అందరికీ అవకాశాలు…ఇది ఇంటింటికీ తెలియాలి!!: పవన్ కళ్యాణ్

March 3, 2019 | News Of 9

Pawan Kalyan | telugu.newsof9.com

  • రాజకీయం ఓ సామాజిక బాధ్యత
  • ప్రతి జనసైనికుడు గ్రామాలకు వెళ్ళి జనసేన సిద్ధాంతాలు చెప్పండి
  • చిత్తూరు జిల్లా జనసైనికుల సమావేశంలో పవన్ కల్యాణ్

చిత్తూరు: అనుకోగానే అయిపోవడానికి ఇది సినిమా కాదనీ, రాజకీయం అన్నది ఒక సామాజిక బాధ్యత అనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కులాలు, మతాలకూ అతీతంగా అందరికీ సమాన అవకాశాలు జనసేన కల్పిస్తుందని, ఈ సమాచారం ప్రతి ఇంటికీ వెళ్లిపోవాలని జన సైనికులకు దిశానిర్దేశం చేశారు. సీనియ‌ర్ విశ్లేషకులు, మాజీ ఐఎఎస్‌, ఐపీఎస్‌ అధికారులే కాదు… తాను ఎవరిమీదా ఆధారపడి పార్టీ పెట్టలేదనీ, అన్నిటికీ సిద్ధమయ్యే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఏదో ఒక రోజు రాజ‌కీయాల్లోకి రాక‌ త‌ప్ప‌ద‌న్న విష‌యం ముందే తెలుస‌న్నారు. ఆదివారం చిత్తూరు న‌గ‌రంలోని బాన్స్ హోట‌ల్‌లో జిల్లాకి చెందిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మయ్యారు. ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడుతూ… “అన్నీ ఆలోచించే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. అందుకోసం నేను ఎన్నో పుస్త‌కాలు చ‌దివా. అవ‌గాహ‌న చేసుకున్నా. ఇది సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం. ఒక వేళ 2019 ఎన్నిక‌ల కోస‌మే వ‌చ్చామ‌నే వారు ఎవ‌రైనా ఉంటే ఇప్పుడే వెళ్లిపోవ‌చ్చు. క‌నీసం ప‌దేళ్లు క‌లిసి ప్ర‌యాణం చేసే ఓపిక లేన‌ప్పుడు ఏం సాధిస్తాం? నేను జాగ్ర‌త్త‌గా, బాధ్య‌త‌గా ఉన్నా. యువ‌త‌కి బాధ్య‌త నేర్పేందుకు వ‌చ్చా. మీ భ‌విష్య‌త్తు, భావిత‌రాలు బాగుండాల‌ని వ‌చ్చా. ఈ ద‌రిద్ర‌పు రాజ‌కీయాల‌తో విసిగిపోయాం. ప్ర‌తి జ‌న‌ సైనికుడు గ్రామ‌గ్రామానికి వెళ్లండి. మన పార్టీ సిద్ధాంతాలు చెప్పండి. కుల‌మ‌తాల‌కి అతీతంగా అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని చెప్పండి. పెద్ద‌ల‌ని క‌లుపుకొని వెళ్లండి. 2019లో జ‌న‌సేన స‌త్తా చాటండి” అని అన్నారు.

మానవత్వం లేని వాళ్లా నా గురించి మాట్లాడేది..

‘‘మీడియాలో నేను ఏదైనా మంచి మాట మాట్లాడితే చూపించ‌రు. నేన‌న్న మాట‌ని మిస్ ఇంట్రప్ట్ చేసి మాత్రం ప‌దే ప‌దే చూపిస్తూ ఉంటారు. భ‌గ‌త్‌సింగ్ గురించి మాట్లాడిన‌ప్పుడు నేన‌న్న‌ది ఏంటి?  మీరు చూపించింది ఏంటి.?  నేను ఆళ్ల‌గ‌డ్డ‌లో ఒక మాట మాట్లాడితే పాకిస్థాన్ పేప‌ర్‌లో వ‌చ్చేస్తుంద‌ని క‌ల‌గంటానా.?  అది ప‌ట్టుకుని మీరు మా దేశ‌భక్తిని శంకిస్తారా.?  టీడీపీ, వైసీపీ, భాజపా పార్టీల స‌భ‌ల్లో ఏనాడైనా జాతీయ జెండాలు క‌న‌బ‌డిన దాఖ‌లాలు ఉన్నాయా? ఆ పార్టీ నాయ‌కులు ఏనాడైనా జాతీయ జెండా ప‌ట్టుకున్నారా?  వాళ్ళా మా దేశ‌భ‌క్తి గురించి మాట్లాడేది. జ‌న‌సేన పార్టీ సభల్లో మాత్ర‌మే జాతీయ జెండాలు క‌న‌బ‌డ‌తాయన్న విష‌యం గుర్తుంచుకోండి. నా దేశ‌భ‌క్తిని మీ ముందు రుజువు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. బీజేపీ అధికార ప్ర‌తినిధి మ‌న గురించి మాట్లాడుతున్నారు. కారులో వెళుతూ ఇద్ద‌రు వ్య‌క్తుల్ని ఢీకొట్టేసి, అందులో ఒక‌రు మృతి చెందినా ఆగకుండా మరో కారులో వెళ్లిపోయిన వ్య‌క్తి ఆయన. అలాంటి మాన‌వ‌త్వం లేని వ్య‌క్తి నా గురించి మాట్లాడటమేమిటి? 1997లోనే తెలంగాణ వ‌చ్చేస్తుంద‌న్నారు. 2014లో తెలంగాణ వ‌స్తుంద‌ని వారికి ఏమైనా ముందే తెలుసా?  నోట్ల ర‌ద్దు గురించి బ్యాంక‌ర్లు ముందుగానే చెప్పేశారు. 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ముఖ్య‌మంత్రి,  ప్ర‌ధానమంత్రి, నేను క‌లిసి తిరుగుతున్న సంద‌ర్భంలో అవినీతి నిర్మూల‌నకి పెద్ద నోట్లు ర‌ద్దు చేయాల‌న్న మాట వ‌చ్చింది. అలా అని అంతా ముందే ప్లానింగ్ చేసిన‌ట్టా. ఉగ్ర‌వాదులు ఉన్నారు. దేశ స‌మ‌గ్ర‌త‌ని దెబ్బ‌తీసే వ్య‌క్తులు ఉన్నారు. దేశ అంత‌ర్గ‌త స‌మ‌గ్ర‌త‌ని నిలువ‌రించే వ్య‌క్తులు ఉన్నారు. వారిని నిలువ‌రించ‌డం దేశ‌భ‌క్తి కాదా?’’ అని ప్రశ్నించారు.

‘‘నేను రాయ‌ల‌సీమ‌లో తిరిగేందుకు సిద్ధ‌మైన ప్ర‌తిసారీ కోస్తాంధ్ర‌కే ప‌రిమితం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మీ బ‌లం రెండు జిల్లాలే అని చెబుతున్నారు. మీరెవ‌రు.. రెండు జిల్లాల‌కే మ‌మ్మ‌ల్ని ప‌రిమితం చేయ‌డానికి. రాయ‌ల‌సీమ‌కి వ‌చ్చి న‌డిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు వ‌చ్చి చూపించాం. మ‌న బ‌లం చాటాం. రాష్ట్రంలో ఏ మూల‌కి వెళ్లినా జ‌న‌సేన జెండా ఎగ‌ర‌ని ప్రాంతం లేదు. జ‌న‌సైనికుడు లేని ఊరు లేదు. మ‌నం పాటించే బ‌ల‌మైన విలువ‌లు పాటించ‌గ‌ల‌మా, లేదో అన్న భ‌య‌తో కొంత మంది మన పార్టీలోకి రావడం లేదు. అలా పాటించ‌గ‌లిగేవారు మాత్ర‌మే రండి. నాతోపాటు నాయ‌కులు ప్ర‌యాణం చేయాలంటే చాలా గుండె నిబ్బ‌రం కావాలి. నేను ఒక్క‌సారి మాట చెబితే వెనుక‌డుగు వేసే ప‌రిస్థితి ఉండ‌దు. రామ‌బాణంలా దూసుకుపోవాలి. చిత్తూరులో రాజకీయం అంటే రౌడీ పాలనగా మారిపోయింది. ఇక్కడ రాజకీయ ప‌రిస్థితులు మారాలి. ప్రక్షాళన జరిగి తీరాలి. జనసేనతో ఈ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుడదాం. తిరుప‌తిలో చిరంజీవి నామినేష‌న్ వేయ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు నాటి కాంగ్రెస్ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి చేసిన గందరగోళం, అతని తీరు మ‌రిచిపోలేదు. రాజ‌కీయం అంటే అదేమైనా మీ కుటుంబాల హ‌క్కా.?  మాకు అవ‌స‌రం లేదా.? ఇది ప్ర‌జాస్వామ్యం. నామినేష‌న్ కూడా వేయ‌రాదంటే ఎలా? మీరు దాడులు చేస్తుంటే చేతులు ముడుచుకు కూర్చునేవారు ఎవ‌రూ లేరిక్క‌డ‌. ఇది ప్ర‌జాస్వామ్యం. పనిచేసే వారు, నిబద్ధత ఉన్నవారు, ప్రజా సమస్యలపై పోరాడేవారు రాజ‌కీయాల్లోకి రావాలి. రాజ‌కీయం అంటే భౌతిక దాడులు సైతం ఉంటాయ‌ని తెలుసు. అన్ని తెలిసే ముందుకి వ‌చ్చా’’ అని చెప్పారు.

ఆ బాధ్యత జనసేనదే

‘‘చిత్తూరు జిల్లాలో చ‌క్కెర క‌ర్మాగారం మూసేశారు. ఎన్నాళ్ల‌యినా దాన్ని తెర‌వ‌రు. స‌హ‌కార రంగంలో ఉన్న విజ‌య డైరీని చంపేశారు. ప్ర‌యివేటు డైయిరీలు పెరిగిపోతుంటే పాల‌కులు చోద్యం చూస్తున్నారు. అలాంటి స‌హ‌కార రంగ క‌ర్మాగారాల‌నీ, విజ‌య డైయిరీని తెరిచి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత జ‌న‌సేన పార్టీ తీసుకుంటుంది. ఒక్క చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరులోనే కాదు  రాష్ట్రంలో అవినీతి లేని చోటు ఎక్క‌డ ఉంది? ఆ అవినీతిని పార‌దోలేందుకే జ‌న‌సేన పార్టీ వచ్చింది. జ‌న‌సేన పార్టీ పెట్టిన‌ప్పుడు అద్భుతాలు చేస్తామ‌ని పెట్ట‌లేదు. ఇంత మంది కూడా వెంట‌లేరు. అయితే ఎప్పుడో ఒక‌ప్పుడు ప్రజలు తనతో వస్తారని మాత్రం తెలుసు” అని పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్తూరు జిల్లాలోకి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన జ‌న‌సేన శ్రేణుల‌కి, ప్ర‌జ‌ల‌కి పేరు పేరునా పవన్ కళ్యాణ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Other Articles

23 Comments

  1. I must express appreciation to the writer just for rescuing me from this issue. As a result of checking throughout the the net and finding opinions which were not pleasant, I figured my life was done. Being alive devoid of the solutions to the problems you have resolved by way of your main site is a crucial case, and the kind which might have in a negative way damaged my career if I had not come across your blog. Your good mastery and kindness in controlling the whole thing was invaluable. I’m not sure what I would have done if I hadn’t discovered such a solution like this. I can at this moment look forward to my future. Thanks very much for this high quality and result oriented help. I will not think twice to suggest the website to any individual who needs guide on this matter.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *