కేఏ పాల్‌ పై యాంక‌ర్ శ్వేతారెడ్డి ఫైర్

February 13, 2019 | News Of 9
Anchor Swetha Reddy fires on Chief of Prajasanthi KA Paul | telugu.newsof9.com

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. ఇటీవ‌లే ఆ పార్టీలో చేరిన యాంక‌ర్ శ్వేతారెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. కేఏ పాల్ పై ఆ పార్టీలో ఇటీవ‌లే చేరిన శ్వేతారెడ్డి తాజాగా మండిపడ్డారు. హిందూపురం నియోజ‌క‌వ‌ర్గానికి పార్టీ తరపున మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును ప్రకటించారని.. ఇప్పుడు హిందూపురం టికెట్ ను ఎవరికైనా అమ్ముకోవడానికి పాల్ ప్ర‌య‌త్నిస్తారా అంటూ ఆమె ఫైర్ అయ్యారు.

ఇటీవ‌ల పార్టీలో చేరి హిందూపురం టికెట్‌ను కాన్ఫామ్ చేసుకున్న శ్వేత‌రెడ్డిపై కేఏ పాల్ కొన్ని కామెంట్లు చేశారు. త‌మ పార్టీలోకి వ‌చ్చిన‌ శ్వేత‌రెడ్డి అడ్ర‌స్ లేకుండా పోయార‌ని, ప‌బ్లిసిటీ కోస‌మే పార్టీలోకి వ‌చ్చి ఇలా చేసి వెళ్లిపోయి ఉంటుందేమోన‌ని కేఏ పాల్ విమ‌ర్శించారు. కేఏ పాల్ కామెంట్ల‌పై శ్వేతా ఫైర్ అయ్యారు. ఈనెల 21వ తేదీ వరకు 10 వేల సభ్యత్వాలు చేయించాలని తనతో చెప్పారని… కానీ, 21వ తేదీ రాకముందే తన గురించి మాట్లాడటం దారుణమని అన్నారు. హిందూపురం టికెట్ ను ఎవరికైనా అమ్ముకోవడానికి ఈ ప్రకటన చేశారా? అంటూ శ్వేత మండిప‌డ్డారు.

ప్రజాశాంతి పార్టీకి సిద్ధాంతం కానీ, అజెండా కానీ లేవని శ్వేత అన్నారు. వైజాగ్ లో తన గురించి మాట్లాడాల్సిన అవసరం పాల్ కు ఎందుకొచ్చిందని శ్వేత ప్రశ్నించారు. పార్టీ సమావేశాలను నిర్వహించేందుకు తమ వద్ద డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారని అడిగారు. దేవుడి బిడ్డ అబద్ధాలు చెప్పరాదనే విషయం మీకు తెలియదా? అని ప్రశ్నించారు. ఇచ్చిన గడువు ముగియకుండానే తన సమర్థతను ఎలా లెక్కిస్తారని మండిపడ్డారు. మొత్తానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో పోటీ చేయాల‌ని హ‌డావిడి చేస్తున్న కేఏ పాల్ చేస్తున్న హంగామా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Other Articles

10 Comments

  1. I am sure this paragraph has touched all the internet visitors,
    its really really good article on building up new webpage.

  2. When I initially commented I clicked the “Notify me when new comments are added” checkbox and now
    each time a comment is added I get three e-mails with the same comment.
    Is there any way you can remove people from that service?
    Many thanks!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *