మహానటికి అవార్డుల పంట..

August 10, 2019 | News Of 9

66th National film awards | telugu.newsof9.com

ఢిల్లీ: 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జాతీయ చలనచిత్ర పురస్కారాల జ్యూరీ సంభ్యులు ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల చిత్రాలను పరిగణలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. అంతకుముందు జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ కు అందజేశారు. ఎన్నికల మూలంగా ఏప్రిల్ లోనే ప్రకటించాల్సిన అవార్డులను వాయిదా వేశారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులలో మహానటి, రంగస్థలం, చిలసౌ మొదలైన తెలుగు సినిమాలను అవార్డులు వరించాయి.

అవార్డుల విజేతలు

ఉత్తమ చిత్రం: హెల్లారో(గుజరాతీ)

ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్‌(ఉరి)

ఉత్తమ నటుడు: ఆయుష్మాన్‌ ఖురానా(అంధాధున్‌), విక్కీ కౌశల్‌(యూరి)

ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌(మహానటి)

ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్‌ కిర్‌కిరే(చంబక్‌)

ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ(బదాయ్‌ హో)

ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపథ్య చిత్రం: పానీ(మరాఠీ)

ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్‌మ్యాన్‌

ఉత్తమ వినోదాత్మక చిత్రం: బదాయ్‌ హో

ఉత్తమ పరిచయ దర్శకుడు: సుధాకర్‌రెడ్డి యాకంటి(నాల్‌: మరాఠీ)

జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్‌

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి

జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్‌

జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్‌

ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్‌ లీలా భన్సాలీ(పద్మావత్‌)

జాతీయ ఉత్తమ యాక్షన్‌ చలన చిత్రం: కేజీఎఫ్‌

ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం (రాజా కృష్ణన్)

ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రం:  చి||ల||సౌ||

ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: ‘అ!’(తెలుగు) కేజీఎఫ్‌(కన్నడ)

ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ)

ఉత్తమ మేకప్‌: ‘అ!’

ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌: మహానటి

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కమ్మార సంభవం(మలయాళం)

ఉత్తమ ఎడిటింగ్‌: నాతిచరామి(కన్నడ)

ఉత్తమ సౌండ్‌ డిజైనింగ్‌: ఉరి

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీప్‌ప్లే: అంధాధున్‌

ఉత్తమ సంభాషణలు: తారీఖ్‌(బెంగాలీ)

ఉత్తమ గాయని: బిందుమాలిని(నాతి చరామి: మాయావి మానవే)

ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్‌(పద్మావత్‌: బింటే దిల్‌)

ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్‌, షాహిబ్‌ సింగ్‌, తలాహ్‌ అర్షద్‌ రేసి, శ్రీనివాస్‌ పోకాలే

నర్గీస్‌ దత్‌ అవార్డు: వండల్లా ఎరడల్లా(కన్నడ)

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *