జగన్ కు కన్ను కొట్టిన చంద్రబాబు!!

February 11, 2019 | News Of 9

(న్యూస్ ఆఫ్ 9)

వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిసి పని చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరంలేదని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు మాట విని… నెట్ వర్క్ 18 మహిళా విలేకరి పాపం కంగారు పడింది. వయసు మీద పడి చంద్రబాబుకు చిత్త చాంచల్యం ఏమైనా కలిగిందో ఏమోనని మళ్లీ స్పష్టంగా అడిగింది. తప్పేమిటి.. ‘‘జగన్ తో కలిసి పని చేస్తాం. తప్పేం ఉంది? ఎవరైనా మాతో కలవవచ్చు. దేశం మీద ప్రేమ ఉంటే.. ఒకటో రెండో సీట్లు వస్తే ఆయన మాతో కలవవచ్చు’’ అని చంద్రబాబు చెప్పారు. పెట్టుబడిదారీ పార్టీలన్నీ ఒకే తానులో ముక్కలని చంద్రబాబు నిరూపించారు. అంటే తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతపరంగా ఏ పార్టీతోనూ విభేదించే అవకాశం లేదు. ఎన్టీరామారావు జీవించి ఉన్నప్పుడే కాస్త నయం. చంద్రబాబు ఏదో దాస్తున్నారనీ, దేనికోసమో ఆయన ఆరాటపడుతున్నారనీ గుంటూరు సమావేశంలో ప్రధాని మోడీ చెప్పింది కూడా ఇదే. ఈ సారి ఆంధ్ర అధికారాన్ని చెర పట్టేయాలి. ఏది ఏమైనా అధికార డండాన్ని చేతిలో ఉంచుకోవాలి. రాష్ట్రం విడిపోయిన సందర్భంగా రేపు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంది. ఇంక ఆలస్యం చేయడానికి కేంద్రానికి కూడా అవకాశం లేదు. ఈ అవకాశాన్ని చేజిక్కించుకుంటే చంద్రబాబు సామాజిక వర్గం ఎక్కడికో వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు. ఈ కారణంగానే.. చంద్రబాబు చివరికి జగన్ తో చెట్టపట్టాలు వేసుకోవడానికి కూడా సిద్ధమైపోయారు. ప్రపంచం ముక్కున వేలేసుకున్నా… వివ్వెరపోయినా… కాంగ్రెసుతో చేతులు కలిపేశారు. అధికారమే పరమావధిగా చంద్రబాబు పని చేస్తున్నారనీ, తెలుగు వారి పరువుప్రతిష్ఠలను మంటగలుపుతున్నారనీ ప్రధాని మొట్టికాయలు వేసి ఒక్క రోజు కూడా కాలేదు. ఛీ… సాక్షి అంటే పేపరా అని ఛీత్కరించుకున్న చంద్రబాబు… ఇపుడు జగన్ వస్తే కలిసిపోతానని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.

తప్పులేదేమో… జనసేన రాకతో ఆంధ్రలో త్రిముఖ పోరు జరుగబోతున్నది. పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడం ఇటు వైఎస్సార్సీపీకిగానీ, అటు తెలుగుదేశంగానీ అడ్డుకట్ట వేయలేవు. అందుకుని… తెలుగుదేశం, వైఎస్సార్సీపీని కలుపుకుంటే ఎలా ఉంటుందో అన్న ఆలోచన చంద్రబాబు బుర్రలో ఏమైనా మొగ్గ తొడిగిందా? అన్న సందేహం కలుగుతోంది. తెర వెనుక ఏమీ జరగకుండా… చంద్రబాబు ఏమీ మాట్లాడరు. ఆయన నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఎడమ కన్ను అదురుతోంది.. !!

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *