2.0 మూవీ రివ్యూ : చిట్టి ద బాక్సాఫీస్ విన్నర్

November 29, 2018 | News Of 9

 

2.0 Movie Review

సినిమా: 2.0

రేటింగ్: 3.5/5

బ్యానర్‌: లైకా ప్రొడక్షన్స్

తారాగణం: రజనీకాంత్. అక్షయ్ కుమార్, అమీజాక్సన్ తదితరులు

సంగీతం: ఏ ఆర్ రెహమాన్

కూర్పు: ఏంటోని

ఛాయాగ్రహణం: నివార్ షా

నిర్మాత: శుభాస్కరన్

రచన, దర్శకత్వం: శంకర్

విడుదల తేదీ: 29 నవంబర్ 2018

బడ్జెట్ ఉండాలే కానీ కొందరు దర్శకుల సృజనకి అంతుపొంతు ఉండదు.. కలల లోకాన్ని ప్రేక్షకుల కళ్ల ముందుకు తెచ్చేందుకు దర్శకులకి వారి సృజనకి తగినంత బడ్జెట్ ఉండాలి. అయితే బడ్జెట్ ఇచ్చినంత మాత్రాన దర్శకుల థాట్స్ జనాల్ని మెప్పిస్తాయని బల్లగుద్ది చెప్పలేం.. కానీ దర్శకుడు శంకర్ క్రియేటివిటీకి రెక్కలొచ్చేంత బడ్జెట్, దాంతో పాటే టెక్నాలజీ దొరికింది. అందుకే ఇన్నాళ్లు సినిమాని అభిమానించే సగటు ప్రేక్షకుడుతో పాటు సాధరణ జనాల్లో కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తించిన భారతదేశపు భారీ బడ్జెట్ చిత్రం 2.0 ఎట్టకేలకు విడుదలైంది.

కథ:

ఎనిమిదేళ్ల క్రితం చిట్టి రోబోతో అటు ప్రేక్షకుల్ని ఇటు బాక్సాఫీస్ ని ఉర్రూతళుగించిన శంకర్, ఆ చిత్రానికి కొనసాగింపుగా 2.0 ని స్టార్ట్ చేశాడు. ఆ చిత్రంలో ఉన్న కీలక పాత్రలు రొబోటిక్స్ సైంటిస్ట్ వశీకర్(రజనీకాంత్), అతడు తయారుచేసిన చిట్టి రోబోతో 2.0 మొదలవుతోంది. అయితే ఈ లేటెస్ట్ వెర్షన్ లో చిట్టితో పాటు వెన్నల(అమీజాక్సన్) అనే మరో హ్యూమనాయిడ్ కూడా ఉంటుంది. మితిమీరిన సెల్ ఫోన్స్ వాడకం వలన పక్షులు ఇతర జీవరాశులు చనిపోవడాన్ని సహించలేని పక్షిరాజా(అక్షయ్ కుమార్) అనే ఆంథ్రోపాలజిస్ట్, జనాల చేత సెల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించేందుకు ఏం చేశాడు, ఎలాంటి దారిని ఎన్నుకున్నాడు. పక్షిరాజాకి, చిట్టి రోబోకి సంబంధం ఏంటి? తదితర ఆసక్తికర అంశాలు తెలియాలంటే 2.0ని 3డి లో చూడాల్సిందే.

విశ్లేషణ:

2.0 గత కొన్నేళ్లుగా మూవీ లవర్స్ ని టీజ్ చేస్తున్న టైటిల్. ఈ సినిమా రాక కోసం కేవలం భారతీయులే కాదు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తన సినిమాల్లో భారీతనంతో పాటు ఓ సామాజిక సందేశాన్ని కూడా పొందుపరించే డైరెక్టర్ శంకర్ ఈసారి కూడా అదే పంధాలో కొనసాగాడు. 2.0కి కావాల్సిన కమర్షీయల్ ఎలిమెంట్స్ తో పాటు ఓ మంచి మెసేజ్ ఇచ్చి ప్రేక్షకుల మెప్పుపొందే ప్రయత్నం చేశాడు. 2.0 తో శంకర్ భారతదేశపు సినీ పరిశ్రమ ఎత్తు, బరువు, వైశాల్యాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచాడు. 2.0 భారతదేశపు సినిమా అని సగర్వంగా ప్రతి సినీ అభిమాని చెప్పుకునే రీతిన శంకర్ 2.0ని తీర్చిదిద్దాడు. 2.0లో ప్రతి ఫ్రేమ్ ఓ విజువల్ వండర్ లా ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. తెర పై వచ్చే ప్రతి సన్నివేశం సినిమా గ్రాఫ్ ని పెంచుకుంటూ పోతూ ప్రేక్షకుల్ని ఓ వండర్ ఫుల్ టేక్నికల్ టూర్ కి తీసుకేళతాయి.

సెల్ ఫోన్స్ వినియోగం మానవాళకి ఎంత ఉపయోగపడుతుందో అదే విధంగా అంతే చేటు చేస్తుందని, ఓ చక్కటి సందేశాన్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకి సులువుగా అర్ధమయ్య రీతిన చాటి చెప్పడం శంకర్ కే సాధ్యం. ఈ ఫీట్ కి శంకర్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. సినిమా మొదటి భాగం పూర్తి కాగానే థియేటర్స్ ప్రతి ప్రేక్షకుడు సెల్ ఫోన్స్ బయటకి తియ్యాలంటే ఓ నిమిషం ఆలోచించేలా శంకర్ 2.0ని రూపొందించాడంటే అతిశయోక్తి కాదు. ఇక శంకర్ థాట్స్ తేర పైకి తీసుకురావడానికి ఈ సినిమాను ఖర్చుకి వెనకడుగు వేయకుండా నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ వారిని అభినందించకుండా ఉండలేం.

ఓ టెలికామ్ టైకూన్ గా యూరప్ లో పేరు ప్రఖ్యాతలు ఉన్న శుభాసక్కరన్, మితిమీరిన సెల్ ఫోన్ వినియోగం మానవాళి వినాశనానికి కారణం అవుతుందని సందేశమిచ్చే 2.0 ని నిర్మించేందుకు ముందుకు రావడం నిజంగా ఆశ్చర్యం. ఇక ఈ సినిమాకు ఆయువుపట్టు సూపర్ స్టార్ రజనీకాంత్ నటన, వశీకర్ పాత్రలో గంభీరంగా కనిపిస్తూనే, చిట్టి పాత్రలో పోరాటాలు చేస్తూ, 2.0 గా విలన్ తాట తీస్తూ, చివరకు 3.0గా చివర్లో వచ్చి అల్లరి చేసిన రజనీ మల్టీయాక్టింగ్ స్కిల్స్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. నాలుగు విభిన్న పాత్రల్లో రజనీ చేసిన నటనా మాయాజాలానికి రజనీ అభిమానులు మంత్రముగ్థులవుతారు. 60 ఏళ్లకి పైబడినా, ఏంతో ఓపికగా 2.0లో రజనీ నటించిన తీరు అభినందనీయం.

ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడు పక్షిరాజుగా నటించిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. పక్షిరాజుగా తన విలనిజాన్ని ప్రదర్శిస్తూనే, పక్షులు, సమాజం గురించి ఆలోచించే ఆంథ్రోపాలిజిస్ట్ గా అక్షయ్ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అలానే ఈ చిత్రంలో మరో మర మనిషిగా నటించిన అమీజాక్సన్ కూడా తన పాత్ర మేరకు నటించింది. కథలో కీలక పాత్రధారిగా ఉంటూనే ఓ కమర్షీయల్ సబ్జెక్ట్ గా అమీజాక్సాన్ 2.0కి ఉపయోగపడింది. రెండు గంటల పదిహేడు నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ పాత్రలతో పాటు, చోటా విలన్ గా నటించిన సుధాంశ్ పాండే తదితరలు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 2.0 రక్తికట్టడానికి ఈ సినిమాలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ ముఖ్య భూమిక పోషిస్తాయి. హాలీవుడ్ దర్శకులు మాదిరిగా టెక్నాలజీని సంపూర్ణంగా వాడుకొని బాక్సాఫీస్ దగ్గర బాక్ల్ బస్టర్ కొట్టొచ్చని శంకర్ నిరూపించే ప్నయత్నం చేసి అందులో సంపూర్ణ విజయాన్ని అందుకున్నాడు. శంకర్ కి చేయూతగా ఏ ఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 2.0ని మరింత రక్తి కట్టించి ఈ చిత్రం పై కనక వర్షం ఖాయమని తేల్చేసింది. ఇన్ని ప్లస్ లు ఉన్న సినిమాల్లో ఆరా(ఆత్మ వంటి ఓ అతీతమైన శక్తి) అని శంకర్ ఎత్తుకున్న పాయింట్, పక్షిరాజు ఆరాతో పాటు పక్షులు ఆరాలు కలిసే లాజిక్ లెస్ లూప్ హోల్స్ చిన్న చిన్న మైనెస్ లుగా అనిపిస్తాయి. వీటిని చంద్రుడులో మచ్చలుతో పోల్చుకుంటే 2.0 ఓ అద్భుతం.

బోటమ్ లైన్ : మైమరిపించిన మరమనిషి

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *