కౌంటింగ్ ప్రక్రియ ఇలా…!

December 9, 2018 | News Of 9

 

👉నియోజకవర్గానికి ఒకటి చొప్పున కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు.
👉ఒక్కొక్క కేంద్రంలో 14 టేబుళ్లు, రిటర్నింగ్ అధికారికి అదనంగా మరో టేబుల్ ఏర్పాటు.
👉కౌంటింగ్ కు ముందు ప్రిసైడింగ్ అధికారి సంతకాలతో ఉన్న 17 సీ ఫారం వివరాలు ఏజెంట్లకు తెలియజేస్తారు.
👉ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం..మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు.
👉అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
👉17 సీ ఫారంలో ఈవీఎంల వారీగా పోలైన ఓట్ల వివరాలు ఉంటాయి( పోలింగ్ పూర్తయ్యాక నమోదు చేస్తారు).
👉పోలైన ఓట్లు, ఏవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూసుకుంటారు.
👉వాటిని నోట్ చేసుకోవడంతో పాటు ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు తీసుకుంటారు.
👉వాటిని ఏజెంట్లు నోట్ చేసుకున్న అనంతరం ఈవీఎం ల సీల్ ను తొలగించి రిజల్ట్ బటన్ ను నొక్కుతారు. వెంటనే అభ్యర్థుల వారీగా…వారికి పోలైన ఓట్లు వెలువడతాయి.
👉ఒక్కొక్క రౌండ్లో 14 ఈవీఎం ల ఫలితాలు వెల్లడవుతాయి..పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి రౌండ్ల లెక్కింపు ఉంటుంది.
👉ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్వైజర్,అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు.
👉లెక్కింపు ప్రక్రియ అంతా రాజకీయ పార్టీలు, ఏజెంట్ల సమక్షంలో సాగుతుంది..ప్రతి రౌండ్ ఫలితాన్ని వారు సంతృప్తి చెందిన తర్వాతే వెల్లడిస్తారు.
👉కౌంటింగ్ పూర్తయ్యిన అనంతరం అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఏదయినా ఒకే వీవీ ఫ్యాట్ లోని ముద్రిత ఓటర్ స్లిప్పులను లెక్కిస్తారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *