ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాటం..

February 11, 2019 | News Of 9

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షను ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయనందుకు నిరసనగా ఈ దీక్ష చేపట్టారు. చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్న ఈ దీక్షలో కొన్ని ఎన్జీవోలు, ప్రజా, విద్యార్థి సంఘాలు కూడా పాల్గొన్నాయి. దీక్ష సందర్భంగా ఏపీ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు సహా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు

టీడీపీ నేతలంతా దీక్షా స్థలికి నల్లచొక్కాలతో తరలివచ్చారు. సభా ప్రాంగణమంతా ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తుతోంది. ఈ దీక్షకు మద్ధతు తెలుపుతూ రాహుల్ గాంధీ దీక్షాస్థలానికి చేరుకున్నారు. చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు అనేక రాష్ట్రాలకు చెందిన 23 పార్టీల నేతలు సంఘీభావం తెలుపనున్నారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్ వేషధారణ, హావభావాలతో ఓ వ్యక్తి దీక్షకు వచ్చిన వారిన ఆకట్టుకుంటున్నాడు. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *