రివ్యూ: మజిలీ మూవీ

April 5, 2019 | News Of 9

నటీ నటులు : నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్‌, రావురమేష్‌, సుహాస్‌, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి తదితరులు

సంగీతం: గోపి సుందర్‌

నేపథ్య సంగీతం: తమన్‌

ఎడిటర్: ప్రవీణ్‌ పూడి

ఛాయాగ్రాహకుడు: విష్ణుశర్మ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్‌ పెద్ది

కథ, కథనం, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ

విడుదల: ఏప్రిల్‌ 5, 2019

న్యూస్ ఆఫ్ 9 రేటింగ్‌: 3/5

కొంత మందికి ఎందుకో తాము కోరుకున్నదానికి భిన్నమైన ఫలితాలే వస్తుంటాయి. హరో నాగ చైతన్యకు కూడా అంతే. చై ఎంతసేపూ మాస్ ఇమేజ్ కోరుకుంటాడు. కానీ అతని సినిమాల్లో పేరు తీసుకొచ్చేవి మాత్రం ప్రేమకథలే.. అప్పుడెప్పుడో చేసిన ఏం మాయ చేశావే దగ్గర్నుంచి ఇదే పరిస్థితి. మజిలీ సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. ఓ విభిన్నమైన కథాంశంతో మంచి ఫీల్ ఉన్న సినిమా ఇది. ‘నిన్ను కోరి’ దర్శకుడు శివ నిర్వాణ తిరిగి అలాంటి ప్రేమకథతోనే మ్యాజిక్ చేశాడు. ప్రేమించిన అమ్మాయి దూరమైన వ్యక్తి మరో యువతిని పెళ్లాడినా ఆమెతో కలిసుండలేక, తన ప్రేయసిని మరచిపోలేక మదన పడే ప్రమికుడి పాత్రలో నాగ చైతన్యకు మంచి మార్కులే పడ్డాయి. అలా మాజీ ప్రేయసి తలపుల్లోంచి బయటపడి ఎలా మజిలీ చేరాడన్నదే ఈ చిత్ర కథ.

ఈ సినిమాలో క్రికెటర్ గా నటించాడు నాగచైతన్య అతని కేరెక్టర్ పేరు పూర్ణ మాజీ ప్రేయసిన మర్చిపోలేని ప్రేమికుడిని పెళ్లి చేసుకునే పాత్రలో శ్రావణిగా సమంత నటించింది. నటనలో ఇద్దరూ పోటీ పడినా సమంతకే కాస్త ఎక్కువ మార్కులు పడతాయి. పూర్ణ తండ్రి రావు రమేష్‌, అతని భార్య పాత్రల ఎమోషన్స్‌ ఎక్కువగా కనక్ట్‌ అవుతాయి. ప్రథమార్ధం ముగుస్తుందనగా కథలోకి ప్రవేశించే సమంత అక్కడ్నుంచీ ఈ చిత్రాన్ని తన అభినయంతో ముందుకి తీసుకెళుతుంది. అలాగే కొడుకు జీవితం ఎటూ కాకుండా పోతోందని క్షోభ పడే పాత్రలో రావు రమేష్‌ నటన అత్యంత సహజంగా వుంది. హీరో స్నేహితుడిగా నటించిన సుహాస్‌, ఇష్టం లేకుండా కూతురి పెళ్లి చేసే పాత్రలో పోసాని, హీరోని బాధ పెడుతూ ఆనందించే పాత్రలో సుబ్బరాజు అందరూ చక్కగా నటించారు. నాగచైతన్యకి మాత్రం ఇలాంటి క్యారెక్టర్‌ ఇంతకు ముందు దొరకలేదు. జీవితంలో వివిధ దశలు చూపించే పాత్రలో చైతన్య తన శక్తి మేర నటించాడు. ముఖ్యంగా చివరి సన్నివేశంలో చక్కని నటనతో మెప్పించాడు. నటుడిగా ఇది నాగచైతన్యకి ప్లస్‌ అయ్యే క్యారెక్టరు.

‘మజిలీ’ హై టెక్నికల్ వాల్యూ ఉన్న సినమా. గోపీసుందర్ పాటలు బాగున్నాయి. ఏడు మల్లెలెత్తు.. ప్రియతమా ప్రియతమా పాటలు వెంటాడుతాయి. తమన్ అందించిన నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. సన్నివేశాల్ని బాగా ఎలివేట్ చేసేలా ఉంది. సెకండ్ హాఫ్ ఆర్ఆర్ మంచి ఫీల్ ఇస్తుంది. విష్ణు శర్మ చాయాగ్రహణం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలకు పేరుపెట్టలేని విధంగా ఉన్నాయి. రచయిత.. దర్శకుడు శివ నిర్వాణ తన తొలి సినిమాకు దీటుగా ‘మజిలీ’ని నిలబెట్టాడు. ప్రేమకథల్ని డీల్ చేయడంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తెలిసిన కథనే మరింత అందంగా చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రధాన పాత్రల్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. శివ డైలాగ్స్ బాగున్నాయి. ‘‘ఆమె షిప్.. నువ్వు బోట్.. ఎక్కడ మ్యాచ్ అవుతుందిరా’’ అంటే.. ‘‘రెండూ వెళ్లేది నీళ్ల మీదే కదరా’’ అంటాడు హీరో. ఇలాంటి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డైలాగ్స్ సినిమాలో చాలా ఉన్నాయి. నేరేషన్ కొంచెం స్లో అన్నది తప్పితే శివ దర్శకత్వం విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ లేవు.

చివరిగా : ప్రేమకథలను ప్రేమించే వారికిదో మంచి ‘‘మజిలీ’’

Other Articles

One Comment

  1. What¦s Taking place i am new to this, I stumbled upon this I have found It absolutely helpful and it has helped me out loads. I hope to give a contribution & assist different customers like its aided me. Great job.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *