ఈసీకి రాజకీయ రంగు పులమవద్దు: ద్వివేదీ

March 14, 2019 | News Of 9

EC working with out bias: Dwivedi

అమరావతి: ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, ఎన్నికల సంఘానికి రాజకీయాలను  అపాదించవద్దని, ఏ రాజకీయ పార్టీకీ ఎన్నికల సంఘం కొమ్ము కాయదని, ఎవరికి నచ్చిన అన్వయం వారు ఇచ్చుకోవద్దని ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది హితవు పలికారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందని, ఎన్నికల ప్రక్రియ మీద విశ్వాసాన్ని దెబ్బ తీసేలా ఎవరూ  ప్రవర్తించవద్దని ఆయన అన్నారు. 20వ తేదీలోపు ఫారం-7 దరఖాస్తులను  క్లియర్ చేస్తామని, 165 నియోజక వర్గాలలో దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, ఎన్నికల ప్రక్రియలో సంఘానిది రిఫరీ పాత్ర మాత్రమే అనీఎవరి పక్షాన పని చేయదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  ఫారం-7 మొత్తం దరఖాస్తులు 9,44,825 వచ్చాయని,

6,10,143 దరఖాస్తుల తిరస్కరించామనీ, 2,58,852 దరఖాస్తులను ఆమోదించామని అన్నారు. ఇప్పటి వరకు 1,42,408 డూప్లికేట్ ఓట్లను తొలగించామని చెప్పారు. జిల్లా యంత్రాంగాల నుంచి క్షేత్ర స్థాయి నివేదికలు రాకుండా ఓట్ల తొలగింపు సాధ్యపడదని, ఫారం-7 దరఖాస్తులపై రాష్ట్ర వ్యాప్తంగా 440 కేసుల నమోదయ్యాయని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల నగదు, 16 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత  కొత్త ఓట్ల కోసం 3,57,539  ఫారం –6దరఖాస్తులు వచ్చాయని అన్నారు. మార్చి 15 నాటికి పది లక్షల దరఖాస్తులు రావొచ్చని అంచనా ఉందని, 2015-17 మధ్య వేర్వేరు సర్వేలలో  వేర్వేరు కారణాలతో25 లక్షల ఓట్ల తొలగించారని, 2014 ఓటర్లతో పోలిస్తే 2019లో ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని అన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *