‘2.0’ సినిమాలా 297 పక్షుల ప్రాణాలు తీసిన ‘5జీ’

December 6, 2018 | News Of 9

5g kills 297 birds in netherlands | news of 9

బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘2.0’ సినిమాలో పక్షిరాజు (అక్షయ్ కుమార్)..సెల్‌ఫోన్ల వ‌ల్ల వ‌చ్చే రేడియేష‌న్ వ‌ల్ల లక్షలాది పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేస్తాడు. ఫోన్ వాడే ప్రతి ఒక్కడూ ఓ హంతకుడే అంటూ తన వేదనను వినిపిస్తాడు. అది నిజం కాదని, నిజాలు ప్రచారం చేస్తూ తమ బ్రాండ్ వాల్యూని దెబ్బతీస్తున్నారంటూ కొన్ని సెల్‌ఫోన్ కంపెనీలు సినిమా దర్శకుడు, నిర్మాతలపై దావా వేశాయి కూడా. అయితే మొబైల్ ఫోన్ల కారణంగా పక్షులకు ఎంత ముప్పు వాటిల్లుతుందో చెప్పేందుకు సాక్ష్యంగా తాజాగా జరిగిన ఓ సంఘటన ఇటీవ‌ల చోటు చేసుకుంది. నెదర్లాండ్స్‌లో కొన్ని రోజుల క్రితం చేసిన 5జీ ప్రయోగం కారణంగా 297 పక్షలు ప్రాణాలు కోల్పోయాయి.

 

నెదర్లాండ్‌లోని హాగ్ ప్రాంతంలో ఉన్నట్టుండి ఆకాశం నుంచి వందలాడి పక్షులు నేల మీద రాలిపడ్డాయి. పడి ఉన్న వందలాది పక్షులను చూసి జంతు ప్రేమికులతో సహా సాధారణ పౌరుల హృదయాలు కూడా ద్రవించి పోయాయి. ఇంతకు ఏం జరిగిందంటే.. 5జీ ప్రయోగం.. డచ్ రైల్వే స్టేషన్ పరిధిలో కొన్ని సెకన్ల పాటు 5జీ టెస్ట్ సిగ్నల్ చెక్ చేశారు. ఆ ప్రయోగం జరిగిన వెంటనే… ఆ ఫ్రీగ్వేసీని తట్టుకోలేక దాదాపు మూడు వందల పక్షులు నెలకొరిగి ప్రాణాలు విడిచాయి. ఆకాశంలో ఎగురుతున్న పక్షులతో పాటు చుట్టుపక్కల కొలనుల్లో ఉన్న బాతులు కూడా రేడియేషన్ కారణంగా నీటమునిగి చనిపోయాయి. పక్షులతో సమానంగా జంతువులు కూడా చనిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. సెకనుకి మిలియన్ల మైక్రోవేవ్స్ రిలీజ్ అవ్వడంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక మూగజీవులు ప్రాణాలు విడిచినట్టు పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.

 

ఈ విషయం తెలిసినవారందరూ ‘పిడికెడంత పిట్టే మన మధ్య బతకలేనప్పుడు… మనం ఎంత అభివృద్ధి చెంది మాత్రం ఏం లాభం…’ అంటూ ‘2.0’ సినిమాలో పక్షిరాజు చెప్పిన డైలాగ్ గుర్తుచేసుకుంటున్నారు. మొత్తానికి 5జీ ప్ర‌యోగం ఓ వైపు ఆనందాన్నిస్తే, మ‌రోవైపు భ‌యంక‌ర ప‌రిస్థితిని తెలుపుతోంది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *