వ్యక్తిగత స్వార్ధంతోనే చంద్రబాబు దీక్షలు: కేవీపీ

February 8, 2019 | News Of 9

KVP | telugu.newsof9.com

విజయవాడ: దీక్షలు, దర్నాల పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఘాటుగా విమర్శిస్తూ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు.. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై చంద్రబాబు ఈ నెల 11న దీక్ష చేస్తుండంతో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ ప్రధాని కావడాన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటున్న కేవీపీ ‘‘రాహుల్ గాంధీ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. మోడీ శకం మరి కొన్ని రోజులలో ముగియనుంది. మోడీ గద్దె దిగేదిరాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చేది తన వల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రజలను అనుకోవాలని చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ధర్నాలలో ఆయన వ్యక్తిగత  స్వార్థమే ఉంది. చంద్రబాబు కారుస్తున్న కన్నీళ్లు ప్రజలను మెప్పించడానికే అని ప్రజలు గ్రహించారు. వెన్నుపోటు తో ఎన్టీఆర్ పార్టీని, రాజకీయ  వారసత్వాన్ని లాకున్నారు. ఎన్టీఆర్ కొడుకులను కూడా కాదని మీరే నట వారసుడు కూడా అవ్వాలనుకుంటున్నారు. వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ తో పొత్తులు లేవని కాంగ్రెస్ అధిష్టాన స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం గత 4 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. రాజ్యసభలో కూడా రాష్ట్రం కోసం పోరాడాను. కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలలో ఎన్నో ఆటుపోట్లను చూసింది. ఎంతో మంది పార్టీలోకి వస్తుంటారు వెళ్తుంటారు. ఎవరున్నా లేకున్నా మహిళ, యువత, దళిత బడుగు బలహీన వర్గాలు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలో రావడానికి రైతులకు ,యువతకి ,వెనబడిన తరగతుల వారికి ,అన్ని కులాలకు దారి చూపేల మానిఫెస్ట్ లో రూపొందించి ప్రజలలోకి వెళ్తాము. ప్రత్యేక హోదా విషయంలో మా ప్రవేట్ మెంబెర్ బిల్ పోస్ట్ పోన్ అవుతుంది. వచ్చే రోజులలో రాజ్యసభ లో పోలవరం పై న చర్చ జరిగి న్యాయ జరుగుతుందని ఆశిస్తున్నా’’ అంటూ పేర్కొన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *