జిలేబీలు వేస్తాం.. అప్పడాలు చేస్తాం!!

March 4, 2019 | News Of 9

 (న్యూస్ ఆఫ్ 9)

పసుపు చొక్కా ఉండదన్న మాటేగానీ… చంద్రబాబు కోసం పని చేసే ‘‘పెయిడ్ వారియర్లు’’ పాత్రికేయుల్లో కూడా ఉన్నారంటే.. మీరు ఆశ్చర్యపోతారా? ఏమాత్రం మీరు ఆశ్చర్యపోరని తెలుసు. ఎన్టీరామారావును వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని కమ్మ సామాజిక వర్గం నుంచి చేజారిపోకుండా కాపాడుకున్న వారిలో అనేక మంది సీనియర్ పాత్రికేయులు ఉన్నారు. అంతరించిపోతున్న జర్నలిజాన్ని బతికించడానికి ఈ భూమ్మీద మిగిలిన అరకొర జర్నలిస్టులు ఎవరైనా ఉన్నారంటే ఇది వీళ్లే అని చెప్పుకోగలిగినంత పేరు సంపాదించారు. ఉద్యోగాలు చేసే అవసరం కూడా లేనంత డబ్బు సంపాదించుకున్నారు. ఇక తాపీగా కూర్చుని విశ్లేషణలు చేస్తుంటారు. చంద్రబాబు కోసం పని చేసే ఇలాంటి వారు అన్ని రంగాల్లో అంటే కీలకమైన పోలీసు, కోర్టులు, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, మౌలిక నిర్మాణ రంగాలు ఇంకా అనేకవాటిలో ఇమిడిపోయి ఉన్నారు. ఆయా రంగాల్లో వారు నిపుణులుగా, వృత్తి నిపుణులుగా వెలిగిపోతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రైవేటు లిమిటెడ్ గా కొనసాగించడంలో భాగంగా ఏ రంగంలోనైనా చంద్రబాబు సామాజిక వర్గం వారే అంతిమ తీర్పులు చెబుతారు. చంద్రబాబును మించిన దేవుడు లేడని చెబుతారు. విమర్శించినట్లే విమర్శించి ఆకాశానికి ఎత్తేస్తారు కూడా. చంద్రబాబు ప్రభుత్వం విఫలం అన్న మాట కలలో కూడా వారికి నోటి వెంట రాదు. అవినీతి అనేది ఒక సహజమైన ప్రకృతి ఏర్పాటుగా వారు భావిస్తారు.

ఒక సీనియర్ పాత్రికేయుడు ఇంటర్వ్యూ ఇపుడు చూద్దాం: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారా? అన్న యాంకర్ ప్రశ్నకు … ‘‘మార్పు ఏమోగానీ… అస్థిరతను తెచ్చాడయ్యా..’’ అన్నారు. రేపు పవన్ కళ్యాణ్ సీఎం అయినా.. గాలివాటుగా అయ్యాడని, ప్రపంచంలో ఎవరూ అనుకోలేదని వీళ్లే చెబుతారు చూడండి. కమ్మవారే ఎల్లప్పుడూ అధికారంలో ఉండేందుకు వేలాది మంది పెయిడ్ వారియర్లు ఎంత కష్టపడతారో చూడండి. ఒక ఇంటర్నెట్ తనకు తెలియకుండా ప్రపంచంలోని అన్నింటితో ఎలా అనుసంధానమై పని చేస్తుంటుందో.. ఈ సామాజిక వర్గం ‘‘వరల్డ్ బ్రెయిన్’’ తరహాలో పని చేస్తూ ఉంటుంది. ఈ లక్షణం వారి జన్యువుల్లో కూడా ఉండి ఉంటుందని కొందరు అంటారు. చిరంజీవి వచ్చినప్పటి స్థితే ఉందని సెలవిచ్చారు. చిరంజీవికి స్టడీనెస్ ఉందంట. పద్ధతి ఉందంట. చిరంజీవి మొహమాటస్థుడు, మంచివాడు అని ఓ కితాబు పారేశారు. చిరంజీవి మంచివాడు కాబట్టే… మెగాస్టార్ ఫోటోలు మాగోడకు వేలాడుతుంటాయి అని అబద్ధాలు చెప్పి… పార్టీలో చేరి ఆయన్ను ఈ వర్గం వారే ముంచారు. చిరంజీవి మంచివాడు అంటే పవన్ కళ్యాణ్ మంచివాడు కాదనే కదా… ఇవన్నీ తెలిసే… పవన్ జాగ్రత్తగా ఉన్నాడు. 2009 నాటి తైతిక్కలు నా దగ్గర కుదరవనీ, తాట తీస్తానని చెప్పేశాడు. అందుకు పవన్ కళ్యాణ్ మంచివాడు కాదని దుష్ప్రచారం చెయ్యాలి. ఎన్టీరామారావు కూడా అలాంటివాడేనని కూడా చెప్పారు. ధన్ మని వచ్చేశాడంట. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం అనేది హైపోథెటికల్ అని చెప్పారు. అంటే అబ్బే… అంత సీన్ లేదని సారు చెబుతున్నారని అర్థం చేసుకోవాలి. పవన్ ముఖ్యమంత్రి కావడానికి ఒకటే ఒకటి ఉంది. అది… ఓ ముష్టి 30 సీట్లు తెచ్చుకుని కర్ణాటకలో కుమారస్వామిలా సీఎం అవ్వచ్చని సెలవిచ్చారు సారు. ఎలా మళ్లీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని అన్నది మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు మాత్రం దైవాంశ సంభూతుడు. అపర గాంధీ అని వారి నమ్మకం కావచ్చు. ఆయన ఎన్నికల్లో ఉంటే.. లక్షల కొద్దీ ప్రజలు ఓట్లు గుమ్మరిస్తారని వారి నమ్మకం. వారు నిజంగానే నమ్ముతారో లేక నమ్మబలుకుతారో తెలియదు. తెలుగుదేశం కాదంటే… వైసీపీ అంటున్నారట.. వైసీపీ కాదు అంటే తెలుగుదేశం అంట.. సమీకరణాలతో నడుస్తున్నాయని సారు విశ్లేషిస్తున్నారు. అందుకే… వైసీపీలోకి అనేక మంది కమ్మవారు వెళ్లిపోతున్నారు కాబట్టి.. ఇప్పుడు ఈ సామాజిక వర్గం ఆలోచన ఎలా ఉంటుందంటే.. టీడీపీ గెలిచినా అయినా ఫర్వేలేదు.. వైసీపీ గెలిచినా ఫర్వాలేదు అని నిర్ణయానికి ఎప్పుడో వచ్చేసి ఉంటారు. కుటుంబ పాలన, కోట్లున్న వారే రాజకీయాలను హైజాక్ చేయడం నచ్చని పవన్ కళ్యాణ్.. అందరికీ కండువాలు కప్పడం లేదు. అదీ వీరి బాధ. పూరి గుడిసె నుంచి చిరిగిన చొక్కాతో వచ్చిన కుర్రాడితో రాజకీయం చేస్తానంటున్నాడు పవన్ కళ్యాణ్. యస్. కావాల్సింది అదే. 70 ఏళ్లుగా రాజకీయాలను కోటీశ్వరులు అదీ రెండు సామాజిక వర్గాలు తమ కాళ్ల కింద తొక్కి పెట్టాయి. రాజకీయాలకు, తద్వారా దోపిడీకి గురవుతున్న సామాన్యులకు విముక్తి లభిస్తోంది. అదీ వారి బాధ. తెలుగుదేశం వారంతా… వైసీపీలోకి వచ్చేస్తే అది వైసీపీ ఎందుకు అవుతుంది? అది తెలుగుదేశం పిల్లపార్టీ అవుతుంది. రేపు వైసీపీని పరోక్షంగా చంద్రబాబు ద్వారా… ఆ సామాజిక వర్గం ద్వారా.. కాంగ్రెసు నియంత్రించే పరిస్థితి దగ్గర్లోనే ఉంటుంది.

పవన్ పార్టీలోకి వలసలు లేవు అని సారు చెబుతున్నారు. అంటే పాత పద్ధతి. ఏ పార్టీలోకి వలసలు ఎక్కువగా ఉంటే ఆ పార్టీ గెలుస్తుందన్న పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు. రొడ్డకొట్టుడు విశ్లేషణలు. అందుకే ఇపుడు న్యూస్ ఛానెళ్లు ఆధునిక యువ తరాన్ని ఆకర్షించలేకపోయాయి. రాజకీయాల్లో లోతుగా వెళ్లినట్టు కనిపించడం లేదని అంటున్నారు. వలసలు ఉంటే బాగా…. లో…తుగా వెళ్లినట్లు ఈ సీనియర్ పాత్రికేయుల ఊహగా ఉంది. చర్చలన్నీ… టీడీపీ, వైసీపీ అనే జరుగుతున్నాయిగానీ… జనసేన అని అనడం లేదట ఎవరూ…!! కులాలను చీల్చితే తప్ప పవన్ గెలవడం కష్టం అని ఆయన అంటున్నారు. అంటే, ఇన్నాళ్లూ.. టీడీపీ చేసింది ఇదే కదా.

జగన్… రాజకీయంగా బలమైన రెడ్డి సామాజిక వర్గం అనీ, ఆయనకు క్రిస్టియన్లు, ముస్లింలు కూడా ఉన్నారని సారు చెప్పారు. పవన్ కళ్యణ్ కు ఫిక్సుడు ఓటు బ్యాంకు ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం అని అన్నారు. కానీ ఆయన కులం లేదని అంటున్నాడని వాపోయారు. అంటే.. కమ్మ వారు చంద్రబాబుకీ, రెడ్లు జగన్ రెడ్డిగారికీ వేస్తారు. కానీ పవన్ కు ఓటు బ్యాంకు లేదని అంటున్నారు.. అసలు ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దనేగా… ఆయన పార్టీ పెట్టింది. ఈ కుళ్లును కడిగేయడానికేగా..!!

లేనిపోని అనుమానాలను జనాల్లో సృష్టించడం తప్ప… ఇలాంటి చౌకబారు రాజకీయ విశ్లేషణల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అన్నది ప్రశ్న. ఇలాంటి చెత్త వస్తుందని తెలిసే… టీవీలు చూడటం చాలా మంది మానేస్తున్నారు. సరే, వీటి సంగతి ఎలాగున్నా… ప్రజలు పవన్ కళ్యాణ్ కు జేజేలు పలుకున్నారు. కళ్లుండీ చూడలేని దివాంధులను ఏమీ చేయలేం. రేపు పవన్ కళ్యాణ్ సీఎం అయితే… అనుకోకుండా సీఎం అయ్యాడనో… లేక చంద్రబాబు గ్రహస్థితి బాగాలేదని లేకపోతే చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యేవాడని విశ్లేషణలు చేస్తారు చూడండి. 2004లో చంద్రబాబు ఓడిపోయినపుడు కూడా ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం అన్న ముక్క అనలేదు. ప్రజల్ని తప్పుదారి పట్టించారని అన్నారు. అంటే తనకు ఓటు వేస్తే… ప్రజలు చక్కగా ఓటు వేసినట్లు. లేకపోతే ఎవరో వారిని తప్పు దారి పట్టించినట్లు. అంటే ప్రజలు ఇచ్చే తీర్పును కూడా గౌరవించడం లేదు.

2004లో వైఎస్ వస్తాడని తెలిసినా… సొంత సామాజిక వర్గానికి చెందిన పాత్రికేయులు తెలుగుదేశం అధికారంలోకి వస్తోందని, బంపర్ మెజారిటీ వస్తుందని ‘‘పెద్దవారికి’’ విన్నవించారు. వీళ్లకు బ్యాండు పడుతుందని మనకు అప్పుడే తెలుసు. పడింది కూడా. కానీ ప్రజలు ఆనాడు రాజశేఖరరెడ్డి వైపే ఉన్నారు. పాదయాత్ర వల్ల వచ్చాడనో, అనూహ్యంగా వచ్చాడనో రాసుకున్నారు. రేపు జరగబోయేది ఇలాంటిదే అవుతుంది. సామ్రాజ్యవాదం, నియంతృత్వం ఉన్నపుడు ఎప్పుడూ నియంతదే గెలుపు అని చుట్టూ గులాంగిరీ చేసి నాలుగు డబ్బులు వెనకేసుకునే వారు.. మనసా వాచా నమ్ముతారు. అందరినీ నమ్మిస్తారు. నాలుగు మాటలు చెప్పేసుకుని విశ్లేషకులుగా చలామణీ అయిపోతారు. చివరికి వారితోపాటు నియంత కూడా మునుగుతాడు. దాన్నే చారిత్రకమార్పు అని అంటాం. పవన్ కళ్యాణ్ ను ఎవరో ఎంపిక చేయలేదు. చరిత్ర మార్పును కోరుతున్నది. చరిత్ర ఎంపిక- పవన్ కళ్యాణ్!!

యూట్యూబుల్లో, టీవీల్లో కూర్చుని ఇంటర్వ్యూలు చేసే వారు జర్నలిస్టులుగా చలామణీలో ఉన్నారు కానీ.. అందులో చాలా మంది జర్నలిస్టులు కాదు. ఆ మాధ్య టీవీ ఛానెళ్లను చూసి జనం సిగ్గుపడ్డారు. సినిమా ఫీల్డ్ లో ‘‘లం…లు’’ లేరా అని అడిగిన వ్యక్తి జర్నలిస్టు ఎలా అవుతాడు? అతను పని చేస్తున్న టీవీ… న్యూస్ ఛానెల్ ఎలా అవుతుంది? అది ప్రజలకు ఏం మేలు చేస్తుంది? డబ్బులు ఎక్కువై కొవ్వెక్కి వేసే గంతులు కాదా… ఇవి? ఇప్పటి వరకూ మనం మాట్లాడుకున్న ఇంటర్వ్యూల్లో ప్రశ్నలు కూడా ఎడిటర్ గారే రాసి ఇస్తారు. సమాధానాలు కూడా ఆయనే చెబుతారు. ఇది ఒక వృత్తిపరమైన రహస్య సంప్రదాయం.

అందరూ భావించేది ఏమంటే… జనం పిచ్చివాళ్లనీ, వాళ్లను మోసం చేయడం తేలిక అనీ. ఇలా చేసి ప్రజల దృష్టిలో పవిత్రులుగా ఉండి… చంద్రబాబుకు ‘‘ఓట్లు’’ అనే అప్పడాలు, జిలేబీలు చేసి పెట్టాలి. జర్నలిజం ముసుగులో ఈ జిలేబీలు వేయడం, అప్పడాలు చేయడం ఒక పరిశ్రమలా పగలూ రాత్రీ పని చేస్తూనే ఉన్నాయి.

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *