నేటి నుంచి 24 వరకూ ఏపీలో ఎంసెట్ పరీక్షలు..

April 20, 2019 | News Of 9

AP EAMCET examinations will be held from today to 24th | telugu.newsof9.com

అమరావతి: ఇంజనీరింగ్ మెడిసిన్ విద్య ప్రవేశం కొరకు నిర్వహించే ఎమ్సెట్ పరీక్షలు మొదలయ్యాయి. ఈరోజు నుంచి మొదలైన ఏపీ ఎంసెట్ పరీక్షలు ఈ నెల 24 వరకు జరుగుతాయి. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు వివరాలను అందించారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో ఇంజినీరింగ్  ప్రవేశానికి పరీక్షలు నిర్వహిస్తారు. 23, 24 తేదీలలో వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలకు సమయం నిర్ణయించారు. పరీక్ష జరగే సమయానికి గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి హాజరుకావాలనీ, నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరిస్తామని నిర్వాహకులు తెలియజేశారు.

ఏపీ ఎంసెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,82,633 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,723 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వ్యవసాయం, వైద్య విభాగాలకు 86,910 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్ పరీక్షల నిర్వహణకు ఏపీలో 109, హైదరాబాద్ లో 6 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ఏమైనా సందేహాలు ఉంటే వాటి నివృత్తికి 0884-234535, 2356255 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు తెలియజేశారు.

Other Articles

5 Comments

 1. Hello There. I found your blog the use of msn. This is a very well written article.
  I will be sure to bookmark it and return to learn more of your helpful information. Thank
  you for the post. I’ll certainly comeback.

 2. Just want to say your article is as astonishing. The
  clarity in your post is just great and that i can suppose you’re a professional
  in this subject. Fine together with your permission let me
  to clutch your feed to stay updated with approaching post.
  Thanks a million and please carry on the rewarding work.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *