్గాలూ జనసేనకు మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే… ఏపీలో 27 శాతంగా ఉన్న కాపు కులాల ఓట్లను చీల్చేందుకు తెలుగుదేశం, వైసీపీలు కుట్రలు పన్నుతున్నాయి. జనసేన ఒక పెద్ద మార్పును తెస్తున్న ఈ పరిస్థితిలో… అభ్యర్ధులతో సంబంధం లేకుండా జనసేన తరఫున బాధిత కులాలన్నీ నిలబడాల్సిన ఆవశ్యకత ఉంది. కాపు కులమనే కాదు… ఏ కులపు అభ్యర్ధి అయినా… వారి గతచరిత్ర ఆధారంగా కొంతమందికి జనసేనలో ప్రవేశం దొరకలేదు. అలా కొంతమంది కాపులకు కూడా జనసేనలో చోటు దొరకలేదు. బొత్స సత్యనారాయణ కావచ్చు… గంటా శ్రీనివాసరావు కావచ్చు… వారు కాపులు గనుక, ఆయా నియోజక వర్గాల్లో ఆయా అభ్యర్ధులు.. కాపులు అన్న ప్రాతిపదికన ఓట్లు వేసినట్లయితే, జనసేన బృహత్ లక్ష్యానికి దెబ్బతలుగుతుంది. ఏకమొత్తంగా 90 శాతం కులాలకు న్యాయం చేసే లక్ష్యంతో జనసేన చేస్తున్న సామాజిక న్యాయం అనే రాజకీయ య‌జ్ఞానికి తూట్లు పడతాయి. కాపు సామాజిక వర్గం నేడు చూడాల్సింది… జనసేన రేపటి సమాజానికి ఎంత మంచి చేయబోతున్నదో చూడండి. వైసీపీలో ఉన్న కాపు అభ్యర్ధి… కాపులకు మేలు చేస్తాడని ఆశించడం వృథా. అలాగే, తెలుగుదేశంలో ఉన్న కాపు అభ్యర్ధుల వల్ల జరిగిన మేలు కూడా ఏమీ లేదు. అందుకే కాపులు, బీసీలూ, ఎస్సీ, ఎస్టీలూ, ముస్లింలు అందరూ ఒకే తాటిపై నిలబడి… జనసేనకు ఓటు అందించాల్సిన సమయం ఇది. ఒక చారిత్రకమైన మార్పు జరగబోతున్నది. ఈ మార్పు వల్ల అందరికీ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. తాను కాపు కులానికి ప్రతినిధి కాదు అని పవన్ కళ్యాణ్ ఘంటాపథంగా చెప్పడం వెనుక కారణం ఏమిటో తెలుసా? ప్రకృతి లేదా దేవుడు అందరికీ ఒకటే జీవితాన్ని అందించాడు. కానీ సామాజికంగా అంతరాలు ఎక్కువగా ఉన్న ఈ సమాజంలో రాజకీయ అధికారాన్ని గిప్పిట పెట్టుకుని 10 శాతం కులాలు లక్షల కోట్లు సంపాదించుకున్నాయి. ఇంకా సంపాదించేందుకు పావులు కదుపుతున్నాయి. అందుకే బడుగులకు దేవుడు చంద్రబాబు అనీ, జగన్ అనీ ప్రచారం చేసుకుంటున్నారు.

ఇపుడు మళ్లీ ఏటా 2 లక్షల కోట్లపై తెలుగుదేశం, వైసీపీలు కన్నేశాయి. ఒకవేళ తెలుగుదేశం ఓడిపోతుందేమో అన్న భయంతో… ఇప్పటికే కొందరు కమ్మ సామాజిక వర్గం నేతలు వైసీపీలో చేరి ‘‘భవిష్యత్తు’’లో సంపాదించే డబ్బుకు నేడే బీమా చేసుకున్నారు. తెలుగుదేశానికీ, వైసీపీకీ తేడా ఏమీ కనిపించదు. దోపిడీ అన్నది సర్వనామం. కుక్కలకు వేసినట్లు… పేద కులాలకు బిస్కెట్లు, ఆధిపత్య కులాలకు వేల కోట్ల కాంట్రాక్టులు. ఎన్నికల మొత్తాన్నీ ఒక్క మాటలో చెప్పాలంటే జరుగుతున్నది ఇదే. ముస్లింలు కూడా పెద్దఎత్తున జనసేనకు మద్దతు ప్రకటించారు. అలాగే పెద్ద సంఖ్యలో ఉన్న కాపులు కూడా ఒక్క ఓటు కూడా చీలిపోకుండా జనసేనకు ఇవ్వగలిగితే… 90 శాతం మందికి మేలు జరుగుతుంది.

దీనిని దృష్టిలో ఉంచుకుని ‘‘కూకట్ పల్లి’’ ఎన్నికలా దీనిని కూడా ఒక సవాలు తీసుకోవాల్సిన అసవరం ఉంది. జనసేన ప్రభుత్వంతో… ఏపీ రూపురేఖలే మారిపోనున్నాయి. చరిత్రలో అరుదుగా లభించే అవకాశం. చాలాచోట్ల నుంచి అందుతున్న వార్తలు ఏమంటే… జనసేన మద్దతుదారులు నిశ్శబ్దంగా ఉన్నారు. అలాగే ఉండండి. ఇప్పటికే తెలుగుదేశం, వైసీపీలు దాడులకు పాల్పడుతున్నాయి. మరో 10 రోజులు ఓపిక పట్టండి. మార్పునకు ఓటు వేయండి. పేదల బతుకులు ఇకనైనా మారతాయి!!

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *