విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు

March 16, 2019 | News Of 9

 

Encounter in Visakha distrit, Two Maoists dead

  • ఇద్దరు మావోయిస్టుల మృతి

విశాఖపట్నం: పెద బయలు మండలం  పెద్దకోడాపల్లి సమీపంలోని  బురద మామిడి వద్ద  మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురు కాల్పులు సంఘటనలో ఇద్దరు మావోయిస్టుల చనిపోగా, రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఎదురుకాల్పులు సంఘటన జరిగింది. సుమారు 20 మంది మావోయిస్టులు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టులు పోలీసులను చూసి కాల్పులు జరపగా వెంటనే పోలీసులు ఆత్మరక్షణార్థం ఎదురు కాల్పులు జరిపారు. వీరికి పెదబయిలు ఏరియా కమిటీ సుధీర్ నేతృత్వం వహించినట్లు తెలుస్తోంది. గ్రేహౌండ్స్, జిల్లా స్పెషల్ పార్టీలు పాల్గొన్నాయి. ఒక సీఆర్పీఎఫ్ జవాన్ కాలికి గాయం అయింది. చనిపోయిన మావోయిస్టులను గుర్తించవలసి ఉంది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *