హంగ్ వస్తే… కిం కర్తవ్యం అంటున్న ఉత్తమ్!

December 10, 2018 | News Of 9

Uttam Kumar | telugu.newsof9.com

  • సాయంత్రం గవర్నర్ తో ప్రజా కూటమి భేటీ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలుస్తున్నామంటూ ఢంకా భజాయించిన కాంగ్రెసు నేతలు.. ఢిల్లీ పెరుగులు తీస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు తెల్లవారుజామున దేశ రాజధానిలో దిగిపోయారు. ఉదయం 9 గంటలకల్లా కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమై.. ఒకవేళ హంగ్ అసెంబ్లీ వస్తే.. అనుసరించాల్సిన వ్యూహం ఏమిటన్నదానిపై చర్చించారు. అలాగే ఆజాద్,  అశోక్ గెహ్లాట్ లతో కూడా ఆయన సమావేశమై… వ్యూహ రచన చేస్తున్నారు. ఆ వెంటనే… బయల్దేరి మళ్లీ హైదరాబాదుకు ప్రయణమయ్యారు. సాయంత్రం ప్రజాకూటమి బృందం గవర్నర్ ను కలుస్తోంది. 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *