కూలిన చోటనే… మళ్లీ అంబేద్కర్ విగ్రహం!

May 15, 2019 | News Of 9

  • ప్రొఫెసర్ కంచ ఐలయ్య పిలుపు

హైదరాబాదులో అంబేద్కర్ విగ్రహం కూల్చి వేసి రోజులు గడుస్తున్నా, ముఖ్యమంత్రి స్పందించకపోవడం అంబేద్కర్ ను అవమాన పరిచినట్లేనని ప్రొఫెసర్ కంచ ఐలయ్య వ్యాఖ్యానించారు. పంజాగుట్టలో కూల్చిన చోటే… విగ్రహాన్ని ప్రతిష్టించాలని, అంబేద్కర్ తో పెట్టుకున్న వాళ్ళు ఏవరు బాగుపడలేదని ఆయన అన్నారు. పెరిగిపోతున్న అసమాన తను తొలగించి, సమానత్వం కావాలని కోరుకుంది కారల్ మార్క్స్ ఒక్క డేనని, దేశంలో..22 కోట్ల మంది అంటరాని వారిగా అవమానాలను ఎదుర్కొం టున్నారని తెలిపారు. కూల్చిన చోటే..విగ్రహం ఏర్పాటుకు అంబేద్కర్ వాదులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కూల్చిన చోటే..అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.

దేశంలో మనుషుల మధ్య అసమానతలు పెరిగిపోతున్నాయని, రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి విగ్రహం చెత్త కుప్పలో వేయడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీల నాయకుల విగ్రహాల్ని పెట్టుకునే హక్కు ఉంటుంది కానీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అనుమతి లేకపోవడం శోచనీయమని అన్నారు. కులాల అణచివేత, ఆర్ధిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. రానున్న రోజుల్లో.. తెలంగాణలో పెరిగి పోతున్న ఆర్ధిక, కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడం చేపట్టనున్నట్లు తెలిపారు. లాల్, నీల్ జెండా పేరుతో ఉద్యమాలు చేయాలన్నారు. పంజాగుట్టలో విగ్రహం కూల్చిత ఘటనలో.. తప్పించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ఉన్నత అధికారీ, కమిషనర్ దానకిషోర్ పై కూల్చివేత నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. కూల్చివేసిన చోటే విగ్రహ ప్రతిష్ట చేసే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

Other Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *