ఇప్పుడే ఏమీ చెప్పలేం… మే 23 వరకూ ఆగాల్సిందే

April 22, 2019 | News Of 9

Undavalli Arun Kumar | telugu.newsof9.com

  • ఏపీ ఫలితాలపై ఉండవల్లి అరుణ్ కుమార్

(న్యూస్ ఆఫ్ 9)

25 కేజీల బియ్యం కాదు.. 25 ఏళ్ల భవిష్యత్తు కోసం అంటూ వచ్చిన జనసేన పార్టీని ప్రజలు ఆదరించి ఉంటారా?

లేక

పసుపు-కుంకుమ పథకం ద్వారా పది వేల రూపాయలు అందించిన తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించి ఉంటారా?

లేక

నాకో అవకాశం ఇవ్వండి… అంటూ అడిగిన వైసీపీని ప్రజలు ఆదరించి ఉంటారా?

ఇదే ప్రశ్నను సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ను అడిగినపుడు ఆయన ఏదీ స్పష్టంగా చెప్పలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అందించిన పది వేల రూపాయలు ఆ పార్టీకి మేలు చేసే అవకాశం ఉండొచ్చని మాత్రం చెప్పారు. దీనికి ఆయన చెప్పిన కారణం.. డబ్బులు తీసుకున్న పేదవారు ఇతరుల్లా మోసం చేయ్యలేరని, అలాంటి వారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఉండొచ్చని అన్నారు. ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన ఏపీ ఎన్నికల ఫలితాల గురించి తన అభిప్రాయాలను వ్యక్తీకరించారు. ఇప్పటి వరకూ మన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రజల స్పందనను అంచనా వేసుకుని మాత్రమే ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు మనకు అర్థం అవుతుంది. అలాగే జగన్ పార్టీ మునుపటి కంటే బాగానే పుంజుకుందని ఆయన చెప్పారు. జనసేనకు యువతలో ఎక్కువగా ఆదరణ ఉందని, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే పోటీ మాత్రం తెలుగుదేశం-వైసీపీల మధ్యే జరిగిందని, జనసేన మూడో స్థానంలో ఉందని ఉండవల్లి అంచనా వేశారు. ఏదైనా ఫలితాలు వచ్చే వరకూ ఆగక తప్పదని, ముందే ఊహించడం కష్టమేనని మాత్రం అన్నారు. మే 23 నాడు మాత్రమే అసలు ఫలితాలు తెలుస్తాయని ఆయన అన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *