నదీ జలాలపై ఇరు రాష్ట్రాలూ తేల్చుకుంటే చాలు: సుప్రీంకోర్టు

December 10, 2018 | News Of 9

Supreme Court | telugu.newsof9.com

న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కృష్ణా ట్రైబ్యునల్లో నదీ పరివాహక నాలుగు రాష్ట్రాల వాదనలు మొదటి నుంచీ వినాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. గతంలో ఇదే తరహాలో తెలంగాణ వేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఏపీ విభజన చట్టం ప్రకారం… విడిపోయిన తెలుగు రాష్ట్రాల మధ్య వాదనలు సరిపోతాయంటూ ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించింది. దీంతో మళ్లీ విషయం ట్రిబ్యునల్ కు చేరుతుంది. కృష్ణా నదీ జలాల పంపిణీపై ట్రైబ్యునల్ లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాదనలు యథావిధిగా కొనసాగుతాయి.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *