రైతులకు ఏపీ ప్రభుత్వం వరం!!

February 13, 2019 | News Of 9

AP Govt adding Rs.4,000 to Farmers Central assistance | telugu.newsof9.com

 • కేంద్రం ఇచ్చే 6 వేలకు మరో 4 వేలు
 • చిన్నా, పెద్దా అందరికీ వర్తింపు
 • మంత్రి మండలి నిర్ణయాలు

అమరావతి: రైతుల కోసం అన్నదాత సుఖీభవ పేరుతో ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికీ రూ.10 వేలు అందిస్తారు. కేంద్రం రైతు కుటుంబానికి రూ.6 వేలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి మిగిలిన రూ.4 వేలు జత చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతుకు అందిస్తుంది. ఖరీఫ్‌లో రూ.5 వేలు, రబీకి రూ.5 వేలుగా అందిస్తారు.  కౌలు రైతులకు కూడా ఖరీఫ్ నుంచి ఇచ్చి ఆదుకునేలా మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 76.21 లక్షల కమతాలు ఉన్నాయి. 5 ఎకరాల కమతాల వారు 60 లక్షల మంది ఉన్నారు. ఫిబ్రవరి చివరలోనే అన్నదాత సుఖీభవ’ చెక్కుల పంపిణీ చేస్తారు. రైతు రుణ మాఫీ  చెల్లింపులు కూడా వెంటనే చేపట్టాలని నిర్ణయించారు.  కేంద్ర పథకం 5 ఎకరాల లోపు వారికే వర్తిస్తుంది. పైగా3 వాయిదాలలో ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ ఈ లబ్దిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

 • పేదలకు ఇళ్ల పట్టాలు, డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తారు.  
 • సిమ్ కార్డుతో పాటు 3 ఏళ్లపాటు కనెక్టివిటీ
 • ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మండలి ఏర్పాటు
 • ఇకపై అగ్రికల్చర్హార్టీకల్చర్ ప్రాక్టీషనర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
 • వ్యవసాయ విద్యలో డిగ్రీ సర్టిఫికేట్ల పరిశీలన, నకిలీ సర్టిఫికెట్ల ఏరివేత.
 • పోలవరం DPR-2కు సీడబ్ల్యూసీ ఆమోదంపై చర్చ. రివైజ్డ్ డీపీఆర్ పూర్తిగా ఆమోదించేలా చూడాలన్న సీఎం. చింతలపూడి ఎత్తిపోతల నుంచి నీటిని అందించడంపై చర్చ.
 • కంటింజెన్సీ ఉద్యోగుల జీతాల పెంపు: పంచాయతీలలో కంటింజెన్సీ ఉద్యోగులకు జీతాల పెంపుపై నిర్ణయం.
 • DSC 1998 క్వాలిఫైడ్లకు శుభవార్త: 1998లో డీఎస్సీ క్వాలిఫైడ్ అయిన 36 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని నిర్ణయం.
 •  మరో 22 ఆస్పత్రుల స్థాయి పెంపు
 • ఐఎఎస్ఎన్టీవోలకు ఇళ్ల స్థలాలు
 • పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు
 • ధర్మ పోరాట దీక్షపై దుష్ప్రచారం: ఢిల్లీ ధర్మపోరాట దీక్షకు చేసిన ఖర్చు (రైలుకు రూ.కోటీ 23 లక్షలు ప్లస్ ఏపీ భవన్‌లో అయ్యింది రూ. కోటీ 60 లక్షలు) మొత్తం రూ.2 కోట్ల 83లక్షల ఖర్చుకు కేబినెట్ ఆమోదం.
 •  2011 సెప్టెంబరు 17న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోదీ  సద్భావన మిషన్’ పేరుతో 3 రోజుల పాటు చేసిన ఖర్చు ధర్మపోరాట దీక్ష ఖర్చు కంటే చాలా ఎక్కువ.
 • భోగాపురం పరిహారం: భోగాపురం ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చిన వారికి ఇవ్వాల్సిన దాంట్లో  మిగిలింది  రూ.5 లక్షలు కూడా చెల్లించాలని నిర్ణయం. దాని కింద రూ.35 కోట్లు ఇవ్వాలని నిర్ణయం.
 • సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) పరిధిలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీలో ఒక గెజిటెడ్ లైబ్రేరియన్ పోస్టు మంజూరు.
 • 78 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం. వీటితో పాటు 9 మంది సీనియర్ అసిస్టెంట్స్, 28 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు,  28 మంది శాంప్లింగ్ అసిస్టెంట్ పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించాలని నిర్ణయం.
 • చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని వికృతమాల గ్రామంలో ఏర్పాటైన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ –2లో డిక్సన్ టెక్నాలజీ ఎల్ఈడీ టీవీలుసీసీ కెమెరాలుడిజిటల్ వీడియో రికార్డర్స్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేయడానికి రెండు షెడ్లను లీజుపై ఇస్తారు. ఒక్కో చదరపు అడుగుకు రూ.26 లీజు ధరకు 30 ఏళ్లు ఇవ్వడానికి కేబినెట్ నిర్ణయించింది.
 • భూ కేటాయింపులు: సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సిఈఎస్ఎస్) సంస్థకు అమరావతి కేపిటల్ సిటీ వెలుపల 10 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం.
 • గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరం గ్రామంలో 765/400 KV సబ్ స్టేషన్ ఏర్పాటుకు పవర్ గ్రిడ్ సదరన్ ఇంటర్ కనెక్టర్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ లిమిటెడ్ కు 4.15 ఎకరాల భూమి.
 • తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి చెందిన 17.17 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం.
 • విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మారుపల్లి గ్రామంలో 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి బదలాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం.
 • చిత్తూరు జిల్లా బి. కొత్తకోట మండలం కోటవూరు,  బయ్యప్పగారి పల్లె హార్టికల్చర్ రిసెర్చి స్టేషన్ ఏర్పాటు.
 • వైఎస్.ఆర్. కడప జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరం గ్రామంలో ఎం.ఎస్.ఎం.ఇ పార్కు ఏర్పాటు. ఇందుకోసం 153.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉచితంగా కేటాయింపు.
 • కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో ఇళ్ల నిర్మాణానికిటౌన్ షిప్ అభివృద్ధికోసం కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA)కి 56.94 ఎకరాల భూమి కేటాయింపు.  మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ. 10,81,804 చెల్లించే షరతకు లోబడి కేటాయించడానికి మం త్రిమండలి ఆమోదం.
 • చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో వెంకట పద్మావతి ఎడ్యుకేషనల్ సొసైటీకి మెడికల్ కాలేజీ ఏర్పాటుకోసం  38.22 ఎకరాలకు ఇచ్చిన  లీజు కాలపరిమితి మరో 3 ఏళ్లకు పొడిగింపు. నిర్ణయించిన లీజు సొమ్ములో బకాయి సొమ్ము చెల్లించే షరతుతో లీజు పొడిగింపు.
 • ప్రభుత్వ రంగ చమురు సంస్థ POL ఔట్ లెట్ ఏర్పాటు చేసుకొనేందుకు చిత్తూరు జిల్లా తిరుపతిలో ఖాళీ స్థలం 606.07 చ.గ కేటాయిస్తూ తిరుపతి అర్బన్ ఎస్.పికి అనుమతి.
 • చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో 496.24 ఎకరాల భూమి ఏపీ ఎయిర్ పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ అండ్ సీఈఓ కు ముందస్తు స్వాధీనం. (ఇందులో  433.84ఎకరాల డి.కె.టి  భూమిశాంతిపురం మండలం సోనేగానిపల్లిలో 41.75 ఎకరాల ప్రభుత్వ భూమి, 20.65 ఎకరాల డి.కె.టి భూమి  ముందస్తు స్వాధీనానికి జిల్లా కలెక్టరుకు అనుమతి. 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *