ఎన్నికల సంఘం కొత్త రూల్స్…. ఆలస్యం కానున్న ఫలితాలు

December 10, 2018 | News Of 9

EC new rules.. results announced with little delay | Newsof9

హైదరాబాద్: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు జరుగనుంది. రౌండ్ రౌండుకు ఫలితాలు మారుతూ రాజకీయ నాయకులకు ముచ్చమటలు పట్టించే ఫలితాలు రేపు ఆలస్యం కానున్నాయి. ఎన్నికల సంఘం విధించిన కొత్త నిబంధనలే దీనికి కారణమని తెలుస్తోంది.

గతంలో ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో ప్రతీ రౌండు ఫలితాలు వెంటనే బయటకు ప్రకటించేవాళ్లు. అయితే కొత్త రూల్ ప్రకారం ప్రతీ రౌండు ఫలితాన్ని స్టే‌ట్‌మెంట్ రూపంలో ముందు పోటీ చేసిన అభ్యర్థులకు ఇస్తారు. వారు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోతే దానిపై రిటర్నింగ్ అధికారి సంతకం చేసి మీడియాకు ఇస్తారు. అంతే కాకుండా ఆ రౌండ్ ఫలితాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.

ఇలా ప్రతీ రౌండు ఫలితం స్టేట్‌మెంట్ రూపంలో పెట్టిన తర్వాతే ఫలితం ప్రకటిస్తారు. దీంతో చివరి ఫలితం గతంలో కంటే రెండు గంటల ఆలస్యం అవ్వొచ్చని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ప్రతీ రాష్ట్రంలో ఈ నిబంధన రేపటి నుంచి అమలు చేయనున్నారు.

ఇక తెలంగాణలోని 119 నియోజకవర్గాల కౌంటింగ్ 31 జిల్లా కేంద్రాల్లో జరుగనుంది. ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *