తెలుగు రాష్ట్రాల సంక్షేమం, అభివృద్ధే జనసేన ల‌క్ష్యం

April 23, 2019 | News Of 9

  • జనసేన నేత మాదాసు గంగాధ‌రం

(న్యూస్ ఆఫ్ 9)

తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యమంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో చెప్పిన ప్రకారం..  పోలవరం ప్రాజెక్ట్ విష‌యంలో సహకరించాల‌ని జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ మాదాసు గంగాధ‌రం కోరారు. పోలవరం సామర్థ్యం పెంపుతో భద్రాద్రికి ముప్పు అని తెరాస ప్రభుత్వం అభ్యంతరాలు వ్య‌క్తం చేస్తున్నట్లుగా దిన‌ ప్ర‌తికల్లో వ‌చ్చిన అంశంపై ఆయ‌న స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ వలన ఏర్పడే ముంపు ప్రాంతాలకు ఇప్పటికే పరిహారం అందిస్తున్నందున కొత్తగా ఏమైనా ప్రాంతాలు చేరితే ఆ ప్రాంతాలకు కూడా న్యాయం చేయాలని జనసేన పార్టీ కోరుకుంటున్నట్లు తెలిపారు.

ముంపు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల నుంచి తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైన నెల్లిపాక వరకు కరకట్టను నిర్మించాలని డిమాండు చేశారు. కరకట్ట నిర్మాణం, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను అభివృద్ధి చేయటం ద్వారా ముంపు ప్రాంతాల తీవ్రతను తగ్గించవచ్చని, ఆ విధంగా కృషి చేయాలని సూచించారు.  కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ముంపు ప్రాంతాల నష్ట పరిహారం అందేలా చర్యలు చేపట్టాల‌న్నారు.

ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇరు రాష్ట్రాలు సంయమనం తో ముందుకు సాగాలని, రెండు తెలుగు రాష్ట్ర ప్రజల సంక్షేమంఅభివృద్ధి కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజల సంక్షేమంఅభివృద్ధే జనసేన  ల‌క్ష్యం  అనిప్రజా సంక్షేమం దృష్ట్యా ఇరు రాష్ట్రాలు సంయమనంతో ముందుకు సాగాలని మదాసు గంగాధరం హితవు పలికారు. ఈ మేరకు మంగళవారంనాడు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *