కాశ్మీరు ఉగ్ర దాడిలో 42 మంది మృతి

February 14, 2019 | News Of 9

42 jawans died in Kashmir terrorist attack | telugu.newsof9.com

  • కాశ్మీర్ చరిత్రలోనే అతి పెద్ద ఆత్మాహుతి దాడి
  • 2500 మంది జవాన్ల కేన్వాయ్ లక్ష్యంగా దాడి
  • ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ

జమ్మూ కాశ్మీర్: పుల్వామాలో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ఆత్మాహుతి దాడితో 42 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. మరి కొందరు క్షతగాత్రులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. గురువారం మధ్యాహ్నం గం.3.30 ప్రాంతంలో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడేలా మారణ హోమం సృష్టించారు. 2500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న 78 వాహనాల కేన్వాయ్ లక్ష్యంగా ఈ దాడి చేశారు. ఈ దాడిని తామే చేసినట్లు జైషే మహమ్మద్ ప్రకటించింది. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదిని కాక్రపారాకు చెందిన ఆదిల్ అహ్మద్ గా గుర్తించారు. భద్రతా బలగాలకు భారీ నష్టం కలిగించే ద్యేయంతో ఉగ్రవాదులు ఈ దాడికి చేసినట్టు భావిస్తున్నారు.

ఆత్మహుతికి తెగబడ్డ ఉగ్రవాది 350 కేజీల పేలుడు పదార్థాలు నింపిన కారుతో కేన్వాయ్ ని డీకొన్నాడు. పేలుడు దాటికి కేన్వాయ్ లోని కొన్ని వాహనాలు ముక్కలు ముక్కలయ్యాయి. సైనికుల శరీరాలు ఎగిరి పడ్డాయి. అక్కడికక్కడే 12 మంది చనిపోగా క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇప్పటికి 42కు చేరింది. మరికొంత మంది పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. గత ఇరవై ఏళ్లలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ఇదే అతి పెద్దది. ఈ ఉగ్రదాడిని ప్రధాని మోదీ ఖండించారు. హోంమంత్రి, అజిత్ దోవల్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *