ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం పెద్ద డ్రామా! (పార్ట్ – 2)

December 3, 2018 | News Of 9

SR NTR | telugu.newsof9.com

ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలతో ధనిక వర్గాలు మమేకం అవుతాయి. దాంతో ఆనాటి వ్యవస్థను సవాలు చేయడం, ప్రజల్ని మభ్యపెట్టడం ధనిక వర్గాలకు తేలిక అవుతుంది. ‘‘తెలుగు వారి ఆత్మగౌరవం’’ దెబ్బతిన్నదంటూ ఎన్టీఆర్ ఊరూ వాడా ప్రచారం చేశారు. అందరూ దీనిని నిజమని నమ్మారు.  సొంత అవసరాల కోసం మీడియాతో కలిసి ‘‘తెలుగుదేశం పార్టీ ప్రైవేటు లిమిటెడ్’’ సృష్టించిన  పెద్ద డ్రామా!

బడుగు బలహీన వర్గాలకు బిస్కెట్లు పారేసి… కమ్మ సామాజిక వర్గం కోట్లకు పడగలెత్తడం వెనుక తెలుగుదేశం పార్టీ రాజకీయ ఫార్ములా ఏమిటి? ఇవన్నీ తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఈ తరం యువతకు అంతగా తెలియదు. సొంత కుల అభివృద్ది వ్యామోహం… అక్షర రూపంలో కనిపించక పోయినా ఆ ‘‘అర్థ’’ పరమార్థం ‘అద్దం’లా చదువరి కళ్ల ముందు సాక్షాత్కారం అవుతుంది. 

పౌరహక్కుల నేత, గణిత మేథావి, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ బాలగోపాల్ ఈ సామాజిక దోపిడీ గుట్టువిప్పుతూ తెలుగుదేశం పార్టీని డీకోడ్ చేశారు. ఇక చదవండి..!!

ఆత్మగౌరవ నినాదం నుంచి సన్యాసి వేషం వరకూ…

ఈ శక్తులు, వాళ్ల ఆకాంక్షలూ, వాళ్ల భ్రమలు అన్నింటికీ 2 రూపాయల పత్రికలు…  ‘‘ప్రాంతీయత’’ అని నామకరణం చేశాయి. భారత రాజకీయాల్లో రీజనల్ ఫీలింగ్స్..(ప్రాంతీయ భావనలు) ఎదుగుతున్న శక్తి అంటూ అనేక సార్లు పత్రికల్లో రాశారు. దీనిని మించిన చెత్త విషయం మరొకటి లేదు. నిజానికి ఇది భారత రాజకీయాల్లో పెరుగుతున్న అయోమయం. (ఇది కూడా తక్కువ ప్రాముఖ్యం ఉన్నదేమీ కాదు). చాలా మంది చెంచాగిరీ చేసే కాలమిస్టులు దీనిని నెత్తికి ఎత్తుకున్నారు. ఎందుకంటే తీవ్రస్థాయిలో విశ్లేషణలు చేయాల్సిన అవసరం కూడా లేదు. సైధ్ధాంతికంగా అవి రాజకీయ, ఆర్థిక శక్తులే. అందుకు రెండు కారణాలు ఉన్నాయి.

ఏకచ్ఛత్రాధిపత్యం ఉన్న ధనిక వర్గాలు..ఇది మా ప్రాంతం అని చెప్పుకోవడానికి కంటూ ఒక ప్రాంతం లేదు. మరెవరూ కూడా అప్పటి వరకూ ఇది మా ప్రాంతం అని ప్రకటించుకోలేదు. అలాంటప్పుడు.. ఈ ప్రాంతం మాది అంటూ ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలతో ధనిక వర్గాలు మమేకం అయితే.. ఉన్న వ్యవస్థను సవాలు చేయడం ధనిక వర్గాలకు తేలిక అవుతుంది (ఆంధ్ర రాష్ట్రం విడిపోతే ప్రపంచం మునిగిపోతోందంటూ నానా యాగీ చేసింది ఈ ధనిక వర్గాలే. అనువాదకుడు).

రెండోది.. నిరసన రూపాల్లో అన్నింటికన్నా పాలక వర్గాలకు మరింత ఆమోదనీయంగా కనిపించేది రీజనల్ ఫీలింగ్స్ అంటే… ప్రాంతీయ భావనలు. ప్రాంతీయ భావన అన్నదానిలో కులమత భావనలకు ఉండే ఆపరాధ భావన ఉండదు. 50ల్లో, 60ల్లో జరిగిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాల ఫలితంగా ఇక మిగిలింది ఇదే. భాషాపరమైన ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాలకు అధికారాలు, ప్రాంతీయ ప్రతిపత్తి వంటి వాటి కోసం మత శక్తులు, కుల శక్తులు, ఆర్థిక శక్తులు అన్నీ కూడా ప్రాంతీయ భావజాలం అన్న కోణంలోనే  మాట్లాడతాయి. జర్నలిస్టు ‘ప్రాంతీయ భావనలు’ అన్న దానిని సహజంగానే అందిపుచ్చుకుంటాడు. ఆలోచనాపరులు.. కూడా గణాంకాలను తెరపైకి తెస్తాడు. నగరాల్లో ఉండే మేథావులు దాని చుట్టూ విశ్లేషణలు చేస్తుంటారు. ప్రాంతీయ భావనలు అంటేనే వారికి భయం. దీంతో ప్రాంతీయ భావనలను ఆమోదిస్తే సరిపోతుంది అన్న స్థాయి నుంచి దాని గురించి మాట్లాడటమే ఫ్యాషన్ గా మారే స్థాయికి చేరతారు. ‘‘తెలుగు వారి ఆత్మగౌరవం’’ దెబ్బతిన్నదంటూ ఎన్టీ రామారావు ఊరూ వాడా ప్రచారం చేశారు. అందరూ దీనినే నిజమని నమ్మారు. నిజంగానే అలాంటి అన్యాయం జరిగిపోయిందని అందరూ భావించారు. అందువల్ల తెలుగు ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ సింబల్ గా మారిపోయారు.

ఆత్మగౌరవాన్ని మల్లీ సాధించుకోవాలి అన్న దాని చుట్టూ అనేక కథనాలు అల్లారు. ఏమిటిది అని ప్రతి ఒక్కరూ ఆగి చూడాలని కోరుకున్నారు కానీ అలా జరగలేదు. తెలుగు జాతీయతకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ శతాబ్దంలో తొలి దశకం నుంచి 1950ల వరకూ ఉన్నది. నిప్పు కణికలు ఆరిపోతున్నాయని  అనుకుంటున్న దశలో విశాఖ ఉక్కు పేరుతో మళ్లీ నిప్పు రాజేశారు. 60ల చివర్లో దానంత అదే ఆరిపోయింది. మళ్లీ దీని అవసరం రాలేదు. భారతదేశంలోని భాషా ప్రయుక్త రాష్ట్రాలతో పోల్చితే.. తెలుగువాళ్లు అయినందున తెలుగు వారికి ఎలాంటి నష్టం జరగలేదు. కొంతమందికి ఉన్న కుత్సితమైన ఆర్థిక, కొన్ని ప్రజాస్వామిక ఆలోచనలను ప్రాంతీయ భావనలుగా ముద్రవేశారు. అయితే, నిజానికి వీటిలో ప్రాంతీయ భావన ఏమీ లేదు కానీ.. ఒక ప్రాంతానికి పరిమితమైన వాదన. దీని ఆధారంగా ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. ఎవరి ఆకాంక్షలైతే ప్రాంతీయ భావనల రూపంలో రూపుకట్టాయో…వారి ఆకాంక్షలను ఆయన నెరవేర్చితే చాలు. అంతకు మించి ఆయన ఏమీ చేయనక్కర్లేదు. ప్రాంతీయ భావన అన్నదానిని కొనసాగించాలి. ఆ మనిషితోనే గుర్తింపు పొందాలని ప్రజలు అనుకుంటారు. ఆయన ఆచార వ్యవహారాలతో గుర్తింపు పొందాలని అనుకుంటాం. సహజంగా ప్రకృతి ఎంపిక చేసిన ప్రమాదాల వల్ల చరిత్ర ముందుకు వెళుతుందని ట్రాట్ స్కీ (Trotsky) చెప్పాడని అంటారు. వెక్టార్ మెకానిక్స్ భాషలో ఎంగెల్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సాధారణమైన అనేక గొంతుకల నుంచి భిన్నమైన భిన్నమైన గొంతుకలను వేరు చూసి తెరపైకి తీసుకురావడం ద్వారా చరిత్ర నిర్మితం అవుతుందని ఆధునిక పరిభాషలో చెబుతారు. కానీ.. అసాధారణమైన గొంతుకలను గుర్తించడం సుదీర్ఘకాలంపాటు సాగే ప్రక్రియ. చాలా సార్లు ఇది బాధలతో కూడి ఉంటుంది. కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తానికి చైతన్యం తెచ్చేదిగా ఉంటుంది. హిందూ దేవుళ్లు.. అపర భక్తులకు బానిసలు. అదే వారి బలహీనత. చాలాసార్లు వరాలు అలవోకగా ఇచ్చేస్తారు. అదే వారికి సమస్యలు తెచ్చిపెడుతుంది.

అనేక హిందూ దేవుళ్ల పాత్రలను ధరించిన ఎన్టీఆర్.. నిజానికి తాను కూడా అలాంటి హిందూ దేవుళ్లలో ఒకడినని నిజాయితీగా నమ్ముతారు. మరో వాస్తవం ఏమంటే ఆయన లెక్కకు మించి సంపాదించారని చెబుతారు (బ్లాక్ మనీ, వైట్ మనీ కలిపి కనీసం ఆయన దగ్గర రూ.50 కోట్లు ఉంటుందని ఆ రోజుల్లో అంచనా). ప్రజలు ఎన్టీఆర్ ను ఆరాధించడానికి కావాల్సిన పరిస్థితులు అప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు పిచ్చిగా ఆరాధించడం మొదలైన తర్వాత… దాడి అన్నది నిజమైన శత్రువులపై కాకుండా.. ప్రజలు తమ శత్రువులుగా భావించే వారిపై ఉంటుంది. వాళ్లంతా ఎవరంటే స్వార్థపరులైన గుమస్తాలు, పనులు చేయని అధికారులు, అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలు అన్నమాట. దీనిని అర్థం చేసుకునేందుకు ఒక సంఘటన గురించి తెలుసుకుందాం.  ఎన్టీఆర్ తొలి ఆగ్రహం గుమస్తాలపైనే. ఖచ్చితంగా చెప్పాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం కోసం పని చేస్తున్న ఎన్జీవోలు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 55 సంవత్సరాలకు తగ్గించాడు. సహజంగానే ఎన్జీవోలు సమ్మె చేశారు. ఎన్టీఆర్ మాత్రం వారిపై విరుచుకుపడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రజల కష్టాలను కడతేర్చేందుకు భువి నుంచి కిందికి దిగిన అవతార పురుషుడు ఆయన అయితే, ఈ చెత్త గుమస్తాలే ఆయన దైవ కార్యాన్ని అడ్డుకుంటున్నారు. బహిరంగ సభల్లో ఆయన ఎన్జీవోలను తిట్టిపోశారు. ఆరు కోట్ల ఆంధ్రులకు సేవ చేయాలా లేక ఆరు లక్షల ఎన్జీవోలకు సేవలు అందించాలా అంటూ తెలివితేటలతో రూపొందించిన పోస్టర్లు రాష్ట్రంలోని గోడలపై ప్రత్యక్షం అయ్యాయి. తర్వాత సచివాలయంలో కారిడార్లలో నిలబడి చిలక్కొట్టుడు కొట్టే అధికారులదీ, అవినీతిపరులైన శాసన సభ్యులదీ అయింది. సచివాలయంలో అవినీతి అన్నది వ్యవస్థీకృతం అయిపోయింది (మరీ ముఖ్యంగా చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇది జరిగింది). దీనిని బహిరంగంగానే అందరూ ఒప్పుకుంటారు. ఎన్టీఆర్ చేతిలోనే కాంగ్రెసు చావుదెబ్బతిన్నది. ఈ విషయాన్ని జాగ్రత్తగా చదవండి. ఎన్టీఆర్ అవినీతిని అంతం చేయలేదు.

అవినీతి కోసం- కాంగ్రెసు హయాంలో ఒక క్రమపద్ధతిలో కూడుకున్న వ్యవస్థను. అందుకే… మరో రూపంలో అవినీతి మళ్లీ విజృంభించింది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో  గుర్రపు డెక్క ఒక పక్కన తీసివేస్తే మరో పక్క నుంచి విస్తరిస్తూ వస్తుంది. ఇక్కడా అదే జరిగింది. ఉద్దేశాలు ఏమైనప్పటికీ.. అవినీతిని అంతం చేయడానికి అవసరమైన సృజనశక్తిగానీ, ప్రజల దన్నుగానీ ఎన్టీఆర్ దగ్గర లేవు. లోగా…సొంత ఎమ్మెల్యేలతో సహా కొంతమందిని దూషించే పనినీ, వెలివేసే పనినీ చక్కగా చేయగలిగాడు. అనేక అక్రమ మార్గాల్లో అప్పటి వరకూ కోట్లు సంపాదించుకుని… హఠాత్తుగా నీతివ్యాక్యాలు చెప్పడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. అన్నీ చేసేసి సన్యాసం తీసుకుంటాననే హిందువుల సంప్రదాయాన్ని తలపించింది. చివరికి ఎన్టీఆర్…  సన్యాసి దుస్తులు కూడా ధరించి ఒక సన్యాసిలా కనిపించారు.

(మిగతాది… డీకోడ్ టీడీపీ- పార్ట్ 3లో చూద్దాం)

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *