అతివేగంతో అదుపు తప్పిన బస్సు.. డ్రైవర్లు దుర్మరణం

April 16, 2019 | News Of 9

Bus met with an accident...Driver died on spot | telugu.newsof9.com

కృష్ణాజిల్లా: హైదరాబాదు నుంచి విజయవాడ మార్గంలో వెళ్తున్న ఓ బస్సు పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల గ్రామంలో రోడ్డు పక్కన గోతిలో పడిపోయింది. ప్రమాదానికి గురైన బస్సు టీఎస్ ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ అని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం అతి వేగంగా డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణం అని తెలిసింది. మృతి చెందిన ఇద్దరూ డ్రైవర్లుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. తెలంగాణ నిర్మల్ నుండి విజయవాడ వస్తున్న ఈ బస్ లో మొత్తం యాబైమంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులుల తెలియజేశారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *