2.0 చైనాలో అప్పుడే ఓ రికార్డు !

December 5, 2018 | News Of 9

2.0 record in China | telugu.newsof9.com

సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 2.O మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ఇదే దారిలో చైనా బాక్సాఫీస్‌పై కూడా క‌న్నేసిందీ మూవీ. ఈ సినిమాను చైనాలో భారీగా రిలీజ్ చేసేందుకు లైకా ప్రొడక్షన్ ఏర్పాట్లు చేస్తున్నది.

 

చైనాలోకి డబ్బింగ్ చేస్తున్న ఈ సినిమాను 10 వేల థియేటర్లలో, 56 వేల స్క్రీన్లలో రిలీజ్ చేయనున్నారు. దాదాపు వీటిలో 47 వేలకుపైగా 3డీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. చైనాలో 2.O మూవీ ప్రభంజనానికి మే 2 తేదీని ఎంచుకొన్నారు. ఒకవేళ ఈ సినిమా చైనాలో రిలీజ్ అయితే అత్యధికంగా 3డీ వెర్షన్‌లో రిలీజైన ఓ విదేశీ చిత్రంగా రికార్డును సొంతం చేసుకొంటుంది అని లైకా ప్రొడక్షన్ ఓ ప్రకటనలో తెలిపింది.

 

ప్రస్తుతం 2.O మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. గత వారం రోజుల్లో 500 కోట్ల వసూళ్లను సాధించింది.

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *