‘2.0’ ఫస్ట్ వీక్ వసూళ్ల ప్రభంజనం!

December 6, 2018 | News Of 9

2.0 First week collections | news of 9

ఒకవైపు ఇండియా గర్వించదగ్గ డైరెక్ట‌ర్ శంకర్‌. మరోవైపు ఇండియన్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఇంకోవైపు వరుసగా సోష‌ల్ మెసెజ్ ఓరియంటేడ్ సినిమాల్లో నటిస్తూ.. సక్సెస్‌లో ఉన్న నార్త్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌. ఇవే కాక త్రీడీ, 4డీ సౌండ్‌ సిస్టమ్‌, భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఇలాంటి ఎన్నో స్పెషాలిటీస్‌తో విడుద‌లైన మూవీ ‘2.ఓ’. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రికార్డు స్థాయి థియేట‌ర్ల‌లో విడుద‌లై రికార్డు రేంజ్‌లో క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతోంది.

 

ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 500 కోట్లు వసూలు చేసి సరికొత్త మైల్ స్టోన్ అందుకుంది. ఇండియన్ మార్కెట్లో ఈ మార్కెట్లో దాదాపు 370 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ విజువల్ వండర్ ఇంటర్నేషనల్ మార్కెట్లో దాదాపు 130 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

 

కేరళలో 2.0 ఆల్రెడీ సర్కార్ మూవీ లైఫ్ టైమ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఇక్కడ ఈ చిత్రం  దాదాపు 15 కోట్లు వసూలు చేయడం ద్వారా మలయాళం ఇండస్ట్రీలో ఇతర భాషా చిత్రాల పేరు మీద ఉన్న హయ్యెస్ట్ గ్రాస్ రికార్డులన్నీ బద్దలయ్యాయి.

 

మరో వైపు చెన్నై సిటీలో రజనీకాంత్ నటించిన ఈ సినిమా అదరగొడుతోంది. తొలి 7 రోజుల్లో ఈ మూవీ 13 కోట్ల 64 ల‌క్ష‌లు రాబట్టింది. ఇంటర్నేషనల్ మార్కెట్లను పరిశీలిస్తే అక్కడ స్మూత్ రన్ సాగుతోంది. యూఎస్ఏ మార్కెట్లో ఇప్పటికే 4 మిలియన్ డాలర్ మార్కును క్రాస్ అయిన ఈ చిత్రం కబాలి తర్వాత హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. వచ్చే వీకెండ్ సమయానికి ఈ రికార్డును అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.

 

హిందీ మార్కెట్ గ్రాస్ 132 కోట్లకు రీచ్ అయింది. ఇక సౌత్ మార్కెట్లో ఈ చిత్రానికి వసూళ్ల ప్రభంజనం కొసనాగుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో కలిసి తొలి 7 రోజుల్లో దాదాపు  240 కోట్ల గ్రాస్ వసూలైనట్లు తెలుస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం మరో వారం రోజుల పాటు 2.0 చిత్రం ఇండియన్ బాక్సాఫీసు దుమారంరేప‌డం ఖాయం అంటున్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *