ఓ మిత్రుడు చెయ్యిచ్చాడు.. మరో ఆప్తుడు చేయూతనిచ్చాడు

April 9, 2019 | News Of 9

  • జనసేనకు భారీ విరాళం ఇచ్చిన హీరో నితిన్
  • నాకేం చేశావని పవన్ ని ప్రశ్నించిన ఆలీ.. పెదవి విరిచిన ఫ్యాన్స్

జనసేనకు హీరో నితిన్ భారీ విరాళం ఇచ్చారు. తను పవర్ స్టార్ ఫ్యాన్ అని బాహాటంగా చెప్పే యువ హీరో నితిన్ పాలిటిక్స్ లోనూ పవన్ కళ్యాణ్ అభిమానినేనని నిరూపించుకున్నారు. అక్షరాలా 25 లక్షల రూపాయల విరాళాన్ని జనసేన పార్టీకి ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ సభలో వడదెబ్బ వలన అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రచారం చేస్తున్న జనసేననానిని నితిన్ తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగానే నితిన్ జనసేన పార్టీకి తన వంతు విరాళంగా 25 లక్షల రూపాయల చెక్ ను పవన్ కు అందజేశారు. ఇంటా బయటా తను ఒకేలా ఉంటానని నిరూపించుకున్నారు నితిన్. సినిమా ప్రమోషన్లకు మాత్రం పవన్ ఇమేజ్ వాడుకుని రాజకీయాల్లో గుడ్డి విమర్శలు చెసే వాళ్లకు అప్పుడప్పుడూ ఉపయోగపడాలనే సందేశమిచ్చారు.

నితిన్ తనపై చూపిన అభిమానానికి పవన్ ఎంతో సంతోషించారు. తన ఆరోగ్య పరిస్థితి బాగుందంటూ వారికి వివరించారు. కాగా ఇటీవల ఓ సభలో అలీ గురించి పవన్ ప్రస్తావించారు. స్నేహితుడై ఉండి తనతో బందువులకు టికెట్ ఇప్పించుకుని కూడా, అతను వేరే పార్టీకి ప్రచారం చేస్తున్నాడనీ, దగ్గరి వాళ్లే ఇలా ఉటారని తన విచారాన్ని వ్యక్తం చేశారు. దానికి అలీ కూడా సమాదానం ఇచ్చినట్లు సాక్షి మీడియా ప్రచురించింది. పవన్ చెప్పుకుంటున్నట్లు తనకేమీ సహాయం చెయ్యలేదనీ.. తనకు డబ్బు సాయం చేశారా? లేక సినిమా అవకాశాలు ఇప్పించారా అని ప్రశ్నించారని రాశారు. అయితే ఈ సమాదానానికి జనసైనికులకు రుచిస్తుందా.. లేదు ఎవరు ఏం చెప్పినా తమ విచక్షణతోనే ఆలోచిస్తారు. తప్ప టీవీలో యాడ్ వచ్చిందనో, పేపర్లో ప్రకటించారనో నమ్మేయరు.

తమకు టిక్కెట్లు ఇవ్వలేదంటూ ఎంతో మంది బాధపడ్డారనీ అలాంటిది అలీ బంధువుకు అడగకుండా ఇస్తారా.. అని వారు అనుకుంటున్నారు. పవన్ అన్నట్లు ఆలీ వైసీపీలోకి గెలచే పార్టీ అని భ్రమించి వెళ్లాడా లేక వార్తల్లో వస్తున్నట్లు బెదిరింపుల వల్ల వెళ్లాడా ఆయనకే తెలియాలి. మొత్తం మీద వైసీపీలోకి సినిమా వాళ్లను పెద్ద సంఖ్యలో చేర్చుకోవడం మాత్రం పవన్ ను టార్గెట్ చేయడానికే అనేది అందరికీ అర్థమయిన విషయమే. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే జనం కేవలం సినిమా నటులనో, రాజకీయ నాయకులనో నమ్మరు. నిజాయితీ పరులని, అందరినీ సమానంగా చూసేవారినీ నమ్ముతారు. వారికే తమ మద్ధతునిస్తారు. న్యాయంగా పోరాడుతున్నదెవరో.. అన్యాయంగా కుట్రలు చేస్తోందెవరో తెలియని అమాయకులు మాత్రం కాదు జనం

Other Articles

One Comment

  1. I will immediately clutch your rss feed as I can not find your email subscription hyperlink or newsletter service. Do you’ve any? Please permit me recognize so that I may just subscribe. Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *