సర్ ఆర్ధర్ కాటన్… దేవుడా…? దెయ్యమా?

February 4, 2019 | News Of 9

(న్యూస్ ఆఫ్ 9)

ఆశ్చర్యపోతున్నారు కదూ… మీరు ఆశ్చర్యపోతారని తెలుసు. ఎందుకంటే ఇన్నాళ్లూ మనం పుట్టిన దగ్గర నుంచీ ఆర్ధర్ కాటన్ గొప్పవాడనీ, మహాశయుడనీ, మాననీయుడనీ అని రకరకాలుగా పాఠాల్లో చదువుకున్నాం. పత్రికల్లో చదువుకున్నాం. అన్నం పెట్టాడని కాటన్ ను అభినవ దేవుడు అంటూ కొలుచుకుంటున్నాం. కానీ… బ్రిటీష్ వాళ్లు అందరికీ ఎందుకు మేలు చేస్తారనని ఒక్కసారైనా ఆలోచించామా? లేదు.

చాలా సార్లు ఆంగ్లేయుల వల్లనే మనం ఇలాగైనా ఉన్నామని కొంత మంది నోటికి వచ్చినట్లు కూస్తుంటారు. ఇవన్నీ చరిత్ర సరిగా తెలుసుకోకపోవడం వల్లనే జరుగుతున్నాయి. దోచుకున్నదానికి నష్ట పరిహారం బ్రిటీష్ వాళ్లు మనకు ఇప్పుడు కట్టాల్సివస్తే.. బ్రిటన్ మొత్తంలో ఉన్న డబ్బు పోగేసి తెచ్చినా ఇంకా మనకు కట్టాల్సింది మిగిలే ఉంటుంది. దోపిడీ పిశాచి స్వరూపం అలా ఉంటుంది. ఆ సొమ్మే ఉంటే ఈనాడు అమెరికాను మించి భారత్ ఒక వెలుగు వెలిపోయేది. అది వేరే సంగతి. బ్రిటీష్ వాళ్లు వెళ్లిపోయిన తర్వాత కూడా తెలుగు రాష్ట్రంలో మరో దోపిడీ జరిగింది. ఈ దోపిడీ కారణంగా 90 శాతం మంది ప్రజలు నేటికీ రాజకీయాధికారానికీ, అవకాశాలకూ దూరమై గత 70 ఏళ్లుగా పేదరికంలో మగ్గిపోతున్నారు.

ఇందుకు కారణం… మన చేత రోజూ పూజలు అందుకుంటున్న ఇంగ్లిషు దేవుడు సర్ ఆర్ధర్ కాటన్. పాత గోదావరి జిల్లాల్లో బ్రిటీషు వాళ్లకు పన్నులు సరిగా రావడం లేదు. అందుకని… ఏం చేస్తే పన్నులు వస్తాయో తెలుసుకోమని బ్రిటీష్ ప్రభుత్వం సర్ ఆర్దర్ కాటన్ ని అడిగితే.. ఆయన కృష్ణా, గోదావరిలపై ఆనకట్టలు కట్టాలన్నాడు. ఆ విధంగానే కట్టారు. దీనివల్ల గోదావరి డెల్టా సస్యశ్యామలం అయింది. బ్రిటీష్ ప్రభుత్వానికి పన్నులు పది రెట్లు వచ్చాయి. కానీ.. ఆ డెల్టా సస్యశ్యామలం కావడానికి ఉపయోగపడింది కేవలం ఒక సామాజిక వర్గానికే అన్నది వాస్తవం. ఆ సామాజిక వర్గం వారే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ధవళేవ్వరం వద్ద కాటన్ కోసం ప్రత్యేకంగా ఒక ఎగ్జిబిషన్ కూడా నిర్మించారు. ఆ సామాజిక వర్గానికి కాటన్ మహాశయుడు అంటే బ్రహ్మవిష్ణు మహేశ్వరులకంటే కూడా ఇష్టం. ఎందుకంటే… గోదావరి జిల్లాల్లో అప్పటికే వేల ఎకరాలు వారికే ఉండటం వల్ల వ్యవసాయం బంగారం అయింది. అలా వచ్చిన డబ్బుతోనే ఆ సామాజిక వర్గం నేడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చేసింది. రాజకీయ పార్టీని స్థాపించి… అప్పటికే సినిమాల్లో అపర శ్రీకృష్ణుడుగా పూజలు అందుకుంటున్న ఎన్టీరామారావును ముఖ్యమంత్రిని చేసింది అదే సామాజిక వర్గం.

కాటన్ మహాశయుడిని ఆ సామాజిక వర్గం పూజించడం వరకూ అర్థం ఉంది కానీ… సమాజంలో తిండిలేక, పిల్లలకు విద్యలేక అలమటిస్తున్న వెనుబడిన తరగతులు, కాపులు, ఎస్సీలూ, ముస్లింలు ఎందుకు పూజించాలి? డబ్బులేని వర్గాలు ఎప్పుడూ డబ్బున్న వర్గాలను పూజిస్తుంటాయి. వాళ్లేం చేస్తే కింది వారూ అదేపని చేస్తారు. దీన్నే ఎం.ఎన్.శ్రీనివాసన్ అనే సామాజిక శాస్త్రవేత్త ‘‘సంస్కృతీకరణ’’ అని చెప్పాడు.

దీంతో కోస్తాంధ్రలో కాటన్ కట్టిన ధవళ్వేశ్వరం ఆనకట్ట, విజయవాడలో కట్టిన కృష్ణా బ్యారేజీలు జమీందారుల వ్యవసాయ భూములకే గరిష్ఠంగా ఉపయోగపడ్డాయి. తద్వారా వారే ధనవంతులుగా మారారు. తర్వాత వ్యవసాయంలో వచ్చిన డబ్బుల్ని పరిశ్రమల్లో పెట్టి… మరింత ధనవంతులు అయ్యారు. కాటన్ ను దేవుడు అంటూ కమ్మ సామాజిక వర్గం పూజించడంలో అర్థం ఉంది. కూటికి ఠికాణా లేని 90 శాతం సామాజిక వర్గాలు కాటన్ ను ఎందుకు కులదేవుడి స్థాయిలో కొలవాలి అని మీరెప్పుడైనా ఆలోచించారా? చరిత్ర తెలియకపోవడం వల్లనే ఇలా జరుగుతోంది.

ఎందుకంటే… గోదావరి జిల్లాల్లో అప్పటికే వేల ఎకరాలు వారికే ఉండటం వల్ల వ్యవసాయం బంగారం అయింది. అలా వచ్చిన డబ్బుతోనే ఆ సామాజిక వర్గం నేడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చేసింది. రాజకీయ పార్టీని స్థాపించి… అప్పటికే సినిమాల్లో అపర శ్రీకృష్ణుడుగా పూజలు అందుకుంటున్న ఎన్టీరామారావును ముఖ్యమంత్రిని చేసింది అదే సామాజిక వర్గం.

డబ్బున్న వర్గాల ఆచార వ్యవహారాలను కింది వర్గాలు పాటించడం. కాటన్ కు ఒక సమాజిక వర్గం పూజలు చేస్తుంటే… అందరూ చేసేయడమేనా? దళిత వర్గాలు కూడా కాటన్ కు పూజలు చేస్తాయా? చేయవు. ఎందుకంటే ఎస్సీ వర్గాలకు వేలాది ఎకరాలు ఎలా ఉంటాయి? అలా ఉంటే వారు ఊరు బయట ఎందుకు ఉంటారు? అలాగే వెనుకబడిన బీసీలు వృత్తి కులాల్లో ఉంటారు. కాపులు వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. వారికి వేలాది ఎకరాలు ఎక్కడ ఉన్నాయి. వేలాది ఎకరాలున్నదీ, జమిందారీలుగా ఉన్నది 4 శాతంగా ఉన్న కమ్మలు. లేదా వెలమలు. లేదా రాజులు.

దీంతో కోస్తాంధ్రలో కాటన్ కట్టిన ధవళ్వేశ్వరం ఆనకట్ట, విజయవాడలో కట్టిన కృష్ణా బ్యారేజీలు కమ్మల వ్యవసాయ భూములకే గరిష్ఠంగా ఉపయోగపడ్డాయి. తద్వారా వారే ధనవంతులుగా మారారు. తర్వాత వ్యవసాయంలో వచ్చిన డబ్బుల్ని పరిశ్రమల్లో పెట్టి… మరింత ధనవంతులు అయ్యారు. కాటన్ ను దేవుడు అంటూ కమ్మ సామాజిక వర్గం పూజించడంలో అర్థం ఉంది. కూటికి ఠికాణా లేని 90 శాతం సామాజిక వర్గాలు కాటన్ ను ఎందుకు కులదేవుడి స్థాయిలో కొలవాలి అని మీరెప్పుడైనా ఆలోచించారా? చరిత్ర తెలియకపోవడం వల్లనే ఇలా జరుగుతోంది. నడిచి వచ్చిన దారి తెలిస్తే… ఎటు వెళ్లాలో దారి తెలుస్తుంది. ఎక్కడ నుంచీ వచ్చిందీ కూడా తెలియకపోతే ఎక్కడికి వెళ్లాలన్నది ఎలా తెలుస్తుంది?

అనేక సంవత్సరాలుగా పత్రికల్లో, 20 ఏళ్లుగా టీవీల్లోనూ కాటన్ దొర మహాశయుడు అనే చదువుకుంటున్నాం. ఇపుడు చెప్పండి… ధవళేశ్వరం ఆనకట్ట కట్టడం ద్వారా ప్రజల అందరికీ కాటన్ మేలు చేశాడా? అలా మేలు చేసి ఉంటే అందరూ ధనవంతులు అయ్యి ఉండాలి. ఆనాటి ఇంగ్లిషు దొరలకు కూడా కృత‌జ్ఞ‌తా స్తుతులు చెల్లించినదీ కూడా ధనికులైన కమ్మ రైతులేనని మీకు తెలుసా? ఇది విజయవాడలో జరిగింది.

నేటి రాజకీయాల్లో 90 శాతం మంది దేహీ అని అడుక్కుంటుంటే… సీఎం చంద్రబాబు పసుపు-కుంకుమ అనీ, గొర్రె-తోకా అనీ రకరకాల పథకాలు పెట్టి పన్నుల రూపంలో ప్రజలు కట్టిన సొమ్ములనే… తిరిగి వాటిని పంచి పెడుతూ.. చంద్రబాబు అపర దాన కర్ణుడుగా కీర్తిని గడిస్తున్నారే…? అంటే చంద్రబాబు దయార్ద్ర హృదయుడనీ, ప్రపంచంలో ఎవరికీ లేనంత జాలి గుండె ఆయనకు ఉన్నదని గానీ, లేదా మహాభారత కాలం నాటి కర్ణుడు ఆయన రూపంలో మళ్లీ పుట్టి ఉంటాడని అనుకుంటున్నారా? ఆంధ్ర ప్రజలారా.. ఏమని అనుకుంటున్నారు?

కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రాబాబు మాత్రమే కాపులకు ఏకంగా 5 శాతం రిజర్వేషను ఇస్తానని ఎలా అనగలుగుతున్నారు? పాపం.. ముద్రగడ పద్మనాభం ఎప్పుడూ ఆయన్నే ఎందుకు అడుగుతుంటారు? తెలంగాణలో రేవంత్ రెడ్డి వంటి వారు సీట్లు అడుక్కోరు ఎందుకని? బీసీ నేత కృష్ణయ్య లాంటి వారు, పొన్నాల లక్ష్మయ్యలాంటి వారు సీట్లు అడుక్కుంటుంటారు? కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారికి సీట్లు అడుక్కోవాల్సిన పరిస్థితి రాదు. ఎందుకని?

ఇలా వచ్చి… జగన్మోహన రెడ్డి సీఎం అయిపోతానని అనగలుగుతారు. లోకేష్ కు అలా అనాల్సిన అవసరం కూడా లేదు. జగన్ లా 3 వేల కిలో మీటర్లు నడవాల్సిన పని లేదు. సీఎం సీటు లడ్డూలా ప్లేటులో తెచ్చి ఇవ్వగల తండ్రి లోకేష్ కు ఉన్నారు. మరి లోకేష్ వయసులోనే ఉన్న ఏ మేథావిగానీ, అద్భుతమైన తెలివితేటలు ఉన్న ఏ ఇతర బడుగు వర్గాలకు చెందిన వ్యక్తీ సీఎం కావాలని కలలో కూడా అనుకోవడానికి సాహసం చేయలేడు. ఎందుకని? లోకేష్ యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచీ కష్టపడి ప్రతి పైసా సంపాదించాడా? లేదు.

90 శాతం మంది భయపడటానికీ, వెనకబడిపోవడానికీ అసలు కారణం… కాటన్ దగ్గర మొదలైంది. బ్రిటీష్ వాళ్లు పన్నులు వస్తే చాలు అనుకున్నారు కానీ, 90 శాతం మంది జీవితాలు బుగ్గి అయిపోతాయనీ, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిపోయి ఆదిమ కాలం నాటి జీవితాలు గడపాల్సి వస్తుందని కాటన్ ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఆనాటి ఇంగ్లిషు దొరలు కూడా డబ్బులున్న నల్ల దొరలకే సాయం చేసేవారు. పోతా పోతా బ్రిటీష్ వాళ్లు చేసినన్ని ఘోరాలు ఎన్నో. కాటన్… దొర పోయినా ఆ దొర కొత్త దొరల్ని తయారు చేసి పోయాడు. అయినా… కాటన్ దొరకూ, నేడున్న దొరలకూ మొక్కతున్నాం… ఏం చేస్తాం? బానిసత్వంలో ఉన్నామని తెలియడానికే యుగాలు పడుతున్నది.

జనసేన కవాతు.. మొన్న సరిగ్గా కాటన్ దొర కట్టిన ఆనకట్టపైనే సాగింది. కాకతాళీయంగా జరిగిందా? లేక పవన్ కళ్యాణ్ కు ఆనకట్టపై కవాతు చేయాలని భావించారా? సరే, కారణం ఏదైనా కాటన్ దొర ఆనకట్టపై బడుగు, బలహీన వర్గాలు కవాతు చేయడాన్ని ‘‘బహుజనుల ధిక్కారంగా భావించవచ్చా..? అదే జరిగి ఉంటే మంచిదే.

Related image

(70 ఏళ్ల ఊడిగానికి మూలాలు– సిరీస్ చదవితే ఇలాంటి ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. ఇదే వెబ్ సైటులో ఉంటాయి).

Other Articles

7 Comments

  1. Nice article, please keep on posting such articles.
    We are looking for good frequency of your articles and news projections.

    Thanks

  2. Excellent .. if I am reading this article my entire life is rolled in my mind . Somewhere someone should put a dot for it

  3. Nice article sir Diniki oka twitter varakey parmitam cheyakunda facebook lanti sitela lo Peditey ekkuva mandi caduvutaru ani na alochana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *