ఏలూరు పార్లమెంటు జనసేన అభ్యర్ధిగా డాక్టర్ పుల్లారావు

March 16, 2019 | News Of 9

ప్ర‌ముఖ ఎకాన‌మిస్ట్‌, కాల‌మిస్ట్ డాక్ట‌ర్ పెంటపాటి పుల్లారావును ఏలూరు లోక్‌స‌భ స్థానం జ‌న‌సేన అభ్య‌ర్ధిగా పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. శ‌నివారం రాత్రి విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో పుల్లారావు అభ్య‌ర్ధిత్వాన్ని ఖ‌రారు చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడుతూ… “పుల్లారావు గారు గిరిజ‌నుల స‌మ‌స్య‌ల పైనా, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం చేసిన పోరాటాలు, బాధితుల‌కి అండ‌గా నిల‌బ‌డిన తీరు న‌న్ను ఆక‌ట్టుకున్నాయి. ఆయ‌న సేవ‌లు దేశానికి చాలా అవ‌స‌రం. ఇలాంటి ఉన్న‌త‌మైన వ్య‌క్తులు పార్ల‌మెంటుకి వెళ్లాలి. రూ. 50 కోట్లు పెట్టి ఎంపీలు అయిపోదామ‌ని వ‌చ్చే వారు కాదు., విలువ‌ల‌తో కూడిన విజ‌యం సాధించిన వ్య‌క్తులు పార్ల‌మెంటుకి వెళ్లాల‌ని చిన్న‌నాటి నుంచి మ‌న‌స్ఫూర్తిగా కోరుకున్నాను. అలాంటి విలువ‌లు క‌లిగిన వ్య‌క్తి పుల్లారావు. సీనియ‌ర్ ఎకాన‌మిస్ట్‌గా పేరున్న ఆయ‌న చిన్న‌నాటి నుంచి విదేశాల్లో చ‌దువుకున్నా, దేశీయ సంస్కృతీ, క‌ట్టుబాట్లు, ఆచార వ్య‌వ‌హారాల మీద అపార‌మైన గౌర‌వం ఉన్న వ్య‌క్తి. ఆయ‌న రాసిన ఆర్టిక‌ల్స్ దేశ‌విదేశాల్లో ప్ర‌చురితం అవుతూ ఉంటాయి. ఇవ‌న్నీ చాలా సంవ‌త్స‌రాల నుంచి నా దృష్టికి వ‌చ్చాయి. అందుకే ముందుగా వారిని సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించాను. నా ఆహ్వానాన్ని మ‌న‌స్ఫూర్తిగా మ‌న్నించి పార్టీలో చేరినందుకు ముందుగా ధ‌న్య‌వాదాలు. ఇప్పుడు నా అభ్య‌ర్ధ‌న‌ను అర్ధం చేసుకుని జ‌న‌సేన పార్టీ త‌రుపున ఏలూరు లోక్‌స‌భా స్థానం నుంచి నిల‌బ‌డ‌డానికి అంగీక‌రించినందుకు మ‌రోసారి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెల‌పుతున్నాను. పోల‌వ‌రం బాధితుల‌కి అండ‌గా నిల‌చిన మీ విజ‌యం పోల‌వ‌రం బాధితుల విజ‌యం, మీ విజ‌యం స‌గ‌టు మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తి విజ‌యం. మీలాంటి రాజ‌కీయ విలువ‌లు ఉన్న వ్య‌క్తులు పార్ల‌మెంటుకి వెళ్ళాలి” అన్నారు. పుల్లారావు మాట్లాడుతూ.. “ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి రాజ‌కీయాల‌ని చూస్తున్నా, రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం దిశ‌గా అడుగులు ముందుకి వేసే ప్ర‌య‌త్నం చేసిన మొద‌టి పొలిటిక‌ల్ పార్టీ జ‌న‌సేన‌. 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం అమ‌లుతోపాటు, మిగిలిన రాజ‌కీయ పార్టీలకి భిన్నంగా ముందుకి వెళ్తున్నారు. ఇలాంటి విధానాలు మార్పుని తీసుకువ‌స్తాయి. అలాంటి పార్టీ నాలాంటి వ్య‌క్తికి పార్ల‌మెంటుకి పోటీ చేసే అవ‌కాశం ఇవ్వ‌డం గొప్ప‌విష‌య‌మ‌న్నారు. జ‌న‌సేన పార్టీ త‌ప్ప‌కుండా దేశ రాజ‌కీయాల్లో ఓ కొత్త పంథాని తీసుకువ‌స్తుంద‌”న్న ఆకాంక్ష‌ని వెలిబుచ్చారు.

జనసేనలో చేరిన షేక్ జియా ఉర్ రెహమాన్

గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ జియా ఉర్ రెహమాన్ శనివారం జనసేనలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరారు. రెహమాన్ ను సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, పార్టీ సిద్దాంతాలు నన్ను ఆకట్టుకున్నాయి. బడుగు బలహీన వర్గాలపట్ల, మైనార్టీలపట్ల వారికి ఎంతో ప్రేమాభిమానాలున్నాయి” అని అన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *