చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన కేంద్రం

November 29, 2018 | News Of 9

CBN | telugu.newsof9.com

అమరావతి: ప్రపంచ స్థాయిలో అమరావతి రాజధానిని నిర్మిస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన అటవీ సలహా కమిటీ తోసిపుచ్చింది. రాజధాని చుట్టూ ఉన్న రిజర్వు ఫారెస్టును మార్చడం కుదరదని తేల్చి చెప్పింది.. రాజధాని చుట్టూ ఉన్న 3,306 హెక్టార్ల అడవిని డీనోటిఫై చేయడానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన దరఖాస్తును కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ (అడవులు) నేతృత్వంలోని అటవీ సలహా కమిటీ తిరస్కరించింది. కొత్త రాజధాని ప్రాంతంలో ఉన్నఅటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చేసి…ఆ భూముల్ని ప్రభుత్వంతోపాటు, ప్రైవేటు కంపెనీలు ఉపయోగించుకునేందుకు ధారాదత్తం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తున్నది.

ప్రత్యామ్నాయ భూములను చూపించకుండా, ఇతరత్రా ప్రయోజనాలకు 3,306 హెక్టార్ల అటవీ భూములను డీనోటిఫై చేయాలని కోరడం విడ్డూరంగా ఉందని ఆరుగురు సభ్యులున్న సలహా కమిటీ వ్యాఖ్యానించింది. ‘‘హరత వనాల కోసం అమరావతి రాజధానికి కేటాయించిన దానిలో కేవలం 5 శాతం భూములనే కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నది. ఉన్న 3,306 హెక్టార్లను తీసుకుంటే… ఖచ్చితంగా పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుంది’’ అని కమిటీ వ్యాఖ్యానించింది.

ప్రత్యామ్నాయ భూములను చూసుకోవాలని చెప్పడంతోపాటు, పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు వన సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరింది. ‘‘ప్రతిపాదించిన రాజధాని ప్రాంతంలో హరిత ప్రాంతం తక్కువగా ఉందని, ఇది దేశంలో ఏ రాజధాని ప్రాంతం కంటే తక్కువగా ఉంది’’ అని తెలిపింది.

అటవీ సలహా కమిటీ అభిప్రాయాలను చూసిన తర్వాత.. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తానంటూ చంద్రబాబు చెబుతున్న కబుర్లు భ్రమరావతి కబుర్లుగా కనిపిస్తున్నాయి. అడవీ భూముల్లో… ఎకో థీమ్ పార్కు, సమీకృత వ్యవస్థల సముదాయం, సైన్స్ సిటీ, ఎకో టూరిజం గ్రామం, బయో డైవర్శిటీ పార్క్, ప్రభుత్వ కార్యాలయాలు వంటివాటిని నిర్మించాలని భావిస్తోంది.

ప్రతిపాదిత నిర్మాణాల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూములను వెదుక్కోవాలని సూచించింది. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *