డబ్బుపై మీకు ఎప్పుడైనా పిచ్చి కోపం వచ్చిందా?

December 8, 2018 | News Of 9

Did you ever hate on currency? | Newsof9

(న్యూస్ ఆఫ్ 9 టీజర్)

డబ్బు గురించి… మనం రోజూ పత్రికల్లో, టీవీల్లో వార్తలు చూసినపుడు ఒక్కోసారి గుండె వేగం పెరిగిపోతుంది. సుజనా చౌదరి ఆరు వేల కోట్లు కొట్టేశాడు. నీరవ్ మోడీ వేల కోట్లు కొట్టేసి పారిపోయాడు. తిరువనంతపురం పద్మనాభస్వామి గుడిలో మాదిరిగా చంద్రబాబు దగ్గర నేలమాళిగలో ఎన్నో లక్షల కోట్లు ఉన్నాయంట… జగన్ దగ్గర 2 లక్షల కోట్ల నల్ల డబ్బు ఉందంట. మొన్న నోట్ల రద్దు సమయంలో నల్లడబ్బును మార్చుకోలేక చాలా మంది రోడ్లపై విసిరేశారు.. అప్పుడు మీకు డబ్బు మీద పిచ్చి కోపం వచ్చి ఉంటుంది (అంత డబ్బు మన దగ్గర లేక సుమా!).

ఇవన్నీ చూసిన తర్వాత మనసు చెదిరిపోతుంది. కకావికలం అయిపోతుంది. మంచివాళ్లు కూడా పిచ్చివాళ్లుగా అయిపోతారు. ఛీ ఛీ మనం ఉన్నాం… ఎందుకు నెలకు 50 వేలు సంపాదించడానికి యజమానులతో నానా తిట్లూ తింటున్నాం. ఇది కాదు కానీ… దోచుకుంటే పోలా అనిపిస్తుంది. మరీ తెగించి ఏ ఏటీఎంనో దోచుకుంటే పోలీసులు పట్టుకుపోతారు. మళ్లీ భయం!!

మరేం చేయాలి? ఏదో ఒక స్వామీజీ దగ్గరకు వెళ్లి ‘‘స్వామీ ఏమిటి ఇలా ఉండిపోయాను’’ అని అడుగుతారు (దేవుడుని అడిగితే ఇలాంటి వాటికి సమాధానం చెప్పలేడు కదా). ఆయన ఏదో ఒకటి చెప్పి ఈ మంత్రం చదువుకో నువ్వు కూడా జగన్ సంపాదించినంత సంపాదిస్తావు ఫో అంటూ విభూతి పొట్లాం ఇచ్చి ఇంటికి పంపేస్తాడు.

అసలు డబ్బే లేని ప్రపంచం ఎలా ఉంటుందోనన్న ఆలోచన వచ్చి ఉంటుందా మీకు? వచ్చే ఉంటుంది. కానీ అసాధ్యం అని అనిపిస్తుంది కదూ!

దుర్గానంద్ అని ఒక కవి ఉన్నారు. ఆయన ‘‘సృజనకర్తల రాజ్యం’’ ఆయన ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించారు. ఆచరణలో కాదు… ఆయన మస్తిష్కంలో… అది చదివితే డబ్బు లేకుండా, దుర్మార్గాలు లేకుండా, దొంగతనాలు లేకుండా అందరూ ఎలా సంతోషంగా జీవించవచ్చో చెబుతారు. (లోక్ సత్తా జయ ప్రకాష్ నారాయణ చెప్పే యుటోపియన్ సిద్ధాంతం వంటిది కాదు లెండి).

ఒకరిని చూసి మరొకరు ఈర్ష్య పడాల్సిన పని ఉండదు. మనిషిని మనిషిగా చూసే సమాజం.. మళ్లీ అసాధ్యం అని అనుకుంటున్నారా… వెయిట్ మిత్రమా… ఇదో ‘‘కొత్త కోణం’’. ఓ కొత్త ఆలోచన… ఇలా సమాజం గురించి ఆలోచించే వారు కూడా ఉంటారని తెలియాలి కదా. ఎంతసేపూ… చంద్రబాబూ, నారాయణ, లోకేష్, సుజనా చౌదరి… ఇవి కాదు. మధ్య మధ్యలో మనిషిపై మనిషి నమ్మకాన్ని పెంచే ఆలోచనలు కూడా ఉంటాయి కదా…

దుర్గానంద్ గారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినపుడు.. కేంద్ర ప్రభుత్వం భయపడింది. అర్జంటుగా వెళ్లి వాడెవడో చూసిరమ్మని ప్రణబ్ ముఖర్జీని ‘‘నూజివీడు’’ వెళ్లి చూసి రమ్మని పంపారు. ఆయన అర్బన్ నక్సల్ కాదని చెప్పిన తర్వాత కేంద్రం నిద్రపోయింది. తుపాకీ పట్టిన విప్లవకారుడి కంటే కవులకే పాలకులు భయపడతారు. అందుకే పుస్తకాలను నిషేధిస్తుంటారు.
త్వరలో ఈ వినూత్న ఆలోచనను మీ ముందుకు తెస్తుంది మీ ‘‘న్యూస్ ఆఫ్ 9’’. (హోషియార్: ఇది చదివిన తర్వాత ‘‘యదవ డబ్బు’’ అని మీకు డబ్బు మీద వ్యామోహం పూర్తిగా పోతే తప్పు మాది కాదు).

(త్వరలో… త్వరలో… త్వరలో)

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *