12 నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు

June 11, 2019 | News Of 9

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు 12వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. కొత్త ప్రభుత్వంలో మొదటి అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. మొత్తం అయిదు రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయి. 12వ తేదీ ఉదయం 11.05 నిమిషాలకు సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఎమ్యెల్యే ల చేత ప్రొటెం స్పీకర్ అప్పల నాయుడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 13వ తేదీన స్పీకర్ గా తమ్మినేని సీతారాంను అధికారికంగా ఎన్నుకొంటారు. 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 15,16 తేదీల్లో సభకు సెలవు… 17,18 తేదీల్లో  అసెంబ్లీ జరుగుతుంది. ఈ నెల 18 తో సమావేశాలు ముగుస్తాయి. 

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *