‘మాదే’’ మాట ! ‘‘మాదే’’ వాటా !! ‘‘మాదే’’ ఆట !!! (పార్ట్ -3)

December 4, 2018 | News Of 9

‘‘తెలుగుదేశం పార్టీ ప్రైవేటు లిమిటెడ్’’ ఆలోచన ఎప్పుడూ ఒక్కటే. జాతీయ సంపదలో మా (కమ్మవారు) వాటా ఎంత? అందుకు ఏదైనా చేయవచ్చన్నది ఈ కంపెనీ సిద్ధాంతం. అందుకే నాటికీ నేటికీ అదే పోకడ మనకు కనిపిస్తుంది. భాజపా పోతేపోయింది. బద్ధ శత్రువైనా కాంగ్రెసుతో కలిసిపోయిన సాహసి చంద్రబాబు. జనం ‘‘ఛీ’’ అన్నా… దానిని ‘‘జై’’ అన్నట్లుగా సొంత సామాజిక వర్గం తీసుకున్నది. దీనికి చంద్రబాబు డబ్బు వ్యామోహం అని చెప్పకుండా.. ఆంధ్రుల ఆత్మాభిమానం అంటారు.. రాష్ట్ర అభివృద్ధి అని దానికి అందమైన పేరు పెట్టారు. జనం నిజమేనని నమ్మడం కూడా విచిత్రమే. నేటికీ ‘‘తెలుగుదేశం ప్రైవేటు లిమిటెడ్’’ ప్రజల్ని చక్కగా నమ్మించి.. బ్లడ్ లెస్ ఆపరేషన్లు (కొత్త వైద్య విధానం మాదిరిగా) చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతున్నది.

పౌరహక్కుల నేత, గణిత మేథావి, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ బాలగోపాల్ ఈ సామాజిక దోపిడీ గుట్టువిప్పుతూ తెలుగుదేశం పార్టీని డీకోడ్ చేశారు. ఇక చదవండి..!!

బియ్యం ఎగుమతి లైసెన్సుల నుంచి… ప్రైవేటు కాలేజీల వరకూ గుత్తాధిపత్యం  వారికే లభించింది…లాభించింది!!

అవినీతిని అంతం చేసే పనుల్లో భాగంగా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు లోకాయుక్తను తెరపైకి తెచ్చారు. ఆ కుర్చీలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న మాజీ న్యాయమూర్తి, మాజీ వైస్ ఛాన్సలర్, రాడికల్ హ్యూమనిస్టు మేథావిని తెచ్చి కూర్చెబెట్టారు. ఆ వ్యక్తిది ఎన్టీరామారావు ప్రాంతానికీ, కులానికీ చెందిన వ్యక్తేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లోకాయుక్త వచ్చిందనీ, ఇక నుంచీ అధికారులు చేసే అవినీతీ, ఆశ్రిత పక్షపాతం వంటివి ఈ భూమి మీద నుంచి పోతుందన్నట్లుగా మనందరం నమ్మేలా చెప్పారు. వాస్తవాలు అందరినీ నిరాశపరిచాయి. లోకాయుక్త, ఉప లోకాయుక్త చట్టం ప్రకారం నెలకు 1150 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగులే దీని పరిధిలోకి వస్తారు. తాహసీలు గుమస్తా, గ్రామంలో పని చేసే ఉద్యోగులు, గ్రామ ప్రాంతాల్లోని పోలీసులు ఈ చట్టం పరిధిలోకి రాకుండా పోయారు. ఒక్కసారిగా లోకాయుక్త అన్నది 70 శాతం మందికి అందకుండా పోయింది. (వరంగల్లు జిల్లాలో లాకప్పుల్లో పెట్టిన చిత్రహింసలపై హెడ్ కానిస్టేబుళ్లు, ఎస్ఐలపై లోకాయుక్తకు ఫిర్యాదు చేసినపుడు.. వారు ఈ చట్టం పరిధిలోకి రారని ఒక కామెంటు రాసి ఫిర్యాదుల్ని తిప్పి పంపేసేవారు. మరి లాకప్పుల్లోకి వచ్చి సాధారణ ప్రజలను డీజీపీ స్థాయి అధికారులు వచ్చి కొడతారా?) మనం ఏ అధికారిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తున్నామో, ఒక కాపీని ఫిర్యాదు చేస్తున్న అధికారికి పైన ఉన్న అధికారికి కూడా పంపాలి అన్న షరతు లోకాయుక్త చట్టంలో ఉంది. కనీసం ప్రాథమిక స్థాయి విచారణ పూర్తయ్యే వరకైనా ఫిర్యాదును రహస్యంగా ఉంచాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే వేధించడం, ఫిర్యాదీదారుల్ని దాడులు చేయడం జరుగుతుంటాయి. ఇందులో ఉన్న మరో మతలబు ఏమంటే.. ఫిర్యాదీదారుడు తప్పుడు ఫిర్యాదు చేసినట్లయితే, ఫిర్యాదీదారుడు విచారణను ఎదర్కోవాల్సి ఉంటుంది. ఏమీలేనిదాని కంటే ఏదో ఒకటి ఉండటం మంచిదన్నట్లు తెలుగు వాళ్ల కోసమే అన్నట్లు ఎలాగైతే… లోకాయుక్త వచ్చింది. దీంతో.. ఎన్టీఆర్ కు పురణాలపైనా, చరిత్రపైనా ఆయనకు మక్కువ తగ్గలేదు. అశోకుడు 2,300 సంవత్సరాల కిందటి చెప్పిన ‘‘ధర్మ మహామాత్ర’’ను తెరపైకి తెచ్చారు. దీనికి మరో అధికారిని తెచ్చి కూర్చోబెట్టారు. స్వయంగా ధర్మమహామాత్రనే న్యాయాన్ని తనకు తానుగా రక్షించాలన్నది మౌర్యుల నాటి అర్థం. ఆధునిక రూపంలో తయారైన ధర్మ మహామాత్ర నిబంధనలతో మొత్తానికి రూపొందింది కానీ.. ఆ కుర్చీలో కూర్చునే వ్యక్తికే అదేమిటో అర్థంకాని పరిస్థితి ఉండింది. లోకాయుక్తను రద్దు చేసి.. ఆ స్థానంలో ధర్మమహామాత్ర వచ్చింది. ధర్మమహామాత్ర కూడా కాలయాపన జరిగింది. ఏదీ లేకపోవడం కంటే తెలుగువాళ్లకు ఒక ధర్మమహామాత్ర ఉన్నది. 2000 సంవత్సరాల తర్వాత రెండో రాకడ అన్నది ముందు ఫార్సుగానూ, తర్వాత విషాదంగానూ తయారైంది.

అవినీతి అంశంపై ఈ తరహా ప్రయోగాల తర్వాత, ఎన్టీఆర్.. తన దృష్టిని మరింత విస్తరించారు. అంతకు ముందున్న కాంగ్రెసు ప్రభుత్వం ‘‘నీకు ఇది నాక ఇది’’ ప్రాతిపదికన వందలాది ఇంజనీరింగ్ కళాశాలల (వీటిని డొనేషన్ కాలేజీలని పిలిచేవారు)కు అనుమతులు ఇచ్చేసింది. 25 వేల నుంచి లక్ష వరకూ అప్పట్లో వసూలు చేశాయి. కోస్తా ఆంధ్రాలో ఆస్తులున్న వర్గాలు ఈ కళాశాలలపై మోజు పెంచుకున్నాయి. అప్పటి వరకూ ఈ వర్గాలు ఇంజనీరింగ్ చదువులను కొనుక్కునేందుకు కర్ణాటక వెళ్లాల్సి వచ్చేది. మన సొమ్ములు బయట రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని వారు భావించేవారు.

కాలేజీలతో డబ్బులు సంపాదించిన ఎన్టీఆర్ సామాజిక వర్గం వాళ్లే

వాళ్ల డిమాండు మేరకు ఒక ఏడాదిలో కాంగ్రెసు ప్రభుత్వం 13 కళాశాలలకు అనుమతులు ఇచ్చేసింది. కోస్తా తీరంలో ఒకటి బాపట్లలో, ఒకటి మచిలీపట్నంలో, 2 విజయవాడలో వచ్చాయి. ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన వారు వరంగల్, హైదరాబాద్, కడపల్లో కూడా కాలేజీలు ప్రారంభించారు. ఇలా కాలేజీలు కావాలంటూ డిమాండు చేసి, వాటిని ప్రారంభించి, డొనేషన్ కాలేజీల నుంచి డబ్బులు సంపాదించిన వారంతా ఎన్టీఆర్ సామాజిక వర్గం వాళ్లే. అందువల్ల తమను ఎన్టీఆర్ ఏమీ అనడని వాళ్లు కూడా భావించారు. డొనేషన్లను రద్దు చేయాలని ఎన్టీఆర్ ఒక స్థాయిలో భావించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పోరాటం చేయడం వేరు.. డొనేషన్ కాలేజీలతో పోరాటం చేయడం వేరు అన్నది ఎన్టీయార్ కు త్వరగానే అర్థమైంది. ఆయా కాలేజీల్లో పని చేస్తున్న ఉద్యోగులంతా సొంత కులం వాళ్లే. కాలేజీలను ప్రభుత్వం లాగేసుకుంటుందని బెదిరించిన ఎన్టీఆర్.. చివరికి వారికి నిధులందించేందుకు హామీ ఇవ్వాల్సి వచ్చింది. రూ.2 కిలో బియ్యం పథకం కోసం రైసు మిల్లులపై అదనపు లెవీ విధించాలని అనుకున్నాడు. పరపతి ఉన్న రైలు మిల్లు యజమానులు సమ్మెకు దిగారు. రైసు మిల్లర్లకు అత్యంత ఇష్టమైన కోరికను నెరవేర్చిన తర్వాత వారు సమ్మె విరమించారు. లెవీయేతర బియ్యాన్ని పెద్ద ఎత్తున ఎగుమతి చేసుకునేందుకు ఎన్టీఆర్ అనుమతి ఇచ్చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లలో అమ్మే వస్తువుల ధరల్ని నియంత్రించాలని ప్రయత్నించారు.  హోటల్ యజమానులు పరిపతి ఉన్న మరో పెద్ద గ్రూపు. వాళ్లూ హోటళ్లు మూసేసి నిరసన తెలిపారు. హోటళ్లలో అప్పట్లో రెండు రకాల ఆహార పదార్ధాలు అమ్మేవారు. తెలుగుదేశం భోజనం కావాలంటే.. ముందే చెప్పాలి. అది దరిత్రంగా ఉండేది. మిగినవి మామూలు ధరకు రోజూ ఇచ్చేవి ఉండేవి. ఎన్టీఆర్ వల్ల ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన హోటళ్ల యజమానులు, రైసు మిల్లు యజమానులు ఇబ్బంది పడ్డారు. ఎన్టీఆర్ పాలన తొలి రోజుల్లో డబ్బున్న వర్గాలు ఇలా అనుకునేవి ‘‘ఈ మనిషి ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ అర్థం కాదు’’ అని.

కేంద్రంతో పోరాటం కమ్మవారికి నచ్చేది కాదు… ఎందుకంటే?

ఇవన్నీ ఒక ఎత్తు… ఎన్టీఆర్ కేంద్రంపై చేసిన పోరాటం ఒక ఎత్తు. ఎన్టీఆర్ ఎంత సీరియస్ గా కేంద్రంతో యుద్ధం చేశాడన్నది ముఖ్యం కాదు. కేంద్రంతో సంఘర్షణను ఎన్టీఆర్ సామాజిక వర్గానికి నచ్చేది కాదు. వాళ్లు కోరుకునేది ఒకటే. ప్రస్తుత పరిస్థితి మారాలి, ఏకచ్ఛత్రాధిపత్యం ఉన్న పెట్టుబడిదారీ శక్తులతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అంతేకానీ, ఆర్థిక శక్తి కేంద్రీకరణపై నిజమైన యుద్ధం చేయాలని వారు కోరుకోలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. జాతీయ ఆర్థిక సంపత్తిలో మేజర్ వాటా కోరుకున్నారు. ఆర్థిక సంపత్తిని ఎవరు ఎలా పంచుకోవాలన్న దానిలో మార్పులు రావాలని, అందుకోసం తగిన మార్పులు జరగాలని వారు ప్రగాంఢంగా కోరుకున్నారు. జాతీయ అభివృద్ధి మండలి నుంచి వాకౌట్ చేయడం ముఖ్యంకాదన్నది వారి ఉద్దేశంగా ఉంది. ఈ విషయంలో ఎన్టీఆర్.. సరికొత్త ఆలోచనా స్థాయిలో ఉన్నారు. ప్రజాస్వామ్య భావనల (అతనికి అలాంటివేమీ లేవు)కు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలు ఉన్నాయన్నది కాదు. ఢిల్లీపై అతనికి కోపం ఎందుకు ఉందన్న కారణాలను ఆధునిక కాలానికి అనుగుణంగా అర్థం చేసుకోలేం. అతను రెచ్చిపోవడానికి కారణం ఉండి ఉండాలి.. లేకపోతే అసలు కారణమే లేకపోయి ఉండాలి. అతన్ని ఎప్పుడూ పురాణాలూ, చరిత్ర వెంటాడుతూ ఉండేవి. 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాను అల్లావుద్ధీన్ ఖిల్జీ చేతిలో కాకతీయులు ఓడిపోయినందుకు మనం ప్రతీకారం తీర్చుకుంటున్నాం అన్నట్లు అతను భావిస్తాడులా ఉంది.  అప్పటి నుంచే ఢిల్లీ సుల్తానులకు, దక్కను సామంతులు, తద్వారా తెలుగు వారు ఊడిగం చేయడం ప్రారంభమైందన్నది అనేక ఆంధ్రుల చరిత్రలో ఎక్కువగా కనిపిస్తుంది.

(మిగతాది… డీకోడ్ టీడీపీ- పార్ట్ 4లో చూద్దాం) 

పార్ట్, 1, 2 స్టోరీల కోసం ఈ కింది లింకులు చూడండి.

https://www.telugu.newsof9.com/decoding-tdp-part-02/ 

https://www.telugu.newsof9.com/decoding-tdp-part-01/

 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *