దౌర్జన్యాలూ, అణిచివేతల కొండలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయినప్పుడు… !!

February 14, 2019 | News Of 9

(న్యూస్ ఆఫ్ 9)

పెట్టుబడిదారీ పార్టీలూ, పెట్టుబడిదారులూ అంబేద్కర్ విగ్రహాలకు దొంగ మొక్కులు మొక్కుతుంటే, జనం దృష్టిలో పడేందుకు దండలు వేస్తుంటే చూడటానికి అసహ్యంగా ఉంటుంది. జీవితంలో ఇంతకంటే పెద్ద అసహ్యం మరొకటి ఉండదు. ఏ పెట్టుబడిదారులపై అంబేద్కర్లు, చేగువేరాలూ ఉద్యమించి దళిత, తాడిత, పీడిత వర్గాలకు వెలుగులు పంచారో… నేడు మళ్లీ అదే పెట్టుబడిదారులు వేషాలు మార్చుకుని ప్రజాస్వామ్యం ముసుగులో ఆ విప్లవ వీరులను పొగడ్తలతో ముంచెత్తుతారు. అర్దాకలితో కాళ్లు డొక్కల్లో పెట్టుకుని నిరాహారంగా పేవుమెంట్లపై నిద్రించే వారికంటే విప్లవ వీరులకు ఈ పెట్టుబడిదారులే నిజమైన వారసులుగా ఫోజులు కొడతారు. పత్రికల్లో రాయించుకుని ఓట్లను నల్లధనంలా బ్యాంకుల్లో దాచుకుంటారు.

పాకిస్థానులో జియా వుల్ హక్ నియంతృత్వంపై పోరాటం చేసిన విప్లవ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఫోటోలకూ, విగ్రహాలకూ నేడు అదే పెట్టుబడిదారులు పూజలు చేస్తారు. అసహ్యం.

కాలం అనేక మార్పులు తెస్తుంది. అనేక గాయాలను కాలం మరపునకు తెస్తుంది. గతాన్ని మర్చిపోతాం. సరిగ్గా అప్పుడే పెట్టుబడిదారులు… ప్రజల జీవితాలతో ఆడుకోవడం ప్రారంభిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగుదేశం కానీ, వైఎస్సార్సీపీ పార్టీలు గానీ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ… అంబేద్కర్ కూ, విప్లవ వీరులకూ దండలు వేయడం నిజంగా ఒక దగా. విప్లవ వీరుల్ని చంపేసి… వారిని దేవుళ్లుగా మార్చేసి… వారిని కొలవడం ఒక కుట్ర కదా? నైకీ షూస్ కంపెనీ చేగువేరా బొమ్మలను వాడుకోవడం ఎలాంటిదో… అంబేద్కర్ విగ్రహాలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు గానీ, వైఎస్సార్సీపీ అధినేత జగన్ గానీ దండలు వేయడం కూడా అలాంటిదే అవుతుంది. జీవించి ఉండగా ఫైజ్ అహ్మద్ ఫైజ్ ను జైళ్లలో కుక్కిన పాలకులే.. నేడు ఆయన్ను కీర్తించడం మరిచిపోరాదు. ఇక్కడా ఇదే జరుగుతున్నది.

‘‘హమ్ దేఖేంగే’’ పేరుతో ఫైజ్ రాసిన కవిత నియంతల పునాదుల్ని పెకలించివేసింది. ఈ కవితకు అంత విప్లవం ఉంది. మార్పును సాధించిన ఈ కవిత నేటి పరిస్థితులకు అద్దం పడుతుంది. జనసేన సైన్యాలను ముందుకు దూకించేందుకు అవసరమైన స్ఫూర్తిని అందిస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం నియంతలానే ప్రవర్తిస్తోంది. ఇతర పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారు. అబద్ధాలు చెబుతూ ప్రజాస్వామ్య ముసుగులో బడుగు వర్గాలకు దక్కాల్సిన అధికారాన్ని తన్నుకుపోవడానికి పెట్టుబడిదారీ వర్గాలు ఎన్నో కుయుక్తులు పన్నుతున్నాయి. ఈ కవిత… అలాంటి వారి ఆలోచనలకు గొడ్డలిపెట్టు.

ఉర్దూలో ఉన్న భావాన్ని తెలుగులోకి అంతే చిక్కగా తెచ్చారు ‘వాహెద్’. వారికి అభినందనలు.

A poem that buried dictators | telugu.newsof9.com

మనం చూద్దాం (హమ్ దేఖేంగే)

తప్పనిసరిగా మనమూ చూద్దాం

ఆ వాగ్దానం చేయబడిన రోజు

శాశ్వత పలకపై రాయబడిన రోజు

దౌర్జన్యాలూ, అణిచివేతల కొండలన్నీ

దూదిపింజల్లా ఎగిరిపోయినప్పుడు

పాలితులు, బాధితులు కాళ్లకింద

ఈ నేల గుండెలా కొట్టుకుంటుంది

పాలకుల తలలపై

పిడుగులు వర్షిస్తాయి…

దేవుడి పీఠం నుంచి ప్రతిమలు పెకలించబడినపుడు

పవిత్ర పీఠం నిరాకరించబడిన మా

సగటు జనం గద్దెనెక్కినప్పుడు

కిరీటాలు ఎగరవేయబడినప్పుడు

సింహాసనాలు తల్లకిందులైనప్పుడు

కేవలం దేవుడి పేరే ఉంటుంది

అతడు అదృశ్యుడు సర్వాంతర్యామి కూడా

అతడే దృశ్యం అతడే చూపు

మేమే సత్యమన్న నినాదం ప్రతిధ్వనిస్తుంది

అది నువ్వు నేనే

రాజ్యం ప్రజలది అవుతుంది

అది నువ్వు నేనే

మనం చూద్దాం

తప్పనిసరిగా

మనమూ చూద్దాం

Other Articles

12 Comments

 1. That is really interesting, You’re a very skilled blogger.
  I have joined your rss feed and look forward to in the hunt for extra of
  your magnificent post. Also, I have shared your site in my social networks

 2. Magnificent items from you, man. I have have in mind your stuff
  prior to and you are simply too fantastic.
  I actually like what you’ve received right here, certainly like
  what you are stating and the best way wherein you say it.

  You are making it entertaining and you still care for to keep it sensible.

  I cant wait to read much more from you. That is actually
  a tremendous website.

 3. Thanks for your marvelous posting! I really enjoyed reading it, you could be a great author.
  I will make certain to bookmark your blog and definitely will come back in the foreseeable future.
  I want to encourage continue your great work, have
  a nice holiday weekend! pof natalielise

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *