ప్రత్యేక హోదా కోసం రోడెక్కిన ఉద్యోగులు..

February 8, 2019 | News Of 9

Employees hit the road demanding Special Category Status

విజయవాడ: ఏపీ జెఏసి అమరావతి ఆధ్వర్యంలో గొల్లపూడి వై జంక్షన్ లో గాంధీగిరి పద్దతిలో వాహనాలను శుభ్రం చేస్తూ ఉద్యోగులు నిరసన చేపట్టారు. అనంతరం మనవహారంగా ఏర్పడి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో ప్రత్యేక హొదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, అమరావతి ఏపి జెఏసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా సాధన సమితి చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలను నమ్మించి గొంతు కోశారని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారనీ.. ఆయనకు కుండలు, కుండ పెంకులతో స్వాగతం పలుకుతామని ఈ ప్రకటించారు.

అమరావతి ఏపి జెఏసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 11న ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న దీక్షకు మూడు వేల మంది ఉద్యోగులు తరలివెళ్తున్నామని వెళ్లడించారు. హోదా సాధించే వరకు ఉద్యోగులు పోరాటం చేస్తారని తెలియజేశారు. మోదీ ఏపీ పర్యటన సందర్భంగా కూడా వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తమ భవిష్యత్ కార్యాచరణ ను తెలిపారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *