విద్యార్ధుల జీవితాలతో ఆటలా…?

April 24, 2019 | News Of 9

Pawan Kalyan | telugu.newsof9.com

  • ఇంటర్ బోర్డు వైఖరి సమంజసంగా లేదు
  • బాధ్యులైన అధికారులను, ప్రైవేటు సంస్థనూ శిక్షించాలి
  • విద్యార్ధుల ఆత్మహత్యలు బాధాకరం
  • ధైర్యంగా ఉండాలంటూ హితవు
  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్

(న్యూస్ ఆఫ్ 9)

తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన తెలంగాణ ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యల పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి చెందారు. అత్యంత భాధాకరమైన ఈ అంశంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో ‘‘విద్యార్థుల భవిష్యత్ ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అగమ్యగోచరంగా మార్చడం దారుణం. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. ఇంటర్ ఫలితాలు ప్రకటించాక 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యుయేషన్ నుంచి ఫలితాల వెల్లడి వరకూ ప్రతి దశపైనా విద్యార్థుల్లోనూ, వారి తల్లితండ్రుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసి, నిజాలు వెల్లడించాలి. సందేహాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, వారి తల్లితండ్రులపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎదురుదాడి చేసే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. విద్యార్థులకు ఉచితంగా రీ వాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ చేయాలి’’ అని పవన్ సూచించారు.

ఆత్మహత్యలకు పాల్పడొద్దు

‘‘జీవితం చాలా విలువైనది. ఈ ఫలితాలతో నిరాశ చెంది ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. విద్యార్థులకు జనసేన అండగా నిలుస్తుంది. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేసి తగిన పరిహారం చెల్లించాలి. ఇన్ని తప్పిదాలకు కారణమైన బోర్డు అధికారులు, సాఫ్ట్ వేర్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు న్యాయ విచారణకు ఆదేశించాలి’’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Other Articles

8 Comments

  1. It’s actually a great and helpful piece of info.

    I am glad that you shared this helpful info with us. Please stay us informed like this.
    Thank you for sharing. 2CSYEon cheap flights

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *