2.O ఫ‌స్ట్ రివ్యూ – ఉమ‌ర్ సంధు

November 28, 2018 | News Of 9
robo | telugu.news of 9
వ‌చ్చేసింది.. 2.O ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న సినిమాకు ఎలా ఉందో చెప్పాశాడు దుబాయ్‌కు చెందిన సెన్సార్ బోర్డు మెంబర్, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు. ఇండియన్ సినీ హిస్ట‌రీలోనే ఈ సినిమా అద్భుత‌మంటూ ఉమ‌ర్ సంధు ట్విట్ చేశాడు. రోబోట్ సిరీస్ లో సాలీడ్ ఎంట‌ర్‌టైన‌ర్ అంటూ ఈ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.
దేశం గర్వించేలా డైరెక్ట‌ర్ శంకర్ ఈ చిత్రాన్ని రూపొందించారంటూ.. ఈ మూవీకి నాలుగు స్టార్లు వేశాడు. మ‌రికొన్ని గంట‌ల్లో ఆడియ‌న్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా  క‌చ్చితంగా ఇండియ‌న్ సినిమా రేంజ్ హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేలా ఉందంటున్నారు. భారత సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో టెక్ మాంత్రికుడు శంకర్ రూపొందించిన విజువల్ వండర్ మూవీ ‘2.O’. రజినీకాంత్, అమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విల‌న్‌గా తెరకెక్కిన ఈ సినిమా వండ‌ర్ అంటూ సినిమాపై ఫస్ట్ రివ్యూ వ‌చ్చేసింది.
ఈ సినిమాలో దాదాపు 11000 విజువల్‌ ఎఫెక్ట్స్‌ షాట్స్ ఉండ‌గా, ఇవి థ్రిల్‌ని క‌లిగించేలా ఉన్నాయ‌ని అంటున్నారు. ప్ర‌తి సెక‌న్ ఉత్కంఠ‌కు గురిచేసేలా డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమాను న‌డిపిన తీరు ఎక్స్‌లెంట్ అనే ప్ర‌శంస ఇప్ప‌టికే సెన్సార్ స‌భ్యుల నుంచి ద‌క్కింది. అంతేకాదు ఈ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ యాక్టింగ్ గ‌తంకంటే భిన్నంగా మ‌రింతా స్టైలీష్‌గా క‌నిపిస్తుంద‌ని చెబుతున్నారు.
ప్రస్తుతం సౌత్‌ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో 2.ఓ ఫీవర్‌ కనిపిస్తోంది. రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌ లాంటి టాప్‌ స్టార్స్‌తో శంకర్‌ తెరకెక్కించిన ఈ విజువల్‌ 3డీ టెక్నాలజీ, 4 డీ సౌండ్‌తో ప్రపంచ వ్యాప్తంగా 6,800 థియేటర్లలో విడుదల అవుతోంది. రిలీజ్‌కి ముందే ఈ చిత్రం 500 కోట్ల‌దాక‌ వ‌సూళ్ళు రాబ‌ట్టింది. బాహుబ‌లి ది కంక్లూజ‌న్ చిత్ర రికార్డ్స్‌ని 2.0 బ్రేక్ చేయ‌డం ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోంది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *