కౌలు రైతులకు అన్నదాత’ వర్తింపజేయాలి: సీపీఐ రామకృష్ణ

February 14, 2019 | News Of 9

"Annadhatha" should also be beneficial to lean farmers: CPI Ramakrishna | telugu.newsof9.com

  • గతంలో ఇచ్చిన గుర్తింపు కార్డులకు వర్తింపజేయాలి
  • డ్వాక్రా మహిళలకు 10 వేలనూ ఒకే దఫా ఇవ్వాలి
  • రాష్ట్రంలోని రైతులందరినీ ఒకే రీతిగా చూడాలి

విజయవాడ: రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పధకాన్ని వర్తింపచేయాలని కోరుతూ సిపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. జూన్ లో కౌలు రైతులను గుర్తించడం వల్ల వారికి ఏమాత్రం లబ్ది చేకూరదని ఆ లేఖలో పేర్కొన్నారు. అందు వల్ల గత ఏడాది ఇచ్చిన గుర్తింపు కార్డుల ప్రకారం కౌలు రైతులకు రు.10 వేల సాయం అందించాలని డిమాండ్ చేశారు.

డ్వాక్రా మహిళలకు ఇస్తామన్న రు.10 వేలను తక్షణం ఒకే దఫా ఇవ్వాలనీ, 3 చెక్కులు ఇచ్చి విడతల వారీగా ఇవ్వడం సరికాదనీ హితవు పలికారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసి, చెక్కులు చెల్లవంటే మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన అన్నారు. కరువు ప్రాంతాల రైతులు పంటలు నష్టపోయి అల్లాడుతున్నారన్న రామకృష్ణ రాష్ట్రంలోని రైతాంగాన్ని అంతటినీ ఒకేరీతిగా చూడాలన్నారు. కరువు తీవ్రత వల్ల పంట నష్టపోయిన రైతులకే కాక, పంట పెట్టని రైతులకు కూడా తక్షణం నష్టపరిహారం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *