తెలంగాణ ద్రోహి… చంద్రబాబు: కడియం శ్రీహరి

December 5, 2018 | News Of 9

Chandrababu is traitor of Telangana: Kadiyam Srihari | Newsof9

వరంగల్ : ఎన్నికల అనంతరం కేసీఆర్ ఆధ్వర్యంలో తెరాస ప్రభుత్వం ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. హన్మకొండ తెరాస అర్బన్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కేసీఆర్ గాలి విస్తోంది. డిసెంబర్ 7 న అది తుఫానుగా మారుతుంది. వరంగల్ లోని 12 సీట్లలో గులాబీ జెండా ఎగరవేస్తాం’’ అని అన్నారు. తెరాసాకి ఓటువేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రతి నియోజకవర్గానికి ఒక లక్ష ఎకరాలకు నీరు అందించడం లక్ష్యంగా పని చేస్తామనీ, పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పనకు దోహధపడతామనీ అన్నారు. చరిత్ర కలిగిన వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామనీ, మహాకూటమి తెలంగాణ వ్యతిరేకులు కూటమి తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ లోని సీఎం అభ్యర్థులే ఒడిపోనున్నట్లు ఆయన జోస్యం చెప్పారు. ‘‘కేసీఆర్ ను ఎదుర్కొనే నాయకుడు కూటమిలో లేరు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో జతకట్టడం కాంగ్రెస్ చేసిన చారిత్రక తప్పిదం’’ అని శ్రీహరి వ్యాఖ్యానించారు. లగడపాటిని రాజకీయ బఫున్ తో పోల్చుతూ, ఆయన సర్వేలకు మీడియా అనవసర ప్రచారం కల్పిస్తోందని దుయ్యబట్టారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *