మేం చేసిన పనులు ఇవిగో: అమిత్ షా

February 12, 2019 | News Of 9

 • అసత్యాలను ప్రచారం చేస్తున్న చంద్రబాబు
 • రాష్ట్రానికి అన్యాయం చేయలేదు..
 • అడిగిన దానికన్నా ఎక్కువే ఇచ్చాం
 • రాష్ట్ర ప్రభుత్వమే కొన్నింటిని ఉపయోగించుకోలేదు
 • రైల్వే జోను రైల్వే కమిటీల పరిశీలనలో ఉంది
 • 8 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో 5 క్లియర్ చేశాం
 • పరిశీలనలో విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు
 • పూర్తి వివరాలతో ఆంధ్ర ప్రజలకు అమిత్ షా బహిరంగ లేఖ

అసత్యాలను ప్రచారం చేస్తూ…. ప్రజల్ని తప్పు దోవ పట్టిస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబుపై భాజపా అధ్యక్షుడు అమిత్ షా విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆయన ఆంధ్ర ప్రజలకు ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచిత్రమైన విన్యాసాలన్నీ చేస్తున్నారని ఆయన అన్నారు. ‘‘చంద్రబాబు మరోసారి తన విన్యాసాలకు తెర తీశారు. విజయావకాశాలు తగ్గిపోవడంతో మీడియాలో ప్రముఖంగా కనిపించాలని కోరుకోవడం అర్థం చేసుకోదగిందే’’ అని చురక అంటించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల దృష్టిలో చంద్రబాబు విలువను కోల్పోయరనీ, రకరకాల వర్గాలకు ఆయన వరాలు ప్రకటించడాన్ని బట్టి ఇది స్పష్టంగా తెలిసిపోతున్నదని అన్నారు. ఆయన అనేకసార్లు యూటర్న్ లు తీసుకున్నారనీ, కేంద్రంపైనా, భాజపా నాయకత్వంపైనా అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీపై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగజారారని అన్నారు. రాష్ట్రానికి ప్రధాని వచ్చినా ఆహ్వానించడానికి రాలేదని, కనీస మర్యాదలు కూడా పాటించలేదని గుర్తుచేశారు.

కేవలం అధికారం కోసమే చంద్రబాబు పని చేయడాన్ని ప్రజలు గుర్తించాలనీ, రాబోయే ఎన్నికల్లో ఆయనకు వారు బుద్ధి చెబుతారని అన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెసుతో కలిసిపోయారని నిందించారు. అధికారం.. కాంగ్రెసు వ్యతిరేక భూమికనే చంద్రబాబు బదాబదలు చేశారన్నారు. స్పెషల్ స్టేటస్ కేటగిరీ సర్వరోగ నివారణి కాదని అనేక సభల్లో చెప్పి… ఇప్పుడిలా చేయడమేమిటని మండిపడ్డారు. ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ ఉన్నపుడు కూడా కాంగ్రెసు తెలుగు ప్రజలను పట్టించుకున్నది లేదన్నారు. అనేక ప్రశ్నలకు కాంగ్రెసు, చంద్రబాబులు ప్రజలకు సమాధానాలు చెప్పాల్సి ఉందన్నారు.

కేంద్రం ఇప్పటి వరకూ ఏమేం చేసిందో అమిత్ షా చెప్పారు.

పోలవరానికి సంబంధించి 2014లోనే 222 గ్రామాలను బదిలీ చేస్తూ మోడీ ప్రభుత్వం చర్య తీసుకున్నదనీ, కేంద్ర ప్రభుత్వం తనంత తానుగా ఈ పని చేసిందన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, ప్రాజెక్టు పనిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామనీ, నిజానికి ఇలా ఎక్కడా చేయరని చెప్పారు. 2014 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకూ రూ. 6,764.70 కోట్లు విడుదల చేశారని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం.. కేంద్రం చేయాల్సినదంతా చేసిందనీ, అడిగినదాని కన్నా ఎక్కువే చేసిందని అమిత్ షా అన్నారు.

సంకీర్ణ ధర్మాన్ని ఉల్లంఘించిందే కాకుండా తన రాజకీయ అవసరాల కోసం ఎన్డీఏ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారని అన్నారు. చంద్రబాబులో కాంగ్రెసు రక్తం ఉందని తమకు తెలుసునని, అయితే, ఈ స్థాయిలో వెళ్లి కలిసిపోతారని అనుకోలేదని అన్నారు. ఓడిపోతానన్న భయంతోనే ఇవన్నీ చేస్తున్నాడని అన్నారు. స్పెషల్ ప్యాకేజీపై సంతృప్తి వ్యక్తం చేస్తూ 2017 మార్చి16న అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కాంగ్రెసుతో కలిసిపోయి.. నీచానికి ఒడిగట్టారని అన్నారు. తెలుగుదేశం దెయ్యపు ఆలోచనలను గుర్తించాలని అమిత్ షా తెలుగు ప్రజలకు విన్నవించారు.

ఈ స్థాయిలో ఏ రాష్ట్రానికీ 70 ఏళ్లలో చేయలేదు

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒకే రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున ప్రాజెక్టుల్ని అందించడం అన్నది ఎన్నడూ జరగలేదన్నారు. పదేళ్ల వరకూ సమయం ఉన్నా.. చాలా ప్రాజెక్టుల్ని సత్వరమే ఇచ్చేశామని చెప్పారు. 13వ షెడ్యులు 93వ సెక్షను ప్రకారం.. 10 సంస్థల పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని అన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం కూడా వస్తోందని చెప్పారు. ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ ఈఆర్, ఐఐఐటీ, ఎయిమ్స్, కేంద్ర విశ్వవిద్యాలయం, పెట్రోలియం విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (ఎన్ఐడీఎం) సంస్థల్ని ఇప్పటికే ఇచ్చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

5 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

8 మౌలిక సదుపాయాల ప్రాజక్టుల్లో 6 ప్రాజక్టులకు సంబంధించి పరిశీలన, సాధ్యాసాధ్యాలపై చర్య తీసుకోవాలనీ, రెండింటిపై 10 ఏళ్లలోగా చెయ్యాలనీ, 5 ప్రాజెక్టులకు సంబంధించి పనులు ప్రారంభించామని తెలిపారు. 3 ప్రాజక్టులకు అనుకూలత లేదనీ, ఇతర అవకాశాలను పరిశీలిస్తున్నామనీ అన్నారు. హెచ్ పీసీఎల్, గెయిల్ ఆధ్వర్యంలో కాకినాడ వద్ద గ్రీన్ ఫీల్డ్ పెట్రో కెమికల్ కాంప్లెక్సును ప్రతిపాదించామనీ, లక్ష కోట్ల వరకూ ఈ కేంద్ర సంస్థ పెట్టుబడులు పెడుతుందని అన్నారు. రూ.39,145 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ పెట్రో కాంప్లెక్సు నిర్మిస్తారన్నారు. గెయిల్, హెచ్ పీసీఎల్ తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కూడా చేసుకుందన్నారు.

విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ను వేగిరం చేస్తున్నామన్నారు. విశాఖ- చెన్నై కారిడార్ లో తొలి ఫేజ్ 800 కిలోమీటర్లను (ఈస్ట్ కోస్ట్ ఎకనమిక్ కారిడార్)ను ప్రారంభించామని తెలిపారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు 631 మిలియన్ డాలర్లను రుణాలు, నిధులుగా అందిస్తోందని, 370 మిలియన్ డాలర్లు ఇప్పటికే విడుదల చేసిందన్నారు. కృష్ణపట్నం- చెన్నై, బెంగళూరు కారిడార్ ను ఇప్పటికే ఆమోదించామన్నారు.

విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామనీ, రాజమండ్రి విమానాశ్రయంలో రాత్రి పూట విమానాలు దిగేందుకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. రన్ వే విస్తరణ పనులు సాగుతున్నాయన్నారు. కడపలో కూడా రన్ వేని విస్తరిస్తున్నారనీ, కొత్త టెర్మినల్ నిర్మాణంలో ఉందని అన్నారు.

హైదరాబాదు నుంచి అమరావతికి రైల్, రోడ్డు రవాణా అభివృద్ధి పనులను చేపట్టినట్లు చెప్పారు. అలాగే అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకు కూడా రవాణ సౌకర్యాలను చేపట్టినట్లు తెలిపారు. అనంతపురం- అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే కోసం రూ.20,000 కోట్లు ఇచ్చేందుకు నేహాయ్ అంగీకరించిందన్నారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కోసం రూ.19,700 కోట్లు కేటాయించారు. బకింగ్ హాం కెనాల్ పునరుద్ధరణకు రూ.7,015 కోట్లు కేటాయించారు. రహదారులు, అంతర్గత జల రవాణాకు రూ.లక్ష కోట్లు ఆమోదించారు. ఇవన్నీ ఇచ్చినందుకే చంద్రబాబు బహిరంగంగానే కేంద్రానికి ధన్యవాదాలు కూడా చెప్పారు.

అనేక రైల్వే ప్రాజెక్టులు ఇచ్చాం

రైల్ రవాణా అభివృద్ధి కోసం రూ.50,000 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. 2,584 కిలోమీటర్ల రైల్వే లైన్లను డబుల్ మార్గాలుగా మారుస్తున్నారు. దీనికి రూ.23,213 కోట్లు కేటాయింపులు ఉన్నాయి. రూ.20,301 కోట్లతో 2,213 కొత్త రైలు మార్గాలను నిర్మిస్తున్నారు. రూ.26,403 కోట్ల వ్యయంతో 15 కొత్త ప్రాజక్టులను మంజూరు చేశారు. అమరావతి మీదుగా విజయవాడ నుంచి గుంటూరు వరకూ కొత్త రైలు మార్గాన్ని 2017-18 బడ్జెట్టులో కేటాయించారు. దీనికి రూ.2,679.59 కోట్లు దీనికి కేటాయించారు. నడికుడి-శ్రీకాళహస్తి లైనులో 309 కిలోమీటర్ల మార్గాన్ని రూ.2,289 కోట్లతో, గుంతకల్లు-గుంటూరు (401 కి.మీ) రైల్వే మార్గాన్ని రెండు మర్గాలుగా మార్చడం, విద్యుద్దీకరణ చేసేందుకు రూ.3,631 కోట్లు కేటాయించారు. రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు కేటాయించారు. పేద ప్రజల కోసం రికార్డు స్థాయిలో ఇళ్లను మంజూరు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) కింద 11.29 లక్షలు కేటాయించారు. నాలుగు స్మార్ట్ నగరాలను కూడా కేటాయించారు. అమరావతిని హెరిటేజ్ సిటీ డెవలప్ మెంటు, అగ్ మెంటేషన్ యోజనలో చేర్చారు.

7 వెనుకబడిన జిల్లాలకు రూ.1050 కోట్లు, రాయితీలు

రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ధికి రూ.1050 కోట్లు కేటాయించారు. ఈ వెనుకబడిన జిల్లాల్లో ఆదాయపు పన్ను రాయితీలను కల్పించారు. 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 మధ్య ఈ జిల్లాల్లో ప్రారంభించే ప్రాజక్టులకు 15 శాతం అదనపు తరుగుదలను అనుమతిస్తారు. ప్లాంటు, మెషినరీ కింద 15 పెట్టుబడి ప్రోత్సాహకం అందిస్తారు. విద్యుత్తు లోటు లేకుండా ఊజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన కింద విద్యుత్తు పనులు చేస్తున్నారు.  దీనివల్ల రూ.4,400 కోట్లు లబ్ది చేకూరుతుంది.

రూ.24,000 కోట్లు వ్యయంతో సోలార్ పార్కులను, మెగా సోలార్ పవర్ ప్రాజక్టును మంజూరు చేసింది. 2.2 కోట్ల ఎల్ ఈడీ బల్బులను అందించారు. ఏటా వినియోగదారులకు రూ.1100 కోట్లు ఆదా అవుతాయి. 23.8 లక్షల వీధి దీపాలను ఎల్ ఈడీ దీపాలుగా మార్చారు.

మెట్రో గురించి పరిశీలన జరుగుతోంది

విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రో సాధ్యాసాధ్యాలను కేంద్రం పరిశీలిస్తోంది. సవరించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం పంపాల్సి ఉంది. దుగరాజపట్నం ప్రాజక్టు అమలుకు సాంకేతికంగా వీలుపడదు. ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని చూపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాము. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఆర్ధిక అనుమతులు లేకుండానే.. రామాయపట్నం వద్ద చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని అమిత్ షా అన్నారు.

కడప దగ్గర స్టీల్ ప్లాంటు నిర్మాణం సాధ్యం కాదని సెయిల్ చెప్పిందని, అయినా కేంద్రం ఒక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశామనీ, అది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిందని, పీపీపీ విధానంలో చేపట్టాలని నిర్ణయించామన్నారు. అయితే, చంద్రబాబు ఆర్థికపరమైన అనుమతులేమీ లేకుండానే కడప్ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని అన్నారు.

రైల్వే జోను విషయమై.. రైల్వే కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి. పరిశీలనలో ఉంది.

10 ఏళ్ల గడువు పూర్తయ్యేలోపే… మౌలిక నిర్మాణ ప్రాజక్టులన్నీ కూడా పూర్తి అవుతాయి. స్పెషల్ ప్యాకేజీలో భాగంగా 2015-16, 2019-20 సంవత్సరాలకు ప్రధాని 20.02.2014న చేసిన ప్రకటన ప్రకారం నిధులు అంది ఉండేవి. అయిదేళ్లపాటు ప్రత్యేక సాయం ఇవ్వడానికే కేంద్రం ప్రతిపాదించింది. ఆంద్ర ప్రదేశ్ కు బయట నుంచి ప్రాజెక్టులకు కేంద్రం ఈ సాయాన్ని అందిస్తుంది. ఎఫ్ఆర్ బీఎం పరిమితుల దృష్ట్యా స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. అలా చేస్తే ఎస్పీవీకి డబ్బులు బదలాయిస్తారు. 2018 ఫిబ్రవరి 5, 7 తేదీల్లో జరిగిన చర్చల్లో కేంద్రం దీనిని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించలేదు.

రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం.. కేంద్రం మంత్రిత్వ శాఖల నుంచి రూ.3 లక్షల కోట్లుకు పైగా విలువ చేసే ప్రాజెక్టుల్ని అందించాయన్నారు. చట్టంలో చెప్పని వాటిని కూడా ఇచ్చామన్నారు.

బయట నుంచి వచ్చే ప్రాజక్టులను ఉపయోగించుకోవాల్సిందిగా చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని వాడుకోలేదన్నారు. ఎన్సీఈఆర్టీ, నేషనల్ ఇన్వెస్టుమెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్లను మంజూరు చేశామన్నారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మధ్య అవగాహన సంతకాలు జరిగాయనీ, రూ.38,500 కోట్లతో ప్రాజెక్టులు చేపడతారని అన్నారు. దీనివల్ల 3 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

ఈ జనవరి నుంచే ఏపీ హైకోర్టు పని చేయడం ప్రారంభించిందని అమిత్ షా అన్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న అటవీ భూమిని డీనోటిఫై చేయమని రాష్ట్ర ప్రభుత్వం అడిగిన మేరకు ఆ పని సాగుతున్నదని చెప్పారు.  14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,37,977 కోట్లు విడుదల చేశారు. 2013-14 సంవత్సరానికి సంబంధించి లోటు భర్తీ కోసం రూ.4,117.89 కోట్లు కేటాయించి, రూ.3,979.50 కోట్లు విడుదల చేసింది.

సంస్థల వివరాలు కింది విధంగా ఉన్నాయి:

 • National Academy of Customs, Excise and Narcotics at Palasmudram , Anantapur district;
 • Central Institute of Plastics Engineering and Technology at Surampalli Vijayawada;
 • NIOT Ocean Research facility at Thupilipallam, Nellore district;
 • Regional Institute of Education, (NCERT) Nellore (land yet to allotted by state);
 • MSME Technology Centre at Pudi, Visakhapatnam;
 • National Kamadhenu Breeding Centre at Chintaladevi, Nellore District;
 • Indian Culinary Institute at Tirupathi;
 • Regional Centre for Mental Health and Rehabilitation at Nellore;
 • Doordarshan Kendra at Vijayawada;
 • All India Radio station at Vijayawada;
 • New Regional Passport Office at Vijayawada;
 • Passport Seva Kendra at Bhimavaram;
 • School of Planning and Architecture at Vijayawada inaugurated, sanctioned in 2008 but on which no progress was made for nearly 10 years;
 • BEL Night Vision devices manufacturing at Nimmakuru;
 • BEL Missile manufacturing plant Pala Samudram, Anantapur District;
 • Naval Alternative Operational Base in Rambilli;
 • Naval Air Station in Bobbili at advance stage of planning;
 • DRDO Missile Test Facility at Nagaylanka;
 • National Open Air Range Evaluation Centre in Kurnool district at a cost of Rs. 500 crores;
 • Troops Training Centre in Chittoor with an outlay of Rs. 500 crores;
 • Multi modal logistic hub at Vishakhapatnam;
 • Container freight station at Visakhapatnam;
 • Multimodal logistic park at Kakinada;
 • Spices Park at Guntur;
 • SAMEERA Centre for Electromagnetic Environmental Effects at Vishakhapatnam;
 • MOU signed by RINL and GoAP for expansion of Vizag steel plant with an outlay of Rs. 38,500 crores;
 • Greenfield Electronics Manufacturing Cluster being setup in Chittoor district;
 • Central Research Institute for Yoga and Naturopathy is being set up in Krishna District;
 • Under Swadesh Darshan, Kakinada Hope Island Coastal Tourism Circuit and Nellore Coastal Tourism Circuit;
 • Asia’s first medical devices manufacturing hub at Vishakhapatnam.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *