దీపిక రిసెప్ష‌న్ డ్రెస్ చెత్త అంటూ వైర‌ల్‌

December 3, 2018 | News Of 9

Deeps dress became viral on Social media | news of 9

బాలీవుడ్ సెలబ్రిటీ జంట దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ లు తమ మూడవ వివాహ రిసెప్షన్ ను ముంబైలోని గ్రాండ్‌గా జ‌రిగింది. హయత్ హోటల్‌లో జ‌రిగిన ఈ ఫంక్ష‌న్‌ బాలీవుడ్ స్టార్స్‌తో క‌ల‌ర్‌ఫుల్‌గా మారింది.

 

బాలీవుడ్ కొత్త జంట రణ్‌వీర్ సింగ్-దీపిక పదుకొనే విందు ఏర్పాటు చేసారు. డిసెంబర్ ఫ‌స్ట్ రాత్రి ముంబైలో జరిగిన ఈ రిసెప్షన్ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రతీ ఒక్కర్నీ రణ్‌వీర్ సింగ్ ప్రత్యేకంగా పిలవడంతో అంతా ముంబైలోని ఈ వేడుకలో కలిసి పార్టీ చేసుకున్నారు.

 

అయితే ఈ రిసెప్షన్‌లో బ్లాక్ సూట్‌లో రణ్‌వీర్, ఎరుపు రంగు గౌన్‌లో దీపిక ఎంట్రీ ఇచ్చారు. ఆమె వేసుకున్న డ్రెస్ అత్యంత చెత్తగా ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కుర్చీలో రణ్ వీర్ పక్కన కూర్చున్న దీపిక పోజు ఏ మాత్రం బాగాలేదంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

 

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన కుటుంబ సమేతంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. సచిన్ టెండూల్కర్ సైతం తన భార్య అంజలి, త‌న‌యుడు అర్జున్ లతో రిసెప్షన్ కు రాగా, మహేష్ భూపతి, బోనీ కపూర్ తన కుమార్తెలు జాన్వీ, ఖుషీలతో హాజరయ్యారు. సౌత్ నుంచి శంకర్ లాంటి దర్శకులు కూడా ఈ వేడుకలో కనిపించాడు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *