ఫ‌స్ట్ డే ‘నం.1’ పొజిష‌న్‌లో ‘2.O’ మూవీ

November 30, 2018 | News Of 9

2.0 movie | newsof9.com

సూపర్‌స్టార్ రజనీకాంత్-డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ మూవీ 2.O తమిళనాడులో వసూళ్ల తడాఖా చూపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ముందుకెళ్తోంది. ఫ‌స్ట్ డే కలెక్షన్లు బాహుబలి2, సర్కార్, ఇతర తమిళ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల వసూళ్లను అధిగమించింది.

 

తమిళనాడు వ్యాప్తంగా మల్టిప్లెక్స్ చైన్ థియేటర్లలో భారీ సంఖ్యలో సినిమాను రిలీజ్ చేశారు. ఈ నేప‌థ్యంలో చెన్నైలో 2.O మూవీకి రెస్పాన్స్ ప‌గిలిపోయిందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. రోహిణి సిల్వర్ స్క్రీన్స్, వెట్రి థియేటర్స్‌లోనే సుమారు 20 వేలకుపైగా టికెట్లను అమ్మినట్టు సమాచారం. మాయామాల్‌లో 15 వేలకుపైగా ప్రేక్షకులు వీక్షించినట్టు సమాచారం. ఒక చెన్నైలోనే ఈ సినిమా 2 కోట్ల 64 ల‌క్ష‌లు వసూలు చేసినట్టు సమాచారం. సర్కార్ చిత్రం 2 కోట్ల 41 ల‌క్ష‌లు మాత్రమే వసూలు చేసింది.

 

ట్రేడ్ వర్గాల స‌మాచారం మేర‌కు.. తాజా గణాంకాలను అనుసరించి 2.O మూవీ సుమారు 35 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. దాంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన బాహుబలి2 రికార్డులను అధిగమించినట్టయింది. బాహుబలి2 సినిమా ఫ‌స్ట్ డే త‌మిళ‌నాట‌ 11 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

 

ఫైన‌ల్‌గా తమిళనాడులో 2.O మూవీ.. ఫ‌స్ట్ డే 35 కోట్లు వసూలు చేసి టాప్ వ‌న్ పొజిషన్‌ను నిలబెట్టుకొన్నది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *