`చిత్ర‌ల‌హ‌రి` రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం..

November 19, 2018 | News Of 9

Sai Dharam Tej chitralahari

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో `శ్రీమంతుడు`, `జ‌న‌తాగ్యారేజ్‌`, `రంగ‌స్థ‌లం` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం .. రెగ్యుల‌ర్ షూటింగ్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను 2019 ఏప్రిల్‌లో విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

 

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ – “కిషోర్ తిరుమల సినిమా అంటే కూట్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటూనే ఎమోష‌న్స్ క్యారీ అవుతుంటాయి. అలాంటి మ‌రో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ స‌బ్జెక్ట్‌తో చిత్ర‌ల‌హ‌రి తెర‌కెక్కుతోంది. రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మా బ్యాన‌ర్‌లో `శ్రీమంతుడు`, `జ‌న‌తాగ్యారేజ్‌`, `రంగ‌స్థ‌లం` చిత్రాల‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ సంగీతాన్ని అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయ‌న సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. సాయిధ‌ర‌మ్ తేజ్‌ను స‌రికొత్త యాంగిల్‌లో కిషోర్ తిరుమ‌ల‌గారు ప్రెజంట్ చేస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం“ అన్నారు.

 

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేదా పేతురాజ్‌ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ:  కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని, ఆర్ట్‌:  ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, సి.ఇ.వో/  సి.ఒ.ఐ:  పి.చిరంజీవి, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూస‌ర్‌:  కె.వి.వి.బాల సుబ్ర‌మ‌ణ్యం, కో-ప్రొడ్యూసర్: ఎం.ప్రవీణ్, నిర్మాత‌లు:  నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), ద‌ర్శక‌త్వం:  కిషోర్ తిరుమల.

Other Articles

6 Comments

 1. Pingback: viagra from india
 2. Hi my friend! I wish to say that this article is amazing, nice written and come with almost all significant infos.
  I’d like to see more posts like this .

 3. An outstanding share! I have just forwarded this
  onto a co-worker who has been conducting a little homework on this.
  And he in fact bought me dinner simply because I stumbled upon it for him…

  lol. So allow me to reword this…. Thank YOU for the meal!!
  But yeah, thanks for spending the time to talk about this subject here on your blog.

 4. Hiya! I know this is kinda off topic however I’d figured I’d ask.
  Would you be interested in exchanging links or maybe guest writing a blog post
  or vice-versa? My blog addresses a lot of the same subjects as yours and
  I feel we could greatly benefit from each other.

  If you are interested feel free to shoot me an email.
  I look forward to hearing from you! Fantastic blog by the way!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *