వివేకా మృతిపై దర్యాప్తునకు ప్రత్యేక బృందం: సీఎం

March 15, 2019 | News Of 9

ys vivekananda reddy | Telugu.news of 9

  • ఇంటిలిజన్స్ అధికారులతో భేటీ
  • నేరం చేసిన వాళ్లను వదిలేది లేదు
  • ·పోలీసులకు సత్వర ఆదేశాలు

 విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి అనుమానాస్పద మృతి వార్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణం స్పందించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివేకా మృతి పట్ల ప్రజల్లో అనుమానాలు రావడంపైనా హుటాహుటిన స్పందించి.. అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. డీజీపీతోనూ,  ఇంటలిజెన్స్ అధికారులు, కడప జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు. వివేకానంద రెడ్డి మృతిపై అత్యన్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిపై వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలని కూడా ఆదేశించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలనినిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంపీగాఎమ్మెల్యేగాఎమ్మెల్సీగా ఆయన దీర్ఘకాలం సేవలు అందించారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *