విజయనగరంలో చంద్రబాబు… లుబ్దావధాన్లు!!

February 14, 2019 | News Of 9

Chandrababu | telugu.newsof9.com

విజయనగరం: సీఎం చంద్రబాబు సింపతీ కార్డు ప్రయోగిస్తున్నారు. తనతో పనులు చేయించుకుని అందరూ తనను వదిలి వెళ్లిపోతున్నారనీ, అది అన్యాయమనీ అంటున్నారు. పార్టీని విడిచి వెళ్లే నాయకులను చూసి భయపడననీ, తనతో వారికి కావల్సిన పనులు చేయించుకున్నారని, ఇపుడు సిగ్గు లేకుండా పార్టీ విడిచి వెళ్లిపోతున్నారనీ అన్నారు. విజయ నగరంలో ఆయన మాట్లాడుతూ… అడిగితే దాడులు చేస్తున్నారనీ, అందరూ తనపై కుట్ర పన్నుతున్నారనీ,  అందుకే  దేశంలోని ఇతర పార్టీలను ఏకం చేశాననీ చెప్పుకొచ్చారు. కోడికత్తి పార్టీకి విశ్వసనీయత లేదనీ, బొత్సను చూసి ఓక్స్ వేగన్ పారిపోయిందనీ, మోడీ ఎక్కడ చదువుకున్నారో తేలీదనీ, జగన్ ఏక్కడ చదువుకున్నారో తెలీదనీ,

చదువు లేని వారికి పదవులెందుకు అని చంద్రబాబు ప్రశ్నించారు. కోడి కత్తి పార్టీ కి విశ్వసనీయత లేదనీ, తనను లోకేష్ తండ్రి అంటూ మోడీ అన్నారనీ, మరి ఆయన ఎవరని అన్నారు. భార్యను గౌరవించని వ్యక్తి మోడీ అని చంద్రబాబు పేర్కొన్నారు. కోడి కత్తి పార్టీ మాపై బురద జల్లే ప్రయత్నం చేశారనీ అన్నారు. మోడీ, జగన్ కేసీ ఆర్ కలిశారనీ, తనపై కుట్రలు పన్నుతున్నారన్నారు. లోకేష్ తండ్రిగా… దేవా న్స్ తాతగా, భువనేశ్వరి భర్తగా తాను గర్వపడుతున్నానన్నారు. లోకేష్ తనని తాను నిరుపించుకున్నారనీ, ఐటీలో వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని అన్నారు. 24 వేల కిలో మీటర్ల సిమెంటు రోడ్లు వేయించారని చెప్పారు.

న్యూస్ ఆఫ్ 9 వ్యాఖ్యానం: సీఎం చంద్రబాబు మాట తీరు చాలా దారుణంగా ఉంది. సీఎం స్థాయిలో ఉన్నా కూడా వైఎస్సార్సీపీని కోడికత్తి పార్టీగా స్వయంగా సీఎం మాట్లాడటం ఆయన స్థాయిని సూచిస్తోంది. అర్థం కానిదేమంటే… చంద్రబాబు ఎంతసేపూ జగన్, మోడీల గురించి తప్ప మరో అంశం మాట్లాడటం లేదు. మౌనంగా అభివృద్ధి పనులు చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లవచ్చన్న స్పృహ ఆయనలో కనిపించడం లేదు. లోకేష్ తండ్రిగా… దేవా న్స్ తాతగా, భువనేశ్వరి భర్తగా గర్వపడటం సరే, ముఖ్యమంత్రిగా గర్వపడుతున్నదీ లేనిదీ కూడా చెబితే బాగుండేది కదా. మోడీకి చదువులేదనీ, జగన్ ఎక్కడ చదువుకున్నాడో తెలియదనీ కూడా ఆరోపించడం కూడా బాగలేదు. తెల్లవారి లేస్తే విషం గక్కడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. అధికారం ఎక్కడ పోతుందోనన్న భయం ఆయన్ను వెంటాడుతున్నది.

శృంగార పటుత్వం లేకపోయినా రాజకీయ నాయకులు ఉండగలరు కానీ, అధికారం లేకపోతే క్షణం ఉండలేరని పెద్దలు చెబుతుంటారు. విజయనగరంలో లుబ్దావధాన్లు బాగా ఫేమస్. 68 ఏళ్ల వయసులో కూడా అధికారం కోసం చంద్రబాబు పడుతున్న తపన చూస్తే.. వృద్ధాప్యంలో పెళ్లికొడుకు అయిన లుబ్దావధాన్ల పాత్ర గుర్తుకొస్తున్నది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *