సూళ్లూరు పేట గ్యాంగ్ రేప్ నిందితుల అరెస్ట్..

February 8, 2019 | News Of 9

నెల్లూరు: సూళ్లూరుపేటలో యువతిని గ్యాంగ్ రేప్ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సూళ్లూరుపేట ప్రాంతానికి చెందిన వెంకటగిరి వినయ్, తిరువల్లూరు నవీన్,దేవా, తమిళ్ సెల్వంగా గుర్తించారు. వీరంతా ఆదివారం రాత్రి జనసంచారం లేని ప్రాంతంలో ప్రియుడిని కొట్టి ఓ యువతిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన తెలిసిందే. అలా రాత్రిపూట ఒంటరిగా పడివున్న యువకుడిని గమనించిన సూళ్లూరుపేట పోలీసులు అతని ఫిర్యాదుతో ఆ ప్రాంతం మొత్తం గాలించారు.

యువతిని ఎత్తుకెళ్లిన దుండగులు ఆమెను అక్కంపేట రైల్వేస్టేషన్ సమీపానికి తీసుకెళ్లి ఒకరు తర్వాత మరొకరు ఉదయం వరకు నరకం చూపించి అనంతరం సూళ్లూరుపేట వెళ్లే రైలు ఎక్కించారు. అక్కడ రైలు దిగిన యువతి ప్రియుడికి సమాచారం ఇచ్చింది. అతడిచ్చిన సమాచారంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వీరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *