సీబీఐ మాజీ అధికారి టీడీపీలో చేరడం లేదు… !!

March 15, 2019 | News Of 9

CBI-EX officer not joining in TDP now!!| telugu.newsof9.com

(న్యూస్ ఆఫ్ 9)

సీబీఐ మాజీ అధికారి వీవీ లక్ష్మీనారాయణ గురించి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని, ప్రస్తుతానికి ఆయన్ను పార్టీలో చేర్చుకునే అంశాన్ని పక్కన పెట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీలో చేర్చుకుని ఎన్నికల్లో పోటీ చేయించాలని తొలుత భావించింది కానీ.. వివిధ కారణాలతో ఈ ప్రయత్నాన్ని పార్టీ విరమించుకున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీనారాయణ… తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఈనాడు దినపత్రిక వార్త ప్రచురించిన వెంటనే… ఆయనపై సాక్షి దినపత్రిక పెద్ద ఎత్తున దాడి చేసింది. లక్ష్మీనారాయణ.. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మనిషేనని, ముసుగు తొలగిందని పెద్ద వార్త ప్రచురించింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆఫర్ వచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఆయన ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని అప్పటికి ఆయన సన్నిహితులు అదే రోజున తెలిపారు.

లక్ష్మీనారాయణను… ఆయన సన్నిహిత వర్గంలో ఉన్న కొందరు వ్యక్తులే ఆయన్ను తప్పుదారి పట్టిస్తున్నారన్న వాదన ఒకటి ఉంది. జనసేన పార్టీలోకి ఆయన వస్తే బాగుంటుందన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్ నేత ఈ దిశగా ప్రయత్నాలు చేసినా… అవి ఎందుకోగానీ ఫలించలేదు. ఎన్నికలు ముంగిట్లో ఉన్న నేపథ్యంలో ఈ ఇబ్బందులు ఎందుకు అనుకున్నారేమో… టీడీపీలో చేరే అంశాన్ని ఆయనే ప్రస్తుతానికి పక్కన పెట్టి ఉండొచ్చు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *