డిసెంబరు 9కీ… తెలంగాణకీ మధ్య బంధం ఉంది: రేవంత్ రెడ్డి

December 9, 2018 | News Of 9

Killer teams engaged to eliminate me: Revanth Reddy Newsof9

హైదరాబాద్: డిసెంబరు 9వ తేదీకీ, తెలంగాణకూ అవినాభావ సంబంధం ఉందని కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు సోనియా పుట్టిన రోజు అని చెబుతూ… ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. ‘‘డిసెంబర్ 9 2009 నాడు…60 ఏళ్ల తెలంగాణ కల సాకారమైంది. 2018 డిసెంబర్ 9న తెలంగాణ కు పట్టిన చీడను, పీడను వదిలించుకున్నారు. సోనియాగాంధీ రుణం తీర్చుకునే అవకాశం తెలంగాణ ప్రజలకు దక్కింది’’ అని అన్నారు. 32 లక్షల కొత్త ఓట్లు నమోదయితే 21 లక్షల ఓట్లు ఇవ్వలేక పోయినందుకు రజత్ కుమార్ క్షమాపణ చెప్పారని తెలిపారు. కొంతమంది వల్ల చాలా మంది ఓట్లు వేయలేకపోయారని, 21 లక్షల మందికి ఓట్లు గల్లంతు కావడంపై  సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండు చేస్తున్నామన్నారు. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రే రెండు ప్రాంతాల్లో తన ఓటు నమోదు చేసుకున్నాడని అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 31 ప్రకారం కేసీఆర్ పై కేసు నమోదు చేయాల్సిందిగా ఎన్నికల ప్రధాన అధికారిని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.
సవాళ్లు.. ప్రతిసవాళ్లు
కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరాడని, ఒక వేళ కొడంగల్ లో తాను గెలవకుంటే శాశ్వతంగా రాజాకీయాలనుండి తప్పుకుంటానని, కేటీఆర్ విసిరిన సవాల్ ను నేను స్వీకరిస్తున్నానని తెలిపారు. కేటీఆర్ సవాల్ కు నేను ప్రతి సవాల్ విసురుతున్నానన్నారు. ఒక వేళ సవాల్ కు కేటీఆర్ కట్టుబడి ఉండకపోతే వారిది కల్వకుంట్ల వంశమే కాదని తెలంగాణ సమాజం అనుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ‘‘పేద ప్రజలు, ఉద్యమకారులు, తెలంగాణ సమాజం మాతో ఉన్నారు..అదే మా ధైర్యం…తెరాస వైపు కొంత మంది కాంట్రాక్టర్లు, అప్రజాస్వామిక వాదులు ఉన్నారు…అది వారి ధైర్యం’’ అని నాటకీయంగా చెప్పారు రేవంత్ రెడ్డి.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *