118 మూవీ రివ్యూ…

March 1, 2019 | News Of 9

చిత్రం: 118
నటీనటులు: కళ్యాణ్ రామ్ నందమూరి, షాలిని పాండే, నివేథా థామస్, ప్రభాస్ శీను, రాజీవ్ కనకాల, భరత్, నాజర్, హరితేజ తదితరులు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్- ఛాయాగ్రహణం: కె వి గుహన్
సంగీతం: శేఖర్ చంద్ర
ప్రొడ్యూసర్ : మహేష్ కోనేరు
రేటింగ్: 2.5/5

118 Movie Review | telugu.newsof9.com

చాలా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ కి 118 రూపంలో ఒక మంచి అవకాశం దొరికింది. కెవి గుహన్ అద్భుతమైన కెమెరా మెన్. అలాంటి గుహన్ ఈ సినిమాతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అందుకే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. నివేదా థామస్, శాలినీ పాండే హీరోయిన్స్. మహేష్ కోనేరు నిర్మాత. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించే అవకాశాలున్నాయో చూద్దాం.

కథ:

గౌతమ్‌ (కల్యాణ్ రామ్‌) ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌. ఏ విషయాన్ని అయినా మొదలుపెడితే మధ్యలో వదిలేసే అలవాటులేని గౌతమ్‌ను 118 రూమ్ లో ఉన్నప్పుడు ఓ కల బాగా డిస్ట్రబ్‌ చేస్తుంది. ఆ కలలో ఓ అమ్మాయిని ఎవరో తీవ్రంగా కొట్టడం, ఓ కారును పెద్ద కొండ మీదనుంచి చెరువులో పడేయటం లాంటి సంఘటనలు కనిపించటంతో గౌతమ్‌ ఆ కల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఆ కల రెండు సార్లు వస్తుంది. దీంతో కలను సీరియస్ గా తీసుకుంటాడు. ఎప్పుడైతే ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడో పలు ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. తనకు కలలో కనిపించిన అమ్మాయి నిజంగా ఉందా? అని వెతికే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో గౌతమ్‌కు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అసలు గౌతమ్‌ కలలో వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకు కొట్టారు? ఈ మిస్టరీని గౌతమ్ ఎలా సాల్వ్‌ చేశాడు? అన్నదే మిగతా కథ.

సమీక్ష:

కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు. లుక్ పరంగానే కాకుండా క్యారెక్టర్ పరంగానూ కొత్తగా ఉన్నాయి. క్యారెక్టర్ లోకి ఒదిగి పోయాడు. రెగ్యులర్ కమర్షియల్ ప్యాటర్న్ సినిమా కాదు ఇది. 118 పేరుకు తగ్గట్టుగానే దర్శకుడు కొత్త కథ రాసుకున్నాడు. ఇంటెన్సివ్ ట్రైలర్ తో మెప్పించిన గుహన్ కథలోనూ ఆ డెప్త్ చూపించాడు. సినిమా ప్రారంభం నుంచే 118లో హీరోకు వచ్చిన కల ఆధారంగా కథ నడుస్తుంది. హీరో పాయింట్ ఆఫ్ యూ లో నడిచే ఈ కథ ఇంట్రస్టింగ్ గా సాగుతుంది.

సినిమా కాన్పెప్ట్ బలంగా ఉంది. ఫస్టాఫ్ లో కథ కూడా స్పీడ్ గా క్యూరియాసిటీతో వెళ్తుంది. గుహన్ చాలా చోట్ల క్యూరియాసిటీ బిల్డప్ చేశాడు. ఆద్య ఎవరు అనే దానిపై ఎక్కువ సేపు నడిపించాడు. ఆ తర్వాత ఆద్యను ఎందుకు చంపారు అనే దానిపై కథ నడిపించాడు. అసలు హీరోకు కల ఎందుకు వచ్చింది. 118 రూమ్ లోనే కల ఎందుకు వచ్చింది. దానికి లింక్ గా ఉన్న ప్రతీ ప్రాపర్టీకి తగ్గట్టుగా సీన్స్ అల్లుకున్నాడు.
కళ్యాణ్ రామ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా సరిగ్గా ఉన్నాడు. సీరియస్ ఎమోషన్స్ ని బాగా క్యారీ చేశాడు. కథను తన భుజాలమీదేసుకొని నటించాడు.
నివేదా థామస్ మరోసారి నటతో ప్రూవ్ చేసుకుంది. ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. హాస్పిటల్ సీన్ లో బాగా నటించింది. శాలినీ పాండే కళ్యాణ్ రామ్ లవర్ గా నటించింది. ప్రభాస్ శ్రీను కు మంచి పాత్ర దొరికింది. సినిమా అంతా కళ్యాణ్ రామ్ తా ట్రావెల్ చేసే పాత్రలో నటించాడు.

ల్యూసిడ్ డ్రీమ్ అనేది కొత్తగా అనిపిస్తుంది. ప్రేక్షకుల్ని కొద్ది సేపు థ్రిల్ కు గురి చేస్తుంది. ఇలా కూడా ఉంటుందా అని అనిపిస్తుంది. ఫస్టాఫ్ నీటిగా క్రిస్ప్ గా తీసుకెళ్లాడు. కానీ సెకండాఫ్ డల్ అయ్యింది. లూప్ హోల్స్ కనిపించాడు. కథను స్ట్రైయిట్ గా నరేట్ చేయకుండా మళ్లీ కల కని అసలు నిజం తెలుసుకోవాలనే దాంటో తప్పటడుగులు వేశాడు. స్క్రీన్ ప్లే వీక్ గా మారింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ డల్ గా ఉంది. ఓల్డ్ ఫార్మాట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపించడంతో అసహనానికి గురవుతాం. చాలా సీన్స్ గుర్తుపట్టేవిగా ఉంటాయి. అంతే కాకుండా.. క్లైమాక్స్ రెగ్యులర్ గా ఉంది. రాజీవ్ కనకాల క్యారెక్టర్ లో క్లారిటీ లేకుండా పోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. లావిష్ గా నిర్మించారు. ఖర్చుకు వెనకాడలేదు. నిర్మాతగా మహేష్ కోనేరు సక్సెస్ అయ్యాడు. గుహన్ స్పెషల్ కెమెరా వర్క్ బాగుంది. శేఖర్ చంద్ర డీసెంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మిర్చి కిరణ్ డైలాగ్స్ బాగున్నాయి.

చివరిగా:
కళ్యాణ్ రామ్ ఒక కొత్త ప్రయత్నం ద్వారా తన ప్రతిభ ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేసాడు. గుహన్ కూడా చాలా కష్టపడ్డాడు. కానీ సెకండాఫ్ పై దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కాకపోయినా… థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడే వారికి ఈ బాగా నచ్చుతుంది.

బాటమ్ లైన్: అటు ఇటుగా పర్వాలేదనిపించేసిన 118

Other Articles

8 Comments

 1. Sweet blog! I found it while browsing on Yahoo News. Do you have any tips on how to get listed in Yahoo News?
  I’ve been trying for a while but I never seem to get there!
  Many thanks

 2. Hey! I’m at work browsing your blog from my new iphone 3gs!
  Just wanted to say I love reading through your blog and look forward to all your posts!
  Keep up the great work!

 3. Hey there would you mind sharing which blog platform you’re using?
  I’m going to start my own blog in the near future but I’m having a difficult time
  choosing between BlogEngine/Wordpress/B2evolution and Drupal.

  The reason I ask is because your design and style seems different then most blogs and I’m looking for something unique.
  P.S Apologies for getting off-topic but I had to ask!

 4. Hello there! This is kind of off topic but I need some help from an established blog.
  Is it very hard to set up your own blog? I’m not very techincal but I can figure things out pretty quick.
  I’m thinking about creating my own but I’m not sure where to
  begin. Do you have any tips or suggestions? Thank you

 5. Attractive element of content. I just stumbled upon your website and in accession capital
  to claim that I acquire in fact enjoyed account your weblog posts.

  Anyway I will be subscribing in your feeds or
  even I success you get entry to consistently quickly.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *